తవుడు నూనె: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (12), typos fixed: , → , (12), ) → )
పంక్తి 1:
 
[[దస్త్రం:Rice bran.jpg |thumb|right|200px|తవుడు]]
[[దస్త్రం:Pelletiser.JPG|thumb|right|200px|తవుడును గుళికలుగా చేయు యంత్రం (pelletiser) ]]
Line 13 ⟶ 12:
===తవుడు ఉత్పత్తి, రకాలు===
 
[[వరి]]ధాన్యం (Paddy) ను రైస్ మిల్లింగ్‌ చేసినప్పుడు, బియ్యంతోపాటు[[ఊక]] (Husk) 25%, నూకలు (Broken rice) 3-5%, మరియు, తౌడు<ref name="ReferenceA">SEA publication ,'Handbook on Rice Bran processing'</ref> 6-8% ఉపఉత్పత్తులు (By Products) ఏర్పడును. బియ్యపు గింజపై సన్నని పొరలా (Thin membrane), గోధుమ రంగులో, ఆవరించి వుండును. గోధుమ రంగును తొలగించి, బియ్యాన్ని తెల్లగా చెయ్యుటకై పాలిష్ (polish) చేసినప్పుడు పాలిష్‌గా తవుడు ఉత్పత్తి అగును. తవుడు మంచిఫోషక విలువలున్న పదార్థాలను కలిగివున్నది<ref>{{citeweb|url=http://www.ricebrantech.com/our-products|title=RiceBran Technologies Products|publisher=ricebrantech.com|date=|accessdate=2015-03-08}}</ref> .పచ్చి తవుడులో 15-24% వరకు నూనె,14-16% వరకు మాంసకృత్తులు (Proteins) వున్నాయి, ఉప్పుడు తవుడు (boiles bran) లో 20-30%వరకు నూనె,14% వరకు ప్రొటిన్ వుండును..ఇంకను పాలిసాక్రైడ్స్‌, ఫైబరు వున్నాయి<ref name="ReferenceA"/>. తవుడులో ఇంత పోషకవిలువలుండటం వలననే డాక్టరులు దంపుడుబియాన్ని (hand pounded rice) ఆహారంగా తీసుకోమని చెప్తారు. కొన్నిదేశాలలో దంపుడు బియ్యాన్ని ప్యాకెట్‌లో నింపి అమ్ముచున్నారు. 2008-2009 లో భారతదేశంలో, 140 మిలియన్‌ టన్నుల వరిఉత్పత్తి కాగా, మిల్లింగ్‌ చెయ్యగా 100 మిలియన్‌టన్నుల బియ్యం,80 లక్షలటన్నుల తవుడుఊత్పత్తి అయ్యింది.అందులో 35 లక్షల తవుడును నేరుగా పశువుల దాణాగా వాడగా,45 లక్షలటన్నుల తవుడు నుండి తౌడు నూనెను ఉత్పత్తి చెయ్యడం జరిగింది. బియ్యాన్ని రెండు రకములుగా ఉత్పత్తి చెయ్యుదురు. ఒకటి పచ్చిబియ్యం (Raw Rice, రెండు ఉప్పుడు బియ్యం (Boiled Rice). ధాన్యాన్ని కళ్ళంలో ఎండబెట్టి, తేమను తొలగించి, నేరుగా రైస్‌మిల్‌లో మిల్లింగ్‌చేయగా వచ్చిన బియ్యాన్ని పచ్చిబియ్యమని, తవుడును పచ్చితవుడు (Raw Rice Bran) అంటారు. ధాన్యాన్ని స్టీమ్‌ద్వారా ఉడికించి (steam boiled), మిల్లింగ్ చెయ్యగా వచ్చిన బియ్యాన్ని ఉప్పుడు బియ్యం (Boiled Rice), అలా వచ్చిన తవుడును ఉప్పుడు తవుడు (Boiled Bran) అంటారు.
 
==ఎస్టరిఫికెసన్‌==
[[కొవ్వు ఆమ్లం|కొవ్వుఆమ్లాలు]] అల్కహలులతో సంయోగం చెందు రసాయనిక చర్యను ఎస్టరిఫికెసను అంటారు. సంయోగం చెందు [[ఆల్కహాలు]]లు ఒకే హైడ్రోక్షిల్ (OH) సమూహన్ని కలిగివున్న ఇథైల్, మిథైల్ వంటి మోనోహైడ్రోక్షిల్ ఆల్కహలులు కావచ్చును. లేదా రెండు అంతకుమించి హైడ్రోక్షిల్‌ సమూహలున్నవి కావచ్చును (గ్లిజరాల్‌ మూడుహైడ్రోక్షిల్ సమూహలను కల్గివున్నది). కొవ్వు ఆమ్లాలను మిథైల్, లేదా ఇథైల్ అల్కహల్‌తో ఎస్టరిఫికెసను చెయ్యడం వలన ఏర్పడునవి ఆల్కహల్‌ ఇష్టరులు. కొందరు ఈచర్యను 'అల్కహలిసిస్'అంటారు.[[గ్లిజరాల్|గ్లిసెరొల్‌]]తో కొవ్వుఆమ్లాలు సంయోగం చెందగా ఏర్పడునవి కొవ్వుఆమ్లాల 'గ్లిసెరైడ్‌ ఈస్టరులు. శాకనూనెలనుండి'బయోడిజెల్'ను కొవ్వు ఆమ్లాలను అల్కహల్‌తో సంయోగపరచి ఉత్పత్తి చేయుదురు. మూడుఅణువుల కొవ్వు ఆమ్లాలు, ఒక అణువు గ్లిసెరొల్‌ సంయోగం వలన, ఒక నూనె ఆణువు, మూడు నీటి అణువులు ఏర్పడును<ref>{{citeweb|url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=8880|title=Definition of Triglycerides|publisher=medterms.com|date=|accessdate=2015-03-08}}</ref>. ఈ విధంగా గ్లిసెరొల్ మరియు, కొవ్వుఆమ్లాలు సంయోగచెంది నూనెగా ఏర్పడటాన్ని ఎస్టరిఫికెసను (esterification) అంటారు.ఆందుచే నూనెలను ట్రై గ్లిసెరైడ్‌లు (Triglycerides) లేదా కొవ్వుఆమ్లాల గ్లిసెరైడ్ ఎస్టరులందురు.
 
'''హైడ్రొలిసిస్'''
Line 22 ⟶ 21:
 
==హైడ్రొలిసిస్==
ఎస్టరిఫికెసనుకు వ్యతిరేకచర్య 'హైడ్రొలిసిస్ (hydrolysis) <ref>{{citeweb|url=http://scifun.chem.wisc.edu/chemweek/pdf/fats&oils.pdf|title=FATS & OILS|publisher=scifun.chem.wisc.edu|date=|accessdate=2015-03-08}}</ref>, హైడ్రొలిసిస్ వలన నూనెలు కొవ్వుఆమ్లాలు, మరియు, గ్లిసెరొల్ గా విడగొట్టబడును. తవుడులో 'లీపెస్' (Lipase) అనే ఎంజైమ్‌వున్నది.ఈ లిపెస్‌ పచ్చితవుడులో చాలా క్రీయాశీలంగా వుండి 'హైడ్రొలిసిస్' (hydrolysis) చర్య ద్వారా నూనెను తిరిగికొవ్వు ఆమ్లాలుగా, గ్లిసెరిన్‌గా విడగొట్టును. ఈస్ధితిలో ఫ్యాటిఆసిడ్‌లు నూనెలో స్వేచ్ఛగా (free) వుండటం వలన వీటిని ఫ్రీఫ్యాటిఆసిడ్స్ (Free Fatty Acids, F.F.A.) ఆంటారు<ref>{{citeweb|url=http://www.florin-ag.ch/index.php?sid=6M6559nGTyfffydmzmDCtIHgp7JozCPq6e6m832s&c5p=476&c5l=en|title=FREE FATTY ACIDS (FFA)|publisher=florin-ag.ch|date=|accessdate=2015-03-08}}</ref>.అందుచే పచ్చితవుడును మిల్లింగ్ అయ్యినవెంటనే 24 గంటలలోపు సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్‌లో ప్రాసెస్ చేసి నూనెను ఉత్పత్తిచేసిన తక్కువ ఎఫ్.ఎఫ్, ఎ. వున్న ఆయిల్‌ను ఉత్పత్తి అగును.24 గంటలు దాటినచో పచ్చితవుడు లోఎఫ్,.ఎఫ్.ఎ. (F.F.A.) శాతం 25-45% వరకు పెరిగిపొవడం వలన ఆయిల్‌ను రిఫైన్‌చెసిన రిఫైనింగ్‌లాస్‌ ఎక్కువ వచ్చును, మరియు, ఆయిల్ కలర్‌కూడా ఎక్కువగా వుండును.బాయిల్డ్‌బ్రాన్‌లో ఎఫ్.ఎఫ్.ఎ.ఆంతత్వరగా పెరగదు. బాయిల్డ్ రైస్‌ను స్టీమ్‌కుకింగ్‌చెయ్యడం వలన, తవుడులోని 'లిపెస్'ఎంజైమ్‌ డిఆక్టివేట్‌అవ్వడం వలన, ఎఫ్.ఎఫ్.ఎ. త్వరగా పెరగదు.ఫ్రెష్‌బాయిల్డ్‌బ్రాన్‌నుండి 5% కన్న తక్కువ ఎఫ్.ఎఫ్.ఎ.వున్న ఆయిల్‌ను ఉత్పత్తి చెయ్యవచ్చును.వంటకు ఉపయోగించు నూనెలో F.F.A.శాతం 0.25% మించి వుండరాదు. ఎఫ్.ఎఫ్.ఎ. 1% మించి వుండినచో, ఆయిల్‌ను వేడిచేసినప్పుడు తక్కువ ఉష్ణోగ్రతవద్దనే నూనెనుండి పొగ (smoke) రావడం ప్రారంభం అవుతుంది, మరియు, ఎఫ్.ఎఫ్.ఎ. కారణముగా నూనెకు చేదు (Bitter) రుచి వచ్చును. అందుచే సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ద్వారా ఉత్పత్తి చేసిన తవుడు నూనెను తప్పనిసరిగా రిఫైనింగ్‌ చేసిన తరువాత మాత్రమే వంటనూనెగా వినియోగించవలెను.ఆయిల్ రిఫైనింగ్‌ అనగా ఆయిల్‌లోని ఎ.ఎఫ్.ఎ.ను, గమ్స్, వ్యాక్సులను తొలగించి, ఆయిల్ కలరును తగ్గించడం. ఆంధ్ర ప్రదేశ్‌లో తవుడు నుండి నూనెను సంగ్రహించు సాల్వెంట్‌ ప్లాంట్‌లు 45 వరకు ఉన్నాయి. అలాగే తవుడు నూనెను రిఫైన్‌చెయ్యు రిపైనరిలు 20 వరకు ఉన్నాయి. రైస్‌మిల్‌ యొక్క ప్రాసెసింగ్‌ డిజైన్‌ను బట్టి, తవుడులో నూనెశాతం 8-25% వరకు వుండును. హల్లర్‌రైస్‌మిల్‌ (Huller mill) లోని తవుడులో 6-8% వరకు, షెల్లర్‌మిల్ (Sheller mill) తవుడులో 16-20% వరకు, మోడరన్‌ రబ్బరు షెల్లర్‌మిల్‌ తవుడులో 20-25% వరకు నూనె వుండును. తవుడు సాధారణంగా గోధుమరంగు (Brown) లో వుండును. మాములుగా నూనె గింజలనుండి ఆయిల్‌ను రోటరి మిల్‌, ఎక్స్ పెల్లరుల ద్వారా తీయుదురు. కాని తవుడు నూనెను కేవలం సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్‌ ద్వారానే సాధ్యం. ఏదైనా ఘన, లేదా ద్రవపదార్థాలను తనలో కరగించుకొనులక్షణం వున్న ద్రవంను'ద్రావణి' (Solvent). అన్ని ఆయిల్స్‌ హైడ్రొకార్బన్‌ సాల్వెంట్స్‌ అయిన బెంజీన్, అసిటొన్, క్లోరోపారం, మరియు, హెక్సెన్ (Hexane) లో అతి సులభంగా కరుగును. హెక్సెన్‌ను సాల్వెంట్ గా ఉపయోగించి, తవుడునుండి ఆయిల్‌ను ఎక్స్‌ట్రాక్ట్‌ చెయ్యుదురు.
 
'''తవుడులో వుండు పోషక పదార్థముల పట్టిక'''
Line 44 ⟶ 43:
తవుడునుండి ఆయిల్‌ను హెక్సెన్‌ను సాల్వెంట్‌గా ఉపయోగించి తీయుటను 'సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్' (solvent extraction) అంటారు<ref>{{citeweb|url=http://lipidlibrary.aocs.org/processing/solventextract/index.htm|title=SOLVENT EXTRACTION|publisher=lipidlibrary.aocs.org|date=|accessdate=2015-03-08}}</ref>. హెక్సెన్‌ అల్కెన్ గ్రూప్‌నకు చెందిన ద్రవహైడ్రొకార్బన్‌. హెక్సెన్ తక్కువబాయిలింగ్‌ పాయింట్‌ కలిగి వుండటం, టాక్సిన్స్ (విష కారకాలు) లేకపోవడం, విస్తారంగా లభించడం వలన సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ ప్లాంట్‌లలో[[హెక్సెను|హెక్సెన్‌]] సాల్వెంట్‌గా వాడెదరు<ref>{{citeweb|url=http://www.thefreedictionary.com/hexane|title=hexane|publisher=thefreedictionary.com|date=|accessdate=2015-03-08}}</ref>. తవుడు పౌడరుగా వుండటం వలన నేరుగా ఆయిల్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చెయ్యుటకు కుదరదు. అందుచే తవుడును మొదటగా గుళికలుగా (Pellets) తయారు చేసి, ఆతరువాత ఈపిల్లెట్స్‌ను ఏక్స్‌ట్రాక్టరుకు పంపి, అక్కడ హెక్సెనును స్ప్రే చేసి తవుడునుండి నూనెను తీయుదురు.
 
తవుడును గుళికకలుగా మార్చు యంత్రాన్ని పెల్లెటైజరు (Pelletiser) లేదా కూబర్ మెచిన్ (cuber machine) అనెదరు<ref>{{citeweb|url=https://www.google.co.in/search?q=rice+bran+pellets&espv=210&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=8YFmUtz9BcP7rAfA6YH4CQ&ved=0CEoQsAQ&biw=1366&bih=677|title=Images|publisher=google.co.in/search?q=rice+bran+pellets&espv=210&es_sm=93&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=8YFmUtz9BcP7rAfA6YH4CQ&ved=0CEoQsAQ&biw=1366&bih=677|date=|accessdate=2015-03-08}}</ref> . పెల్లెటైజరులో సాధారణంగా కాస్ట్‌ఐరన్‌ (cast iron) తో చేసిన డై ప్లేట్‌ (Die plate) మరియు,, రోలరులు వుండును.డై ప్లెట్‌కు 6-8 వ్యాసం (Diameter) వున్న రంధ్రాలుండును.డై ప్లేట్‌ మందం 55-60 మి.మీ. వుండును.ఈ డై ప్లెట్‌మీద 4-6 రోలరులు బిగించబడి వుండును.వీటి డయా 280 మి.మీ.లు వుండి, వెడల్పు 100-160 మి.మీ వరకు పెల్లెటైజర్‌ ఉత్పత్తి సామార్ద్యంనుబట్టి వుండును. డై ప్లేట్‌డయా కూడా మెషిన్‌ కెపాసిటిని బట్టి 600-840 మి.మీ. వుండును. పెల్లెటైజరుకు తవుడును పంపించెముందు, తవుడును టెంపరింగ్‌ కన్వెయరు (Temparing conveyer) లో ఒపన్‌స్టీమ్ ద్వారా కుకింగ్‌ చెయ్యుదురు. ఒపన్‌స్టీమ్‌ ద్వారా తవుడును కుకింగ్‌ చెయ్యడంవలన తవుడులోని తేమ (Moisture) శాతం 15% వరకు పెరగడంవలన పెల్లెట్స్ సుభంగా ఏర్పడుతాయి. పెల్లెటైజెర్ తిరుగునప్పుడు, డై ప్లెట్‌తో పాటు రోలరులు తిరుగును. డై ప్లేట్ భ్రమణ వేగం (Revolution) 90-100/నిమిషానికి వుండును. కుకింగ్ అయ్యిన తవుడు పెల్లెటైజెర్ డై ప్లెట్‌ మీద పడినప్పుడు, రోలరులు తవుడును అధిక వత్తిడితో డైప్లెట్ మీద నొక్కడం/వత్తడం వలన, తవుడు పెల్లెట్‌లగామారి డై ప్లెట్‌ రంధ్రాలనుండి బయటకు వచ్చును. పెల్లెటైజరు నుండి తయారు అయ్యివచ్చు పెల్లెట్‌ల ఉష్ణోగ్రత 80-85 డిగ్రీలి/సెంటిగ్రెడ్‌ వుండును. డై ప్లెటుకు దిగువన ఒకకట్టరును బిగించి, పెల్లెట్స్‌ను కావలసిన సైజుకు కత్తరించడం జరుగును. బ్రాన్‌పెల్లెట్స్‌ను సాల్వెంట్ ప్లాంట్‌కు పంపెముందు, పెల్లెట్స్ ఉష్ణోగ్రతను, మరియు, పెల్లెట్స్ యొక్క మాయిచ్చర్‌ను తగ్గించవలసి ఉంది. అందుచే పెల్లెట్‌లను పెల్లెట్‌ కూలర్‌ (pellet cooler) అనే యంత్రపరికరానికి పంపించి, పెల్లెట్‌ల ఉష్ణోగ్రతను 45-50 సెంటిగ్రెడ్‌ డిగ్రీల వరకు కూల్‌చెయ్యుదురు.పెల్లెట్‌కూలరులో పెల్లెట్స్‌ వెళ్లునప్పుడు, ఎయిరు బ్లొవర్‌ (Air Blower) ద్వారా చల్లనిగాలిని ప్రసరింప చెయ్యడం వలన పెల్లెట్స్ చల్లబడును. అంతియేకాదు, పెల్లెట్స్ యొక్క తేమ శాతం కూడా 12% వరకు వచ్చును. పెల్లెట్‌కూలరులో చల్లబరచిన పెల్లెట్స్ ఒకకన్వెయెర్ (conveyer) ద్వారా సాల్వెంట్‌ ప్లాంట్‌కు వెళ్ళును.
 
సాల్వెంట్‌ ప్లాంట్‌లో ఎక్స్‌ట్రాక్టరులో బ్రాన్‌ పెల్లెట్స్ మీద హెక్సెనును కంటిన్యుయస్‌గా స్ప్రే చెయ్యడం వలన తవుడు పెల్లెట్స్‌లోని ఆయిల్‌ హెక్సెనులో కరిగి తవుడు నుండి, వేరుపడును. ఎక్సూట్రాక్టరులో తవుడు పెల్లెట్స్ ఫీడింగ్‌ హపరు నుండి, డిచార్జి హపరుకు చేరు లోపల తవుడులోని ఆయిల్‌ మొత్తం హెక్సెనులోలో కరగి పోవును. ఇప్పుడు ఆయిల్లేని (Deoiled) తవుడు పెల్లెట్‌లో 30-35% వరకు సాల్వెంట్ వుండును. ఈ ఆయిల్డ్ బ్రాన్‌ను డిసాల్వెంటింగ్ టోస్టరుకు పంపి, జాకెట్‌ స్టీమ్‌హేటింగ్‌ చేసి, హెక్సెను వేపరులను తొలగించడం జరుగును. ఆ తరువాత డిఆయిల్డ్ బ్రాన్‌ను గది ఉష్ణోగ్రతకు చల్లార్చి, బ్యాగ్‌లలో ఫిల్లింగ్‌ చెయ్యుదురు.
 
తవుడునూనె మరియు, హెక్సెను మిశ్రమాన్ని 'మిసెల్లా' (Micella) అంటారు. ఈమిసెల్లాను వ్యాక్యుంలో వున్నడిస్టిలెసను (Distillation) సెక్షనులో ఆయిల్‌ మరియు, హెక్సెనుగా వేరు చేయుదురు. డిస్టిలెసను సెక్షనులో హీటరులు, ఎవపరెటరులు అనే వెస్సల్స్‌ వుండును. హీటరులలో మిసెల్లను జాకెట్ స్టీంద్వారా 80-110 సెంటిగ్రెడ్‌ దిగ్రీలవరకు వేడిచేసి, ఎవపరెటరులకు పంపెదరు. హెక్సెను బాయిలింగ్‌ పాయింట్, ఆయిల్ బాయిలింగ్‌ పాయింట్‌ కన్న బాగాతక్కువ కావడం వలన, వేపరు రూపంలో హెక్సెను ఆయిల్‌ నుండి వేరుపడును (హెక్సెను బాయిలింగ్‌ పయింట్:68-72 సెంటిగ్రెడ్, ఆయిల్‌ బాయిలింగ్‌ పాయింట్‌: 350-400 సెంటిగ్రెడ్‌). వేపరురూపంలోని హెక్సెనును కండెన్సరులకు (condensers) పంపి, చల్లబరచి, ద్రవంగా మార్చి, తిరిగి ఎక్స్ట్రాక్షనులో వినియోగిస్తారు.
 
===తవుడునూనె===
 
తవుడు నూనెలో వుండు[[సంతృప్త కొవ్వు ఆమ్లం|సంతృప్త]] (saturated, [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వు ఆమ్లాలు]] (unsaturated) సమతుల్యంగా వుండటం, తక్కువ కొలెస్టరు ఫ్యాక్టరు కలిగి వుండటం, ఒరైజనొల్‌ను కలిగి వుండటం వలన తవుడునూనెను "Friend of heart" అనికూడా అంటారు<ref>{{citeweb|url=http://nopr.niscair.res.in/bitstream/123456789/5457/1/JSIR%2063%287%29%20569-578.pdf|title=Gamma-oryzanol from rice bran oil|publisher=nopr.niscair.res.in|date=|accessdate=2015-03-08}}</ref>. రెఫైండ్‌ రైస్ బ్రాన్‌ ఆయిల్‌లో వ్యాక్స్‌ 2.0% వరకువుండటం వలన, మిగతా అయిల్స్ కన్న కలరు కొద్దిగా ఎక్కువగా వున్నట్లు కన్పించును. సాల్వెంట్ ప్లాంట్ ద్వారా తీసిననూనెలో ఫ్రీ ఫ్యాటి అమ్లాలు మరియు, యితర మలినాలు వుండటం వలన చూచుటకు చిక్కగా కన్పించును. మూడినూనె పసుపు. ఎరుపురంగు కలయికలో వుండును, రిపైండుచేసిన నూనె లేతపసుపు రంగులో వుండును.
 
'''ముడినూనె, మరియు, రిపైండుతవుడునూనె భౌతిక, రసాయనికథర్మాల పట్టిక'''<ref>{{citeweb|url=http://www.riceactive.com/?page_id=203|title=WHAT IS RICE BRAN OIL?|publisher=riceactive.com|date=|accessdate=2015-03-08}}</ref>
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
Line 138 ⟶ 137:
{{నూనెలు}}
{{ఆవశ్యక నూనె}}
 
[[వర్గం:నూనెలు]]
[[వర్గం:వంట నూనెలు]]
"https://te.wikipedia.org/wiki/తవుడు_నూనె" నుండి వెలికితీశారు