శత పుష్పం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎ఉపయోగాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 15:
 
==ఉపయోగాలు==
దీని గింజలను పసి పిల్లల [[ఉదరము|ఉదర]] సమస్యలకు, [[అనాస అవస్థ]] (Colic) సమస్యలకు ఉపయోగిస్తారు. పసి పిల్లలు త్రాగే గ్రైప్ వాటర్ (Gripe water) లో ముఖ్యంగా శతపుష్ప విత్తనాల సారం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం శతపుష్ప విత్తనాలకు కతు, తిక్త, రస, ఉష్ణ, [[వీర్యము|వీర్య]], కతు విపక, తిక్స్న మరియు, స్నిగ్ధ గుణాలున్నాయి. శత పుష్ప విత్తనాలు వాత, పిత్త, కఫ, అల్సర్లు, [[ఉదరము|ఉదర]] నొప్పులను, కళ్ల జబ్బులు, మరియు [[మూత్ర వ్యవస్థ|మూత్ర]] నొప్పులను నివారిస్తాయి. శతపుష్ప విత్తనాలను దశమూలారిష్టం, ధన్వంతరారిష్టం, మృతసంజీవని, సరస్వతారిష్టం, గుగ్గులుతిక్తక్వాతం, మహారస్నాది [[కషాయం]], ధన్వంతరం క్వాతం వంటి 52 రకాల ఔషధాల తయారీలో వాడుదురు <ref> Anethum graveolens: An Indian traditional medicinal herb and spice - S. Jana and G. S. Shekhawat </ref>.
 
ఈ సుగంధ ద్రవ్యాన్ని పచ్చళ్ళు, సలాడ్లు, సాసులు, సూపుల్లోను ఫ్లేవర్ గా వాడుతారు. తాజా లేదా ఎండిన శతపుష్ప ఆకులను కూడా ఫ్రై చేసిన [[చికెన్]], [[చేపలు]], సాండవిచ్చెస్ లోను వాడుదురు. సవర్ వెనిగర్ లో ఇది ఒక ముఖ్యమైన మూలిక. శతపుష్ప విత్తనాల నుండి తీసిన నూనెను సబ్బుల్లోను వాడుదురు. Staphylococcus, Streptococcus, Escherichia coli and Pseudomonas అను సూక్ష్మజీవుల నియంత్రించగలిగే శతపుష్ప నూనె ప్రిజర్వేటివ్ (Preservative) గా కూడా వాడుకోవచ్చును.
"https://te.wikipedia.org/wiki/శత_పుష్పం" నుండి వెలికితీశారు