చర్చ:కాకతీయులు

తాజా వ్యాఖ్య: తెలంగాణ ప్రస్తావన టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషంఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


మార్పులు

మార్చు

దుర్గాప్రసాదు గారి పుస్తకమాధారముగా నేను అంగ్ల వికి లో కాకతీయుల వ్యాసమున పలుమార్పులు చేర్పులు గావించితిని. తెలుగు వికిలో వ్యాసము వ్రాయునపుడు అది చూడగలరుKumarrao 12:06, 5 మార్చి 2008 (UTC)Reply

వ్యాసము విస్తరణలోనున్నది. గమనించగలరు.Kumarrao 13:10, 15 జూలై 2008 (UTC)Reply

కాకతీయులు కర్ణాటక

మార్చు

కాకతీయుల పూర్వీకులు కర్ణాటక నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన విషయం మార్పుచేర్పులలో తొలగిపోయినట్టుంది. అది చేర్చగలరు. ఇది ఆంధ్ర చరిత్రకారుల్లో పి.వి.పరబ్రహ్మ శాస్త్రి రచించిన కాకతీయులు పుస్తకంలో ఉంది. ఈయన్ను కన్నడ పక్షపాతి అని కొట్టివేయలేము..ఎందుకంటే శాతవాహనులు ఆంధ్రులని ఋజువు చేసింది ఈయనే --వైజాసత్య 12:43, 16 జూలై 2008 (UTC)Reply

కాకతీయుల పుట్టుక

మార్చు

నేను తెలుగు విశ్వవిద్యాలయము వారు ప్రకటించిన విజ్ఞాన సర్వస్వము-చరిత్ర సంపుటము నుండి మరియు దుర్గాప్రసాద్ గారి ఆంగ్ల పుస్తకము నుండి సమాచారము సేకరించాను. కాకతీయుల పుట్టుక చాలా వివాదాస్పదము.

  • చరిత్రకారుల అభిప్రాయము కాకతీపురము ఒరుగంటికి పాతపేరు.
  • అలాగే 'రాష్టకూట' అను పదము రాష్ట్రకూటులకు విశ్వాసపాత్ర్రులైన కాకతీయుల పూర్వీకులు తమ పేరుకు చివర వ్రాసుకున్నారు. మరొక ఉదాహరణ: వెలనాడు, కమ్మనాడు లోని పలువురు తెలుగు నాయకులు తమిళ చో(ళు)డులకు విధేయులై వారి పేర్ల చివర 'చోడ' అని వ్రాసుకున్నారు.
  • రాష్ట్రకూటులు ఉత్తర భారతమునుండి వచ్చిన ఆర్య సూర్యవంశ క్షత్రియులు. కాకతీయులు దుర్జయ వంశము వారు.
  • కాకతీయుల పేర్లు అచ్చ తెలుగు పేర్లు. ఉదా: వెన్న, ఎర్ర, గుండ, బేత, ప్రోల మొదలగునవి.

వీటినిబట్టి కాకతీయులు తెలుగు, కర్ణాట దేశముల సరిహద్దు ప్రాంతములకు చెందిన తెలుగు వారని చెప్పవచ్చును.Kumarrao 11:50, 17 జూలై 2008 (UTC)Reply

  • కాకతీయుల కులము గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయమున్నవి. కొన్ని శాసనాల్లో సూర్యవంశ క్షత్రియులని, మరి కొన్ని పుస్తకాల్లో తెలుగు నాయక వంశాల మాదిరి దుర్జయ వంశమువారని చెప్పబడ్డారు. గుంటూరు తాలూకా మల్కాపురంలో కూలిపోయిన ఒక గుడియొద్ద ఉన్న నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం 395 (A. R. No. 94 of 1917.) కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని తెలుపుచున్నది [1]. కర్నూలు జిల్లా త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో చెక్కబడిన శిలాశాసనం 371 (A. R. No. 196 of 1905.) ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడని తెలుపుచున్నది [2]. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 13:32, 17 నవంబర్ 2015 (UTC))

రుద్రమదేవి బొమ్మ

మార్చు

కాసుబాబు గారు, వ్యాసములోనున్న రుద్రమ దేవి బొమ్మ చాల అసహజముగా ఉన్నది. ఈ బొమ్మ ఆంగ్ల వికీలో కూడ ఉన్నది. బొమ్మలోని వేషధారణ భారతదేశములో ముస్లిముల ప్రవేశము తరువాత రాజపుత్ర స్త్రీలు, ఉత్తరభారత మహిళలు పాటించిన పద్ధతిలో ఉంది. నా అభిప్రాయము రుద్రమదేవి ఈ విధముగా ఉండి ఉండదు. ఆమె కాలానికి ముస్లిములు వారి వేషభాషలు ఆంధ్రదేశములోనికి రాలేదు. చర్చించి దయచేసి బొమ్మ తీసివేయండి.Kumarrao 09:48, 21 జూలై 2008 (UTC)Reply

అవును. నాకూ అలానే అనిపించింది. ఎలాగూ ట్యాంక్ బండ్ విగ్రహాలలో రుద్రమదేవి బొమ్మ ఉంది గనుక ఈ బొమ్మ అవుసరం లేదనుకొంటాను. పరిశీలించి, తరువాత తొలగిస్తాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:26, 21 జూలై 2008 (UTC)Reply
ప్రస్తుతానికి ట్యాంకుబండ్ బొమ్మ పెట్టాను. పాత బొమ్మ తొలగింపు అవసరమో కాదో తరువాత పరిశీలిస్తాను. ఈ వ్యాసంలో నేను కూడా పని చేయనా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:57, 21 జూలై 2008 (UTC)Reply
పేజీ చరిత్ర
   (ప్రస్తు • గత) 14:03, 5 జనవరి 2009‎ కాసుబాబు (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,997 బైట్లు) (-5)‎ . . (ఏకఛత్రాధిపత్యం) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 14:01, 5 జనవరి 2009‎ కాసుబాబు (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (2,002 బైట్లు) (+51)‎ . . ({{విలీనం|కాకతీయులు}}) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 14:51, 13 జూలై 2008‎ Dev (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,951 బైట్లు) (-8)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 22:38, 7 జూన్ 2007‎ Mpradeepbot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,959 బైట్లు) (+7)‎ . . (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 17:05, 23 మార్చి 2007‎ వైజాసత్య (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,952 బైట్లు) (+31)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
    (ప్రస్తు • గత) 11:52, 24 ఆగష్టు 2005‎ Chavakiran (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,921 బైట్లు) (+1,921)‎

మార్పుచేయవలసిన భాగం

మార్చు

కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "దుర్జయులు".కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది కమ్మనాడు,వెలనాడు ఉంది.కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం.సూర్యచంద్రవంశక్షత్రియులలోని ఒకానొక శాఖ “దుర్జయవంశీయులు”, సూర్యచంద్రవంశ క్షత్రియ మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “దుర్జయాన్వయులు”,కాకతీయుల,కమ్మవారి మూల పురుషులు.కమ్మవారికీ, కాకతీయులకూ మూలపురుషుడైన “కమ్రమహారాజు” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కూర్మారాధక అనే కులంగా ఏర్పడ్డారు.కాకతీయులు తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “జైన మతంలో” ఉండగా “కుల గోత్రాలను” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక, చతుర్థ వంశజులగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు.అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.కూర్మారాధక క్షత్రియ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి "కమ్మకులం"గా ఏర్పడడారు.కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) "కర్మ కులం"గానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.

శాసనాధారాలను బట్టి బయ్యారం శాశనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.

ఆధారాలు

మార్చు

కాకతీయులు ఏ కులమునకు చెందినవారో ఖచ్చితమైన ఆధారాలు లేవు. చరిత్రకారులు చెప్పినా అది అభిప్రాయమే. చరిత్రకారులందరూ ఒకే అభిప్రాయానికి వస్తే తప్ప చెప్పలేము. కమ్మవారు క్షత్రియ కులాలకు చెందినవారు కాదు. వారికి ధనుంజయ, వశిష్ట, కాస్యప, కౌండిన్య, భరద్వాజ, ఆత్రియ, పశుపతి వంటి క్షత్రియ గోత్రాలు లేవు. అలాగే కాకతీయులు కమ్మ కులానికి చెందినవారని అనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కనుక ఈ భాగానికి ఖచ్చితమైన - ఆమోదితమైన ఆధారాలు జతపరచడం అవసరం. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 15:11, 14 ఫిబ్రవరి 2018 (UTC))Reply

తెలంగాణ ప్రస్తావన

మార్చు

రవిచంద్ర, చదువరి గారు, వెంకట రమణ గారూ, ఈ వ్యాసంలో తెలంగాణ ప్రస్తావన వికీపీడియా:తటస్థ దృక్కోణం నిబంధనలకు విరుద్దంగా ఉన్నది. తెలంగాణ పద ప్రయోగం కొన్ని చోట్ల అసంబద్దం. కాకతీయులకి తెలంగాణ ఆంధ్ర విభేదాలు లేవు. నందలూరు లో కూడా సౌమ్యనాథ స్వామి వారికి ప్రతాప రుద్రుడు ద్వజ స్తంభం కట్టి భూములు దేవుడికి ఇచ్చాడని చరిత్ర. ఇది మొత్తం తెలుగు వారికి చెందిన చరిత్ర అవుతుంది కానీ తెలంగాణ వారికి మాత్రమే కాదు.

తటస్థ దృక్కోణం ప్రకారం: వికీపీడియా విషయ సంగ్రహానికి సంబంధించినవి మూడు ముఖ్యమైన విధానాలున్నాయి. అవి:

  1. తటస్థ దృక్కోణం (en:Wikipedia:Neutral point of view)
  2. ఒరిజినల్ పరిశోధన తాలూకు అసలు ప్రతి కాకూడదు (en:Wikipedia:No original research)
  3. నిర్ధారణకు అనుకూలంగా ఉండాలి. (en:Wikipedia:Verifiability)

___________దేవుడు (చర్చ) 05:54, 28 మే 2020 (UTC)Reply

రవిచంద్ర, చదువరి గారు, వెంకట రమణ గారూ ఈ వ్యాసాన్ని సరైన ఆధారాలు చూపిన తర్వాత మాత్రమే తెలంగాణకు మార్చాలి. ఈ వ్యాసంలో చాలా అసంబద్ద అప్రమాణీక వివరణలు ఉన్నవి. సరైన ఆధారాలతో ఈ వ్యాసాన్ని విస్తరించిన పిదప తర్వాత మార్పులకు తాళం వేయాలి. చర్చ జరిగిన తర్వాత మాత్రమే ఆమోదించాలి. దేవుడు (చర్చ) 06:09, 28 మే 2020 (UTC)Reply

దేవుడు ఎక్కడెక్కడ ఏయే వాక్యాలు సమస్యాత్మకంగా ఉన్నాయో, ఎందుకు సమస్యాత్మకమో తెలియజేయండి. వ్యాసంలో అలాంటి వాక్యాల దగ్గర {{fact}} అనే మూసను ఉంచండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చర్చించి అలాగే మారుద్దాం. -రవిచంద్ర (చర్చ) 06:16, 28 మే 2020 (UTC)Reply
@రవిచంద్ర:, @దేవుడు: గార్లకు,తెలంగాణ అన్న పదాన్ని రాష్ట్రానికి, ప్రాంతానికి కూడా కలిపి వాడడం కొంత అయోమయానికి కారణమై ఉంటుందని భావిస్తున్నాను. కాబట్టి, సాధ్యమైనంత వరకూ మార్పుచేర్పులు చేశాను. ముఖ్యంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాన్ని సూచిస్తున్నప్పుడు నేటి తెలంగాణ అని మార్చడం, ఒక ప్రాంతంగా తెలంగాణను సూచిస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతం అని మార్చడం చేశాను. దీన్ని వర్గీకరించేప్పుడు తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర రెండు వర్గాలూ వచ్చాయి, మూసలో తెలంగాణను పాలించిన రాజవంశాలు ఉంది అదేమీ తప్పుకాదని నా అభిప్రాయం (తెలంగాణ అని మనం ఈనాడు పిలుస్తున్న ప్రాంతాన్ని ఈ రాజవంశాలు పరిపాలించాయి కాబట్టి). ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే పైన రవిచంద్రగారు చెప్పినట్టు చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 06:23, 28 మే 2020 (UTC)Reply
ఇది చారిత్రక అంశం కాబట్టి తెలుగు వికీపీడియాలో ఉన్న చరిత్రకరులు @Katta Srinivasa Rao:, @Sathyavathipurushotham: (కాళిదాసు పురుషోత్తం గారనే ప్రముఖ చరిత్రకారులు ఈ పేరిట రాస్తున్నారు) గార్లను పింగ్ చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:30, 28 మే 2020 (UTC)Reply
@రవిచంద్ర:,పవన్ సంతోష్, {{fact}} కలిపాను. ఎందుకు అనేది చర్చిద్దాం. అప్పటికి తెలంగాణ అనే పేరు లేదు. త్రిలింగ పద ప్రయోగం నుండి తెలుగు పుట్టింది అని చాలా చోట్ల చదివాను, తెలంగాణ ఎలా పుట్టిందో తెలియదు. ఆనాటికి తెలుగు వారందరూ ఒక్కటే. ఆనాటికి తెలంగాణ అని వాడటం సరి కాదు. ఈ వ్యాసంలో కొన్ని ప్రొ-తెలంగాణ భావంతో రాసినవిగా అనిపిస్తున్నాయి. ఈ వ్యాసంలో కాకతీయుల చరిత్ర తెలంగాణకు మాత్రమే చెందినదిగా చూపే ప్రయత్నం జరిగినది. దేవుడు (చర్చ) 06:42, 28 మే 2020 (UTC)Reply
@దేవుడు: ఇందులో మూడు నాలుగు విషయాలు ఉన్నాయి.
  • అప్పటికి తెలంగాణ అనే పేరు లేదు. చరిత్ర రాసేనాటికి ఏ పేరు ఉందో ఆ పేరుతోనే వ్యవహరిస్తామని ఎప్పుడూ ఏ చరిత్రకారులూ ప్రమాణంగా నిర్దేశించలేదు. ఉదాహరణకు మొహెంజదారో అన్న పదమే చూడండి, మొహెంజదారో అన్న పదం ఆధునికమైనది, స్థానిక సింధీ భాషలోది. ఈ పదానికి అర్థమూ ఆధునికమైనదే - మృతజీవుల దిబ్బ. ఒకప్పుడు, మృతజీవుల దిబ్బ కానప్పుడు, సజీవుల నగరంగా ఉన్నప్పుడు కుక్కుటర్మా అన్నది దీని పేరు కావచ్చునంటారు. కానీ చరిత్రకారులు మొహెంజదారో అనే వ్యవహరిస్తారు. అలాగే రెడ్డిరాజుల పాలన అన్నది కూడా ఆధునిక చరిత్రకారులు పెట్టిన పేరు. ప్రాచీన భారతదేశపు చరిత్ర అని పెట్టాం. ఆ ప్రాచీన రాతియుగంలోనో మరెప్పుడో దానికి భారతదేశం అన్న పేరు లేదు కదా. ఇలా లెక్కకు మిక్కిలి. కాబట్టి, తెలంగాణ అన్న ఈనాటి ప్రాంతం అనే అర్థం వచ్చేలా రాస్తే సరిపోతుంది. అందుకే నేటి తెలంగాణ అన్నది కలిపాను. కానీ, మొత్తానికి ఆ పదం వ్యాసం నుంచి తొలగించాల్సిన, దాని వాడుకను అభ్యంతరపెట్టాల్సిన అవసరం కనిపించడం లేదు.
  • త్రిలింగ పద ప్రయోగం నుండి తెలుగు పుట్టింది అని చాలా చోట్ల చదివాను, తెలంగాణ ఎలా పుట్టిందో తెలియదు. త్రిలింగ పద ప్రయోగం గురించి చాలానే వివాదాలు ఉన్నాయి. భాషావేత్తలు త్రిలింగ నుంచి తెలుగు పుట్టిందని అంగీకరించట్లేదు. ఇంతకీ ఏమంటారు? తెలంగాణ అన్న పదం ఎలా పుడితే ఈ వ్యాసానికి ఏమిటి?
  • ఆనాటికి తెలుగు వారందరూ ఒక్కటే. ఆనాటికి తెలంగాణ అని వాడటం సరి కాదు.: ఆనాటికి తెలుగువారందరూ ఒక్కటే అన్నదీ మన భావనే. తెలంగాణ వాడకం గురించి ఇక పైన ఉదాహరణ ఇచ్చాను.
  • ఈ వ్యాసంలో కాకతీయుల చరిత్ర తెలంగాణకు మాత్రమే చెందినదిగా చూపే ప్రయత్నం జరిగినది.: తెలంగాణకు కూడా చెందినదిగా ఉండేలా మార్పులు చేస్తే సరిపోతుంది. తెలంగాణ పదం మీద మొత్తానికి అభ్యంతరం పెట్టడం అందుకు మార్గం కాదు.
ఇదీ నా అభిప్రాయం. మిగిలినవారినీ చెప్పనిద్దాం. చెప్పనిచ్చి, ప్రామాణిక చారిత్రక గ్రంథాలను (అందులో తెలంగాణ చరిత్ర గ్రంథాలూ ఉంటాయండీ) పరిశీలించి ఆపైన ఓ నిర్ణయం చేద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 08:10, 28 మే 2020 (UTC)Reply

పవన్ సంతోష్, తెలంగాణ నాకేమీ మింగుడుపడని, జీర్ణించుకోలేని పదమేమి కాదు. ఈ వ్యాసం చరిత్రను వక్రీకరించకూడదు అనేది నా ప్రధమ భావన.

  1. ఈ వ్యాసం చరిత్రను వక్రీకరించకూడదు.
  2. భాషావేత్తలు త్రిలింగ నుంచి తెలుగు పుట్టిందని అంగీకరించట్లేదు. ఇంతకీ ఏమంటారు? తెలంగాణ అన్న పదం ఎలా పుడితే ఈ వ్యాసానికి ఏమిటి? --- ఈ వ్యాసం లో త్రిలింగ అనే పదం నుండి తెలంగాణ పుట్టింది అని ఓ చోట ఉంది. అందుకే ప్రస్తావించాను.
  3. తెలంగాణ నాకేమీ మింగుడు పడని పదమేమి కాదు. ఈ వ్యాసంలో తెలంగాణను మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, వర్ణిస్తూ చాలా పేరా లు ఉన్నాయి. అందుకే అలా అన్నాను. అవి కావాలంటే ఇక్కడ అతికించగలను. ఈ వ్యాస పరిచయం లో మాత్రమే ప్రాంతాలు ప్రస్తావించి ఉంటే బాగుంటుంది. కానీ చాలా చోట్ల అసందర్భంగా ఉంది. _______దేవుడు (చర్చ) 08:26, 28 మే 2020 (UTC)Reply

పవన్ సంతోష్,

  1. కాకతీయులు తెలంగాణను క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. --- ఇది మీరు సవరించారు.
  2. శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్నీ, తెలుగు జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.---- ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ ప్రస్తావన అసందర్భం.
  3. ప్రస్తుత తెలంగాణ అనే పదం కాకతీయుల కాలంలో త్రిలింగ అని, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందింది --- పైన నేను ప్రస్తావించినది ఇదే.
  4. నేటి తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్నపుడు[ఆధారం చూపాలి] తీరాంధ్రంలో వేంగి, చాళుక్య, చోళుల ప్రాభవం క్షీణదశలో ఉంది ----అసందర్భ ప్రస్తావన. గతంలో నేను ఈ వ్యాసం చదివినప్పుడు ఇలా లేదు.
  5. ప్రస్తుత తెలంగాణా[ఆధారం చూపాలి] ప్రాంతం ఆ సమయంలో స్వతంత్ర రాజుల పాలనలో లేదు. కొన్ని భాగాలు పశ్చిమ చాళుక్యుల అధీనంలోను, కొన్ని భాగాలు రాష్ట్రకూటుల అధీనంలోను, కొన్ని భాగాలు వేంగి చాళుక్యుల అధీనంలోను ఉన్న సామంతరాజుల పాలనలో ఉండేవి. ముఖ్యంగా వేంగి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య ఎడ తెరపి లేకుండా అనేక యుద్ధాలు జరిగాయి. తెలంగాణాలోని[ఆధారం చూపాలి] వివిధ ప్రాంతాలు పాలకుల మధ్యలో చేతులు మారుతుండేవి. ఇలా దాదాపు ఐదు వందల యేండ్లు తెలంగాణలో స్వతంత్ర రాజ్యం లేనందున అక్కడ ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడింది.[ఆధారం చూపాలి]--- ఇది మొత్తంగా కాకతీయుల చరిత్ర. తెలంగాణ చరిత్ర మాత్రమే కాదు. ఇక్కడ అసందర్భం.
  6. రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది విస్తరించింది.--- తెలంగాణకు మాత్రమే విస్తరించిందా ?? ఆంధ్రకు లేదా ?
  7. అతని వంశస్తులు ప్రోలరాజు, బేతరాజు, రెండవ ప్రోలరాజు క్రమంగా తెలంగాణా[ఆధారం చూపాలి] ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల పాలనను అంతమొందించ గలిగారు. తరువాత కాకతీయుల పాలన తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది విస్తరించింది. ---ఇక్కడ కూడా!
  8. తెలంగాణ విమోచన;--- ఈ పదంకు కాకతీయుల చరిత్రకు ఏమి సంబందం ?? ఇది కూడా అసందర్భం.

రవిచంద్ర, చదువరి గారు, వెంకట రమణ గారూ,ఈ వ్యాసాన్ని ఇంతకు మునుపు చదివాను. అప్పుడు ఇలా లేదు. అందుకే ప్రస్తావించాను. ఆంధ్రజ్యోతిలో ఓ వ్యాసం లో 12 వ శతాబ్దం లో మయన్మార్ లో తెలుగు మగాడు అని కొద్ది రోజుల కిందట ఓ వ్యాసం వచ్చింది. ఆ వ్యాసకర్తను కూడా అడిగా ఎందుకంటే ఆమె కూడా "తెలంగాణను వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు" అని రాసింది. అలా ఎందుకు రాశారు అని నేను అడిగితే ఆమె సమాధానం ఇవ్వలేదు. దేవుడు (చర్చ) 08:42, 28 మే 2020 (UTC)Reply

చాలాచోట్ల అసందర్భం అన్న పదంతో కొట్టిపారేస్తున్నారు. ఉదాహరణకు "నేటి తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరుగుతున్నపుడు[ఆధారం చూపాలి] తీరాంధ్రంలో వేంగి, చాళుక్య, చోళుల ప్రాభవం క్షీణదశలో ఉంది" ఇందులో తెలంగాణ ప్రస్తావన అసందర్భం అన్నారు. దేనికో తెలియట్లేదు. నేడు తెలంగాణ అంటున్న ప్రాంతంలో, అంటే ఓరుగల్లు పరిసరాల్లో కాకతీయుల రాజ్యానికి అంకురార్పణ జరిగుతూ ఉందని రాయడంలో అసందర్భం, అనౌచిత్యం ఏముంది. ఇది భౌగోళిక వాచకం కదా. తీరాంధ్ర ప్రాంతంలో ఏం జరుగుతోందో, అదే సమయంలో కాకతీయ సామ్రాజ్యం ఎక్కడ అంకురార్పన అవుతుందో చెప్పారు. భౌగోళిక ప్రాంతంగా నేటి తెలంగాణ అన్నా కూడా మీకు అభ్యంతరం దేనికి? మరి ఏమనాలి అంటారు మీరు? --పవన్ సంతోష్ (చర్చ) 10:47, 28 మే 2020 (UTC)Reply
పవన్ సంతోష్, చరిత్ర గురించి రాసే విధానం తెలిస్తే ఇంత సందేహాలు ఉండవు. కాకతీయ సామ్రాజ్యం తెలుగు వారందరికీ చెందినది. ఓరుగల్లు కాకతీయుల రాజధాని. అలాగే నాటి రాయలసీమ, తీరాంధ్ర వాసులకు కూడా ఓరుగల్లు రాజధాని. తెలంగాణ వారికి మాత్రమే ప్రత్యేకం కాదు. నాడు ఈనాడు ఉన్న ప్రాంత భేదాలు లేవు. రుద్రమ్మ గురించి, ప్రతాప రుద్రుడి వీరోచిత పోరాటాలు గురించి తెలంగాణవాసులకు ఉండే గర్వం, చరిత్ర గుర్తింపు, ప్రతి తెలుగు వాడికి, రాయలసీమ, ఆంధ్ర అందరికీ అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కలిసి ఉండేవారము కాబట్టి, మనకు ప్రాంతీయ విద్వేషాలు ఉండేవి కావు కాబట్టి. ఈ వ్యాసం ఇంతకు మునుపు చదివినప్పుడు ఇలా లేదు. ఎవరో సవరించారు. కేవలం తెలంగాణకు మాత్రమే కాకతీయ చరిత్ర చెందినట్టు రాశారు. ఇది తటస్థ దృక్కోణంలో లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా లేదు. ఆనాటి చరిత్రకు ప్రాంత బేధాలు ప్రస్తుత రాజకీయ బౌగోళిక పరిస్థితులు ఆపాదించలేము. 1956 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు నేటి తెలంగాణ జిల్లాలు ఆపాదించి రాయగలవా ?. నాటి ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలో పుట్టిన వారికి ఆంధ్రప్రదేశ్లో పుట్టారని రాయరు కదా, ఉదా:- # https://en.wikipedia.org/wiki/N._T._Rama_Rao. ఈ వ్యాసం లో బోర్న్ ఆన్ 28 May 1923[1] Nimmakuru, Madras Presidency, British India (now in Andhra Pradesh, India) # https://en.wikipedia.org/wiki/Tanguturi_Prakasam , Born 23 August 1872 Vinodarayunipalem, Madras Presidency, British India (now Vinodarayunipalem, Andhra Pradesh, India). ఇది అలాగే!. దేవుడు (చర్చ) 11:18, 28 మే 2020 (UTC)Reply
ఒకసారి మీరే సరిజూసుకోండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని అన్నారు. ఆ సమకాలీనత ఎప్పుడూ ఉంటుంది. సరే అది వదిలెయ్యండి. నాకు మీ పాయింట్ అర్థం కాకపోలేదు, కానీ దానికి తెలంగాణ అన్న పదాన్ని తొలగించుకుంటూ పోవడం మార్గం కాదు. "తెలుగువారికి గర్వకారణం" అని భావించే సెంటిమెంట్ ప్రతిబింబించే పుస్తకాలు తీసుకుని, అలా భావిస్తారని కోట్ చేయడం. అలానే తెలంగాణ చరిత్రకు కాకతీయ సామ్రాజ్యం మకుటాయమానమని భావిస్తూ, ఆ ప్రకారం చరిత్ర నిర్మిస్తున్న ఇటువైపు ప్రయత్నాలనూ వివరిస్తూ కోట్ చేయడం. - ఈ పని జరగాల్సి వుంది. అప్పుడు తటస్థ దృక్కోణం వస్తుంది. లెగసీ (వారసత్వ సంపద) గురించిన ఓ విభాగం పెట్టి ఇదంతా రాస్తాను. మీరు కూడా కాస్త స్పష్టంగా మీ సమస్య వ్యక్తం చేస్తూ ఉంటే బావుంటుంది. మరో సంగతి అవతలివారికి ఏం తెలుసో ఏం తెలియదో ఊహించుకుని రాయవద్దు, దానివల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 11:37, 28 మే 2020 (UTC)Reply
పవన్ సంతోష్, https://en.wikipedia.org/wiki/Taxila వ్యాసంలో పాకిస్థాన్ గురించి ఎన్నిసార్లు రాశారు ? ఇది తక్షశిల గురించి ఉందా, పాకిస్థాన్ గురించి ఉందా, తక్షశిలకు భారత దేశానికి ఏ సంబంధం లేదంటారా ? దేవుడు (చర్చ) 11:41, 28 మే 2020 (UTC)Reply
పవన్ సంతోష్ గారు, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు, ఈ వ్యాసంలో ప్రత్యేకంగా తెలంగాణను, ప్రత్యేకంగా ఆంధ్రను రాస్తే ఇరువైపులా ఇబ్బంది అనుకుంటే మధ్యే ప్రాంతంగా తెలుగునాడు అనో తెలుగు ప్రాంతం అనో, కాకతీయ సామ్రాజ్యం అనో రాయాలి. ఆ మ్యాప్లు జత చేయాలి. అంతే కానీ, ఓ ప్రాంతానికి మాత్రమే ఆపాదించడం చరిత్రను వక్రీకరించడమే. కాకతీయ సామ్రాజ్యం తెలంగాణకే మకుటాయమానం కాదు. ఆంధ్ర, రాయలసీమకు, తెలుగు వారందరికీ కూడా!. ఆంధ్రా లో కూడా పురాతన చెరువులు ఉన్నాయి. దేవుడు (చర్చ) 11:50, 28 మే 2020 (UTC)Reply

ఇంకోటి, "ఈ కాలంలో కాకతీయ సామ్రాజ్యం సిరిసంపదలతో తులతూగుతున్నట్లు అమీర ఖుస్రూ, అబ్దున్నా వాసఫ్, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తుంది. వ్యవసాయమే నాడు తెలంగాణ ప్రాంతానికి ప్రధాన వృత్తి" --ఇది కూడా మార్చాలి. దేవుడు (చర్చ) 13:31, 28 మే 2020 (UTC) . [3]Reply

పవన్ సంతోష్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని ఓ సూచన ఉన్నప్పటికీ ప్రధాన ప్రస్తావన మద్రాసు ప్రెసిడెన్సీ అనే ఉంది. నేనూ ఇంకొంత వెబ్ శోధన, పుస్తక శోధన చేసి ఈ కాకతీయుల వ్యాసం గురించి మరిన్ని విషయాలు నిర్ధారిస్తాను. మీ ముందుకు ఇంకొన్ని విషయాలు తీసుకువస్తాను. దీనిని సవ్యం గా మెరుగు పరచి తాళం వేద్దాం. ఎందుకంటే కొన్ని సవరణలు కేవలం ఐపి తోనే ఉన్నాయి. మీ సలహాకు ధన్యవాదాలు. స్పందించిన రవిచంద్ర గారికి ధన్యవాదాలు. దేవుడు (చర్చ) 14:15, 28 మే 2020 (UTC)Reply
@C.Chandra Kanth Rao: గారూ, ఈ వ్యాసాన్ని తెలంగాణ చరిత్ర వర్గంలో చేర్చిందీ, వ్యాసంలో తెలంగాణను పాలించిన రాజవంశాలన్న మూస పెట్టిందీ మీరని ఇందాక చూశాను. ఈ చర్చ అంతా పరిశీలించి మీ అభిప్రాయం చెప్తే ప్రయోజనకరంగా ఉంటుందని మిమ్మల్ని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:53, 29 మే 2020 (UTC)Reply

కాకతీయ సామ్రాజ్యం మ్యాప్లు

మార్చు

దయచేసి ఎవరి వద్దనైనా సువిశాల కాకతీయ సామ్రాజ్యం మ్యాప్లు ఉంటే జతపరచండి. దేవుడు (చర్చ) 12:04, 28 మే 2020 (UTC)Reply

మూలాలు

మార్చు
  1. Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.
  2. Journal of the Andhra Historical Research Society, Vol. IV, pp. 147-64.
  3. https://books.google.co.in/books?id=pfAKljlCJq0C&pg=PA129&lpg=PA129&dq=maps+of+kakatiya+kingdom&source=bl&ots=tU69mmW_N9&sig=ACfU3U0CfWeZUwY-WF1zJ-K-Smbwu1NsfQ&hl=te&sa=X&ved=2ahUKEwiruOXVz9bpAhXmyTgGHTnKADoQ6AEwEHoECAsQAQ#v=onepage&q=maps%20of%20kakatiya%20kingdom&f=false
Return to "కాకతీయులు" page.