చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
:: [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], చరిత్ర గురించి రాసే విధానం తెలిస్తే ఇంత సందేహాలు ఉండవు. కాకతీయ సామ్రాజ్యం తెలుగు వారందరికీ చెందినది. ఓరుగల్లు కాకతీయుల రాజధాని. అలాగే నాటి రాయలసీమ, తీరాంధ్ర వాసులకు కూడా ఓరుగల్లు రాజధాని. తెలంగాణ వారికి మాత్రమే ప్రత్యేకం కాదు. నాడు ఈనాడు ఉన్న ప్రాంత భేదాలు లేవు. రుద్రమ్మ గురించి, ప్రతాప రుద్రుడి వీరోచిత పోరాటాలు గురించి తెలంగాణవాసులకు ఉండే గర్వం, చరిత్ర గుర్తింపు, ప్రతి తెలుగు వాడికి, రాయలసీమ, ఆంధ్ర అందరికీ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కలిసి ఉండేవారము కాబట్టి, మనకు ప్రాంతీయ విద్వేషాలు ఉండేవి కావు కాబట్టి. ఈ వ్యాసం ఇంతకు మునుపు చదివినప్పుడు ఇలా లేదు. ఎవరో సవరించారు. కేవలం తెలంగాణకు మాత్రమే కాకతీయ చరిత్ర చెందినట్టు రాశారు. ఇది '''తటస్థ దృక్కోణం'''లో లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా లేదు. ఆనాటి చరిత్రకు ప్రాంత బేధాలు ప్రస్తుత రాజకీయ బౌగోళిక పరిస్థితులు ఆపాదించలేము. 1956 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు నేటి తెలంగాణ జిల్లాలు ఆపాదించి రాయగలవా ?. నాటి ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలో పుట్టిన వారికి ఆంధ్రప్రదేశ్లో పుట్టారని రాయరు కదా, ఉదా:- # https://en.wikipedia.org/wiki/N._T._Rama_Rao. ఈ వ్యాసం లో బోర్న్ ఆన్ 28 May 1923[1] Nimmakuru, Madras Presidency, British India (now in Andhra Pradesh, India) # https://en.wikipedia.org/wiki/Tanguturi_Prakasam , Born 23 August 1872 Vinodarayunipalem, Madras Presidency, British India (now Vinodarayunipalem, Andhra Pradesh, India). ఇది అలాగే!. [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 11:18, 28 మే 2020 (UTC)
::: ఒకసారి మీరే సరిజూసుకోండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని అన్నారు. ఆ సమకాలీనత ఎప్పుడూ ఉంటుంది. సరే అది వదిలెయ్యండి. నాకు మీ పాయింట్ అర్థం కాకపోలేదు, కానీ దానికి తెలంగాణ అన్న పదాన్ని తొలగించుకుంటూ పోవడం మార్గం కాదు. "తెలుగువారికి గర్వకారణం" అని భావించే సెంటిమెంట్ ప్రతిబింబించే పుస్తకాలు తీసుకుని, అలా భావిస్తారని కోట్ చేయడం. అలానే తెలంగాణ చరిత్రకు కాకతీయ సామ్రాజ్యం మకుటాయమానమని భావిస్తూ, ఆ ప్రకారం చరిత్ర నిర్మిస్తున్న ఇటువైపు ప్రయత్నాలనూ వివరిస్తూ కోట్ చేయడం. - ఈ పని జరగాల్సి వుంది. అప్పుడు తటస్థ దృక్కోణం వస్తుంది. లెగసీ (వారసత్వ సంపద) గురించిన ఓ విభాగం పెట్టి ఇదంతా రాస్తాను. మీరు కూడా కాస్త స్పష్టంగా మీ సమస్య వ్యక్తం చేస్తూ ఉంటే బావుంటుంది. మరో సంగతి అవతలివారికి ఏం తెలుసో ఏం తెలియదో ఊహించుకుని రాయవద్దు, దానివల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:37, 28 మే 2020 (UTC)
 
:: [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], https://en.wikipedia.org/wiki/Taxila వ్యాసంలో పాకిస్థాన్ గురించి ఎన్నిసార్లు రాశారు ? ఇది తక్షశిల గురించి ఉందా, పాకిస్థాన్ గురించి ఉందా, తక్షశిలకు భారత దేశానికి ఏ సంబంధం లేదంటారా ? [[వాడుకరి:దేవుడు|దేవుడు]] ([[వాడుకరి చర్చ:దేవుడు|చర్చ]]) 11:41, 28 మే 2020 (UTC)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.