ఈ రోజు మంగళవారం, డిసెంబరు 3, 2024.

వాడుకరి:దేవుడు

నా గురించి
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.


Aఈ వాడుకరి ఆంగ్ల వికీ వ్యాసాల అనువాదంచేస్తారు.
రచన ఈ వాడుకరి అభిరుచి.
ఈ వాడుకరి ఆత్మసంతృప్తి అనే స్వార్థంతోనే వికీకి తోడ్పడతారు!!
వాడుకరి బేబెల్ సమాచారం
te-N ఈ వాడుకరి మాతృభాష తెలుగు.
en-4 This user has near native speaker knowledge of English.
భాషల వారీగా వాడుకరులు

భాషలు
తెలుగు* ఆంగ్లము

తెలుగు వికీపీడియా
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
4 సంవత్సరాల, 8 నెలల, 4 రోజులుగా సభ్యుడు.
840 ఈ వాడుకరి తెవికీలో 840కి పైగా మార్పులు చేసాడు.
ఈ వాడుకరికి నికొలో డా కాంటి ఎవరో, అతను తెలుగు ని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని ఎందుకన్నాడో తెలుసు!

_____________________________________________________________________________________________________________________________________________________ తెలుగు వికీపీడియా సభ్యులు అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2020 న జరిగిన అనవసర చర్చకు, రాద్ధాంతలకు నేను కారణంగా భావిస్తూ నైతిక భాధ్యత వహిస్తూ తెలుగు వికీపీడియా నుండి స్వచ్చందంగా తప్పుకుంటున్నాను. ఇది నేనేదో భావోద్వేగానికి గురి అయ్యి తీసుకున్న నిర్ణయం కాదు. నేను నమ్మే సిద్ధాంతాలకు ఇక్కడ నా మీద వస్తున్న ఆరోపణలకు నాకు సరి పోవడం లేదు అని భావిస్తున్నాను[1]. నేను ఇక్కడ సభ్యుల భావాలకు నాకు 95% సరిపోవడం లేదు అనుకుంటున్నాను. ఈ వాదోపవాదాల వల్ల నాకు వ్యక్తిగతంగా కాలయాపన జరుగుతోంది. మీ సమయాన్ని వృధా చేస్తున్నాను. నేను ఆలోచించే విధంగా ఏ ఒక్కరూ కనీస ఆలోచన చేయడం లేదని అర్థం అయ్యింది. ఇక్కడ ఉండి ఇంత మందిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం కంటే తప్పుకుని నా పని నేను చూసుకోవడం సరి అనిపిస్తోంది. నేను ఇక్కడ ప్రయాణం ఆరంభించిన నాటి నుంచి నాకు ఇంత వరకు సహాయసహకారాలు అందించిన సభ్యులకి, నిర్వాహకులకి, అధికారులకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నా వల్ల నొచ్చుకున్న అందరికీ నా క్షమాపణలు. నేను ఇది ఎవరి మీదో నిరసనగానో చేయడం లేదు. తెవికీ లో మీ అందరి కృషికి మనస్పూర్తిగా అభినందనలు. తెలుగు భాష పై అభిమానంతో మీరు ఇలాగే కొనసాగాలని, తెలుగు భాషకు మరిన్ని సేవలు మీ నుండి అందాలని భావిస్తున్నాను. మీరు నన్ను మనస్పూర్తిగా క్షమిస్థారని భావిస్తూ, మీకు అంతా మంచే జరగాలని భావిస్తున్నాను. సెలవు. ఇక తిరిగి చూడను. _____దేవుడు (చర్చ) 01:34, 27 సెప్టెంబరు 2020 (UTC) ___________________________________________________________________________________________________________________________________________________

నా గురించి తెలుసుకోవాలన్న ఆతృత కొద్ది ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. నా వాడుకరి పుటకు విచ్చేసిన మీకు స్వాగతం! నేను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. నేను తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ మార్చి 29, 2020. నేను గత 10 సంవత్సరాలుగా వికీపీడియా మరియు ఇతర అంతర్జాల పుటలు బాగా చదువుతున్నప్పటికి అంతర్జాలం లో నా కృషి ఏమి లేదు. కానీ కృషి చేస్తున్న వారి బ్లాగులు ఇతరాలు గూగుల్లో కనిపించేవి. అలా వాటిని చదివేవాడిని. గూగుల్ లో నాకు కావాల్సిన విషయాల గురించి శోధిస్తున్నప్పుడు ఇలా వికీపీడియాలోను చాలా సార్లు వచ్చేవాడిని. అలా వికీపీడియా పరిచయము. ఆంగ్ల వ్యాసాలు చదివేటప్పుడు ఆ వ్యాసం తెలుగులో(అక్కడే ఉన్న భాషల జాబితాలో) ఉందేమో చూసేవాడిని. ఆ వ్యాసం తెలుగులో ఉండి చదవడానికి బాగున్నప్పుడు తెలుగులోనే చదివేవాడిని. కానీ అన్ని వ్యాసాలు తెలుగులో ఉండేవి కావు. అప్పుడు కొంచెం నిరాశ చెందేవాడిని. ఈ 2020 ఏప్రిల్ 19న కొంత వీలు చిక్కడంతో ఏదో ఓ వ్యాసంతో తెవికీ లో నా ప్రయాణం ప్రారంభించాను. మొత్తానికి రెండు రోజులు కస్టపడి వ్యాసం పూర్తి చేశాను. అప్పటికి తెవికీ వాడుకరి ఐచ్చికముల గురించి ఏమి తెలియదు. నెమ్మదిగా చేసే కొద్ది నేర్చుకున్నాను.

నా అసలు పేరు దేవుడు కాదు. ఇది కేవలం నా వికీపీడియా వాడుకరి పేరు మాత్రమే. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చర్చ వద్ద తెలుపగలరు.

నచ్చే సినిమాలు

మార్చు

ఇటీవల hotstar లో హిందీ చిత్రమైన chichchore చూశాను. బాగా నచ్చింది. నాకు ఇష్టమైన తెలుగు నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. యన్టీఆర్ పాత చిత్రాలు దాదాపు అన్నీ ఇష్టమే. పాత సినిమాలలోని తెలుగు చాలా ఇష్టం. ఆ భాషలో ఎటువంటి కల్తీ ఉండదు. కొత్తవి బాగున్నవి, ఆసక్తి ఉన్నవి తప్పకుండా చూస్తాను. ఆంగ్ల అనువాద చిత్రాలు కూడా బాగా చూస్తాను. మార్వెల్, సిల్వెస్టర్ స్టాలోన్ మరియు ఇతర సాహసోపేత చిత్రాలు బాగా ఇష్టం.

నచ్చే వంటలు, ఆహారపు అలవాట్లు

మార్చు

ఇడ్లీ, రాగి సంగటి, గుడ్డు దోశె, చికెన్ బిరియాని, రాయలసీమ విధానంలో చేసిన కోడి కూర, పెరుగన్నంతో ఆవకాయ, ఆంధ్ర టొమోటో పప్పు బాగా ఇష్టం. మటన్, చేపలు, ప్రాన్స్ ఇతరాలు అస్సలు తినను. శనివారం ఉపవాసాలు అస్సలు ఉండను. శనివారం మాంసాహారం తినను, ఆదివారం తింటాను లాంటి విధానాలకు చాలా దూరం. మాంసాహారం తినడం ఆపేద్దామని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. 2015-2017 మధ్య ఓ సంవత్సరం పాటు తినలేదు. కానీ ఉద్యోగరీత్యా ఓ సారి చికెన్ తినవలసి వచ్చింది. తర్వాత కొనసాగించాను.

వంట చేయడం

మార్చు

నేను చేయగలిగే క్లిష్టమైన వంట ఆమ్లెట్ వేయడం, అన్నం ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండటం, గుడ్డు దోస, గుడ్డు వేపుడు అన్నం చేయడం అంతే!.

విహార యాత్రలు, ప్రయాణాలు

మార్చు
  1. 2011లో హైదరాబాద్ నుండి ఉద్యోగ నిమిత్తం మధ్య ప్రదేశ్ లోని భోపాల్ మరియు ఇండోర్ మీదుగా మహేశ్వర్ చేరుకున్నాను. అక్కడే 10 రోజులు ఉన్నాను. ఇక్కడే నర్మదా నది పక్కన రాణి అహిల్యా భాయి పాలించిన కోట ఉంది. ఇక్కడి నుండి ఓ రోజు ఓంకారేశ్వర్ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. ఇక్కడి మహేశ్వర్ కోటలోనే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చిత్రీకరణ జరిగిందట.
  2. 2011లోనే యానాం కూడా వెళ్ళాను. యానాం చాలా చక్కగా ఉంది. ఇక్కడ గోదావరి తల్లిని దర్శించడం గొప్ప అనుభూతి.
  3. 2019 లో ఏలగిరి కొండలు పర్యటించాను. ఈ అనుభవంతోనే ఏలగిరి కొండలు వ్యాసం రాయడం జరిగినది.
  4. 2019 లోనె బెంగళూరు సమీపం లోని నంది కొండలు స్నేహితులతో కలిసి చూసొచ్చాము. మేఘాలపై నుండి సూర్యోదయాన్ని చూడటం ఓ గొప్ప అనుభూతి.

తెవికీలో నా కృషి వివరములు

మార్చు

గత 6 నెలల్లో నా మొత్తం సవరణలు 840. మొత్తం నా ద్వారా రూపు దిద్దుకున్న పుటలు 41. [2] సగటున పుటకు 12 సవరణలతో మొత్తం సవరణలు చేసిన పుటలు 71. [3]

నేను సృష్టించిన వ్యాసాలు

మార్చు
వ.సం వ్యాసం తేదీ పరిమాణం ప్రస్తుత పరిమాణం
1 తుఫాన్ నొరు (2017) · (Deleted) 2020-07-31 13:52 937 NA
2 ములుకనాడు బ్రాహ్మణులు 2020-05-28 03:34 605 8,801
3 భారతి ఎయిర్టెల్ 2020-05-16 06:12 3,268 4,457
4 చిన్మయానంద సరస్వతి 2020-05-16 05:22 394 28,009
5 వోడాఫోన్ ఐడియా 2020-05-16 03:12 6,161 19,472
6 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 2020-05-15 16:22 3,120 4,835
7 అమర రాజా గ్రూప్ 2020-05-05 13:50 1,316 11,953
8 భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ సొల్యూషన్స్ 2020-04-29 05:20 2,015 7,666
9 చిన్మయారణ్యం 2020-04-28 15:00 1,235 8,861
10 చిన్మయ మిషన్ 2020-04-28 14:32 1,847 4,372
11 స్వామి తేజోమయానంద 2020-04-28 14:17 6,697 7,589
12 మంగళంపల్లె 2020-04-28 12:47 1,117 19,308
13 ఇజ్రాయేల్ 35 వ ప్రభుత్వం · (Deleted) 2020-04-28 12:27 1,132 N/A
14 చనిపోయిన తర్వాత శరీరం బిగుసుకు పోవుట (రిగార్ మోర్టీస్) · (Deleted) 2020-04-28 12:19 1,367 N/A
15 ది వాయేజ్ ఆఫ్ లైఫ్ (సుదూర జీవనయానం) · (Deleted) 2020-04-28 11:58 3,735 N/A
16 ఐబిఎమ్ ఇండియా 2020-04-28 11:21 8,667 8,825
17 తూర్పు పశ్చిమ గ్యాస్ పైప్లైన్ (భారత దేశము) · (Deleted) 2020-04-26 13:27 2,600 N/A
18 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టిపిసిసి) 2020-04-26 11:09 2,880 3,232
19 నల్లమలలో యురేనియం అన్వేషణ 2020-04-26 08:43 3,295 17,316
20 యురేనియం త్రవ్వకాలు 2020-04-26 08:15 2,181 2,285
21 రెడ్డియూర్ 2020-04-25 13:20 3,242 3,526
22 ఏలగిరి 2020-04-25 11:55 19,860 23,400
23 సిల్వియా లైకెన్స్ హత్య 2020-04-19 15:52 31,966 27,269
24 పైశాచిక వ్యక్తిత్వ రోగం · (Deleted) 2020-04-19 10:17 2,476 N/A
25 ఇండియానపొలిస్ · (Deleted) 2020-04-19 09:07 6,986 N/A

నా ప్రమేయం ఉన్న వ్యాసాలు

మార్చు

1. అరటి

ప్రశంసలు

మార్చు
  తెలుగు అనువాద వ్యాసాల పతకం
దేవుడు గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:43, 13 ఆగస్టు 2020 (UTC)

ఈనాటి చిట్కా

మార్చు
ఈ నాటి చిట్కా...
 
నా అభిరుచులు లో ఇటీవలి మార్పులను ఉత్కృష్టపరచుకోండి

మీ అభిరుచులు పేజీలో "మెరుగైన ఇటీవలి మార్పులు" అంశాన్ని వాడి చూసారా? డిఫాల్టుగా అది అచేతనమై ఉంటుంది. అది పని చెయ్యాలంటే బ్రౌజరు జావాస్క్రిప్టును సపోర్టు చేసేదిగా ఉండాలి. మామూలు ఇటీవలి మార్పులు పేజీలోవలె కాక, ఒక పేజీలో జరిగిన మార్పులన్నిటినీ ఒకచోట సమీకరించి చూపిస్తుంది. ఒకేపేజీలో జరిగిన మార్పుచేర్పులన్నిటి చరితాన్నీ చూపించే లింకు కూడా ఉంటుంది.

మరిన్ని వివరాలకు సహాయము:ఇటీవలి మార్పులు చూడండి


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

మూలాలు

మార్చు
  1. https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%AF%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BE_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A3_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-2#%E0%B0%B8%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF_-_%E0%B0%B8%E0%B0%B2%E0%B0%B9%E0%B0%BE
  2. https://xtools.wmflabs.org/ec/te.wikipedia.org/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81
  3. https://xtools.wmflabs.org/ec/te.wikipedia.org/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81