యౌమ్-అల్-ఖియామ: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (11), typos fixed: ను → ను , → , , → , (8), , → , (2)
పంక్తి 1:
ఒకానొక రోజు సర్వసృష్టీ అంతమగును. ఆ రోజునే [[ఇస్లాం]]లో '''యౌమ్-అల్-ఖియామ''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : يوم القيامة) (ఉర్దూ : ఖయామత్) అర్థం 'ప్రళయాంతదినం', సృష్టి యొక్క ఆఖరి రోజు. ఖయామత్ పై విశ్వాసముంచడాన్ని [[అఖీదాహ్]] అంటారు. ఖయామత్ గురించి [[ఖురాన్]] లోను, [[హదీసులు|హదీసుల]] లోనూ క్షుణ్ణంగా వర్ణింపబడింది. [[ఉలేమా|ఉలేమాలు]] అయిన [[అల్-ఘజాలి]], [[ఇబ్న్ కసీర్]], [[ఇబ్న్ మాజా]], [[ముహమ్మద్ అల్-బుఖారి]] మొదలగువారు విశదీకరించారు. ప్రతి [[ముస్లిం]] మరియు, ముస్లిమేతరులు తమ తమ కర్మానుసారం [[అల్లాహ్]] చే తీర్పు చెప్పబడెదరు - ఖురాన్ 74:38. ఖురానులో 75వ [[సూరా]] ''అల్-ఖియామ'' పేరుతో గలదు.
 
====ఇతర పేర్లు====
పంక్తి 40:
 
== విగ్రహాల తిరస్కరణ==
ఇన్నాళ్ళూ పూజలందిన విగ్రహాలు, మూర్తులు [[అల్లాహ్|అల్లాహ్ యే]] సర్వేశ్వరుడని, తాము తప్పుగా పూజింపబడ్డామని ఘోషిస్తాయి . [[ఈసా|ఈసా ప్రవక్త]] తిరిగొస్తాడు మరియు, తనను సర్వేశ్వరుడిగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తాడు. ([[ఖురాన్]] 9:31,43.61). [[మహమ్మదు ప్రవక్త]] ప్రవచించారు " ప్రజలలో ఎవరైనా మతపెద్దలు,మహనీయులు,ఫకీరులు, సెయింట్లు మరణించినపుడు, వారి సమాధులపై పూజాగృహాలను ఏర్పాటుచేసేవారు, వారిచిత్రపటాలను తగిలించేవారు, అల్లాహ్ దృష్టిలో, "[[ఖయామత్]] " రోజున వారు అత్యంతనీచమైనవారు". (''[[సహీ బుఖారి]]'').
*ఆరోజున దేవుడు తనకు బదులుగా ప్రజలు పూజించిన విగ్రహాలను ఒకచోట చేర్చి " ప్రజల్ని మీరు దారి తప్పించారా వాళ్ళకై వాళ్ళే దారితప్పారా ?" అని అడుగుతాడు.అందుకు ఆ చిల్లర దేవుళ్ళు "అయ్యో దేవా, మాకు అంత దైర్యం లేదు. వాళ్ళే నిన్ను మరచి నాశనమై పోయారు" అంటారు. (ఖురాన్ 25:17,18)
*మీరు కల్పించుకున్న దేవుళ్ళంతా ఇప్పుడు ఎటుపోయారు? అని ఆరోజున దేవుడు అడిగితే "నీ సాక్షి మేమెప్పుడూ బహుదైవతారాధన చేయలేదు దేవా" అని బొంకుతారు. ప్రజలు కల్పించుకున్న దైవాలన్నీ మాయమైపోతాయి. (ఖురాన్ 6:22,24)
పంక్తి 51:
[[బర్జఖ్]] మరణించిన తరువాత ఏర్పడు లేక కలుగు స్థితి లేక కాలం. ఈ స్థితికలుగు సమయంలో [[ఇజ్రాయీల్]] (మరణదూత) జీవి యొక్క శరీరమునుండి ఆత్మను వేరుచేస్తాడు. ప్రాణంతీయడం సుళువుగానూ లేక అతికష్టం కలుగజేస్తూ గావచ్చు. జీవితంలో సత్ప్రవర్తనగలవారికి సుళువుగాను, దుర్ప్రవర్తనగలవారికి అతికష్టంగానూ ప్రాణాలు తీయబడును ([[ఖురాన్]] 79.1-2). మూడు ముఖ్యమైన సంఘటనలు [[బర్జఖ్]] కాలంలో జరుగుతారు.
* శరీరమునుండి ఆత్మ వేరుచేయబడును.
* [[మున్కర్ నకీర్|మున్కర్ మరియు, నకీర్]]లు ప్రశ్నోత్తరాలు చేయుదురు.
:''"మీ ప్రభువెవ్వడు?"''
:''"మీ ధర్మమార్గమేది?"''
పంక్తి 63:
 
=="అల్లాహ్" దర్శనం==
[[సహీ ముస్లిం]] మరియు, [[సహీ బుఖారి]] [[హదీసులు|హదీసుల]] ప్రకారం, విశ్వాసులు మరణానికి పూర్వం [[అల్లాహ్]] ను చూడలేరు. [[ఇబ్న్ తైమియా]] ప్రకారం ఈ ఉల్లేఖనాలు ''హఖీఖి'' కావు, కానీ అందరూ ఈ విషయాన్ని మాత్రం అంగీకరిస్తారు "మరణించిన తరువాత అల్లాహ్ ను దర్శించవచ్చు" అని. ఇంకో హదీసుప్రకారం విశ్వాసులు అల్లాహ్ ను దర్శిస్తారు, ఏవిధంగా ఐతే మనం జీవించి యున్నప్పుడు సూర్యచంద్రులను చూస్తామో ఆవిధంగా చూడగలం.
 
==తీర్పు==
తీర్పుకాలంలో మనిషి (పురుషుడు లేక స్త్రీ) యొక్క స్వీయాలు (జీవితంలో చేసిన క్రియల పుస్తకరూపం) తెరవబడుతాయి, వీరుచేసిన ప్రతికార్యం మరియు, పలికిన ప్రతి పదమూ ముందుకు తీసుకు రాబడుతాయి ([[ఖురాన్]] 54.52-53). పసిప్రాయంలోచేసిన పనులు పరిగణలోకి తీసుకోబడవు. మానవ క్రియల లెక్కలు చాలా సంపూర్ణంగావుంటాయి, వీటిని చూసి వీటి సమగ్రత పట్ల ఆశ్చర్యచకితులవుతారు, ప్రతిచిన్న పనీ లిఖించబడివుంటుంది. ఖియామత్ ఘడియ ఆసన్నమైనపుడు, దీనిని తిరస్కరిస్తారు, వీరికి హెచ్చరిక, ఈ ఖయామత్ బాధాకరమైన ఘడియలు తీసుకువస్తుంది. ([[ఖురాన్]] 30.55-57, 19.39). ఎవరైతే తమ క్రియలను స్వీకరించరో, వారి దేహభాగాలు సాక్షాలు చెబుతాయి.
ఖురాన్ ఈ విధంగా ప్రవచిస్తుంది "ఈనేరాలే సాక్షాలు చెబుతాయి, అసత్యమాడడం, అగౌరవాలు, లంచాలు, అల్లాహ్ సూక్తులపట్ల నిర్లక్షతా భావన, తీర్పుదినాన విశ్వాసం లేకపోవడం, పేదలపట్ల నిర్దయ, చెడ్డ అలవాట్లు మరియు, పేదలను వంచించి అక్రమార్జన చేయుట వగైరాలు".<ref>''Encyclopedia of Islam and Muslim World'', p.565</ref>
 
తీర్పుదినాన, ప్రాశస్తమైన విషయం [[అల్లాహ్]] నిష్పాక్షికంగా తీర్పు చెపుతాడు. సత్ప్రవర్తనగలవారికి (ఒకటీ అరా పాపాలున్ననూ) అల్లాహ్ తన దయ మరియు, కరుణతో వారిని మన్నించి మోక్షమును కల్గించి స్వర్గప్రాప్తిని కలిగిస్తాడు.
హిందూ ధర్మం ప్రకారంకూడా ప్రతిజీవీ తనకర్మానుసారం స్వర్గం లేక నరక ప్రాప్తిని పొందుతాడు. అలాగే పరమేశ్వరుడు అమిత దయాళువు, తన దయాకరుణలతో భక్తులకు (విశ్వాసులకు) మన్నించి మోక్షాన్ని మరియు, స్వర్గప్రాప్తినీ కలిగిస్తాడు. ఇస్లాం ఇదేవిషయాన్ని అల్లాహ్ తన సంపూర్ణమయిన నిష్పాక్షికమయిన తీర్పును తన దయాగుణాన్ని రెండిటినీ ప్రదర్శిస్తాడని చాటుతుంది.
 
==జహన్నమ్ (నరకం) మరియు, జన్నత్ (స్వర్గం)==
తీర్పు తరువాత స్త్రీపురుషులందరూ ఓపెద్ద అగాధాన్ని దాటవలసివుంటుంది. ఈ అగాధం నుండి నరకాగ్నిజ్వాలలు ఎగిసిపడుతూంటాయి, ఈ అగాధంపై ఓ వంతెన "అస్-సిరాత్" (الصراط) ([[పుల్ సిరాత్]]), చాలా సున్నితమైన వంతెన, ఈ వంతెనను దాటడం చాలా కష్టం, కారణం కంటికి కనపడనే కనపడదు. హదీసుల ప్రకారం ఈ వంతెన వెంట్రుకలోని 7వ భాగమంత మందం కలిగినది మరియు, కత్తికన్నా పదునంగా వుంటుంది. విశ్వాసులు స్వర్గప్రవేశ తీర్పును పొందినవారు ఈ వంతెనను సునాయాసంగా దాటగలరు, కారణం వీరికి తమసత్కార్యాలవల్ల ఈ వంతెన మందమైన రాతివంతెనలా మార్చబడును, ఇతరులు ఈ సున్నితమైన వంతెనను దాటలేక [[జహన్నమ్]] (నరకం) లో పడిపోతారు.
 
స్వర్గ నరకాల తీర్పు అయిన తరువాత, ''షిఫాఅత్'' (الشفاعة), ప్రక్రియ ప్రారంభమగును. [[సహీ బుఖారి]] హదీసుల ప్రకారం [[మహమ్మదు ప్రవక్త]] విశ్వాసులు మరియు, సకల మానవాళి కొరకు అల్లాహ్ వద్ద ప్రార్థనలు చేసి షిఫాఅత్ లేదా మోక్షం లేదా ముక్తిని ప్రసాదింపజేయమని అర్థిస్తారు. అల్లాహ్ తీర్పు దిన అధిపతి సర్వశక్తిమంతుడూ, మానవుల స్వర్గ నరక ఇతని దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి వుంటుంది, అమిత దయాళువు అయిన అల్లాహ్ తన దయాకారుణ్యాలతో ముక్తిమోక్షాలను ప్రసాదిస్తాడు.
 
== తిరిగి జీవం పొందుట ==
పంక్తి 88:
== మూలాలు ==
* [[ఖురాన్]]
* [[హదీసులు]], ([[సహీ బుఖారి]])
* [[అల్ ఘజాలి]]
* [[ఖయామత్ సూచనలు]]
"https://te.wikipedia.org/wiki/యౌమ్-అల్-ఖియామ" నుండి వెలికితీశారు