ఆండాళ్ వెంకటసుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: తో → తో , పెళ్లి → పెళ్ళి (2), → (5), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
}}
 
'''ఆండాళమ్మ''', '''లేడీ ఆండాళ్'''గా ప్రజలచే పిలువబడే '''ఆండాళ్ వెంకటసుబ్బారావు''' ఒక ప్రముఖ సంఘ సేవకురాలు మరియు, విద్యావేత్త.
==విశేషాలు==
ఈమె 1894లో [[మద్రాసు]] పట్టణంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం మద్రాసులోని సెయింట్ థామస్ కాన్వెంటులోను, హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైయ్యర్ సెకండరీ స్కూలులోను, ప్రెసిడెన్సీ గర్స్ హైస్కూలులోను గడచింది. ఈ చదువు ఆమెకు సామాజిక స్పృహను కలిగించింది. బీదలకు, నిస్సహాయులకు, దురదృష్టవంతులకు ఏదో ఒకటి చేయాలనే తపనను కలిగించింది. ఈమె చిన్నవయసులోనే భర్తను కోల్పోయి వితంతువుగా మారింది. ఆ కాలంలో బాలవితంతువులు ఎదుర్కొనే సాధకబాధకాలను స్వయంగా అనుభవించింది. మద్రాసు హైకోర్టు జడ్జి [[ముత్తా వెంకట సుబ్బారావు]] పరిచయం ఆమె జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది. అతడు ఈమెను 1922లో ఆదర్శ వివాహం చేసుకున్నాడు. సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి ఈమె తనకు సరియైన జోడీగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ దంపతులిద్దరూ కలిసి వందలాది అభాగ్యుల జీవితాలలో వెలుగును నింపినారు<ref>{{Cite web |url=http://sir.ladymvrschool.com/index.php?page=about_lady_mvrao |title=లేడీ ఆండాళ్ గురించి |website= |access-date=2017-04-24 |archive-url=https://web.archive.org/web/20170812201823/http://sir.ladymvrschool.com/index.php?page=about_lady_mvrao |archive-date=2017-08-12 |url-status=dead }}</ref>.
 
==సంఘసేవ==
[[దస్త్రం:Mutta venkata subbarao and lady andal.jpg|thumb|right|250px|ఆండాళ్, ముత్తా దంపతులు]]
1928లో ఈ దంపతులు దిక్కులేని పిల్లలు, స్త్రీలకు, సమాజం నుండి వెలివేయబడిన వారికి ఆశ్రయమిచ్చి చదువు చెప్పించడం కోసం తమ స్వంత ధనం 10,000 రూపాయలు వెచ్చించి "మద్రాస్ సేవా సదన్" అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఆరంభంలో ఈ సంస్థలో 8 మంది అనాథలను చేర్చుకుని వారికి తిండి, దుస్తులు ఇచ్చి వారికి శిక్షణ యిచ్చి వారు సమాజంలో నిలదొక్కుకునేలా చేశారు. 8 మందితో ప్రారంభమైన మద్రాసు సేవా సదన్‌లోని సభ్యుల సంఖ్య 30 యేళ్లలో 3000కు పెరిగింది. ఈమె ఈ సంస్థలోని పిల్లల పట్ల పత్యేక శ్రద్ధ కనబరచేది. వారికి స్వయంగా భోజనం తినిపించేది. సాయంకాలాలు తన కారులో బీచికి వ్యాహ్యాళికి తీసుకు వెళ్లేది. ఆ పిల్లలకు యుక్త వయసు వచ్చేవరకు పెళ్లిపెళ్ళి జరగకుండా జాగ్రత్త వహించి, మంచి వారికి ఇచ్చి పెళ్లిళ్లుపెళ్ళిళ్లు చేసేది. వారికి నగలు, దుస్తులు స్వయంగా తన డబ్బుతో కొనిపెట్టేది. ఈ సంస్థలో జాతి, కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికీ చోటు కల్పించింది. ఈ సంస్థకు అనుబంధంగా లేడీ ఆండాళ్ వెంకట సుబ్బారావు హయ్యర్ సెకండరీ స్కూలును, సర్ ముత్తా వెంకట సుబ్బారావు సంగీత సభను ప్రారంభించింది<ref>[http://www.newindianexpress.com/cities/chennai/2012/jun/23/the-lady-andal-story-379806.html The Lady Andal story]</ref>. 1960లో తన భర్త మరణం ఈమెను విపరీతంగా కృంగదీసింది. అయినా ఆమె ధైర్యంగా ఆయన లేని లోటును కనిపించనీయకుండా చిరునవ్వుతో సేవా సదన్ కార్యక్రమాలను నిర్వహించింది.
 
==పురస్కారాలు==
ఈమె సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈమెకు కింగ్ జార్జ్ మెడల్, కైసర్ - ఇ - హింద్ వంటి పలు పురస్కారాలు వరించాయి. 1957లో భారత ప్రభుత్వం [[పద్మ భూషణ్ పురస్కారం]] తో గౌరవించింది.
==మరణం==
ఈమె 1969లో తన 75వ యేట మరణించింది.