పరిచయం

మార్చు

Dill
 
Scientific classification
Kingdom:
Family:
Genus:
Anethum

Species:
A. graveolens
Synonyms

Peucedanum graveolens (L.) C. B. Clarke

శతపుష్పం అనేది ఎపియాసే (Apiaceae) అనే కుటుంబానికి చెందిన సుగంధ ద్రవ్య మొక్క. దీని శాస్త్రీయ నామం అనెథమ్ గ్రావియోలెన్స్ (Anethum graveolens L.). ఆంగ్లంలో దీన్ని డిల్ సీడ్ (Dill seed) అని అంటారు. తెలుగులో బద్ద సోంపు అని అంటారు.


ఉపయోగాలు

మార్చు

దీని గింజలను పసి పిల్లల ఉదర సమస్యలకు, అనాస అవస్థ (Colic) సమస్యలకు ఉపయోగిస్తారు. పసి పిల్లలు త్రాగే గ్రైప్ వాటర్ (Gripe water) లో ముఖ్యంగా శతపుష్ప విత్తనాల సారం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం శతపుష్ప విత్తనాలకు కతు, తిక్త, రస, ఉష్ణ, వీర్య, కతు విపక, తిక్స్న, స్నిగ్ధ గుణాలున్నాయి. శత పుష్ప విత్తనాలు వాత, పిత్త, కఫ, అల్సర్లు, ఉదర నొప్పులను, కళ్ల జబ్బులు, మూత్ర నొప్పులను నివారిస్తాయి. శతపుష్ప విత్తనాలను దశమూలారిష్టం, ధన్వంతరారిష్టం, మృతసంజీవని, సరస్వతారిష్టం, గుగ్గులుతిక్తక్వాతం, మహారస్నాది కషాయం, ధన్వంతరం క్వాతం వంటి 52 రకాల ఔషధాల తయారీలో వాడుదురు.[1]

ఈ సుగంధ ద్రవ్యాన్ని పచ్చళ్ళు, సలాడ్లు, సాసులు, సూపుల్లోను ఫ్లేవర్ గా వాడుతారు. తాజా లేదా ఎండిన శతపుష్ప ఆకులను కూడా ఫ్రై చేసిన చికెన్, చేపలు, సాండవిచ్చెస్ లోను వాడుదురు. సవర్ వెనిగర్ లో ఇది ఒక ముఖ్యమైన మూలిక. శతపుష్ప విత్తనాల నుండి తీసిన నూనెను సబ్బుల్లోను వాడుదురు. Staphylococcus, Streptococcus, Escherichia coli and Pseudomonas అను సూక్ష్మజీవుల నియంత్రించగలిగే శతపుష్ప నూనె ప్రిజర్వేటివ్ (Preservative) గా కూడా వాడుకోవచ్చును.

గ్రైప్ వాటర్ తయారు చేయు విధానం

మార్చు

ముందుగా రెండు కప్పుల నీళ్ళను వేడి చేయాలి. అందులో ఒక చెంచా శతపుష్ప గింజలు వేసి కలియబెట్టి దించాలి. ఐదు నిముషాల తర్వాత పొడి గుడ్డ లేదా టీ చిక్కంతో ఒక గిన్నెలోకి వడగట్టి చల్లార్చాలి. ఈ నీళ్ళను పసి పిల్లలకు పట్టించవచ్చును.

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Anethum graveolens: An Indian traditional medicinal herb and spice - S. Jana and G. S. Shekhawat

లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=శత_పుష్పం&oldid=4103755" నుండి వెలికితీశారు