తిలోత్తమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
 
'''[[తిలోత్తమ]]''' [[ఇంద్రుడు|ఇంద్రుని]] సభలోని [[అప్సరస]]<nowiki/>లలో ఒకరు.<ref>తిలోత్తమ, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 80.</ref> ''తిల'' అనగా నువ్వుల విత్తనం, ''ఉత్తమ'' అనగా మంచి లేదా అంతకంటే ఎక్కువ అని అర్థం. [[బ్రహ్మ]] కోరిక మేరకు దైవ వాస్తుశిల్పి [[విశ్వకర్మ]] ప్రతిదానిలోనూ ఉత్తమమైనది తీసుకొని తిలోత్తమను సృష్టించినట్లుగా హిందూ ఇతిహాసం [[మహాభారతం]]<nowiki/>లో వర్ణించబడింది.<ref name="wendy">{{cite book|last=O'Flaherty|first=Wendy Doniger|authorlink=Wendy Doniger|title=Śiva, the erotic ascetic|year=1981|publisher=Oxford University Press US|pages=84–6, 294–5}}</ref> అసురులు (రాక్షసులు) అయిన సుందోపసుందులు మధ్య యుద్ధానికి కారణమయింది. ఇంద్రుడు వంటి దేవతలు కూడా తిలోత్తమ పట్ల ఆకర్షితులయ్యారు.<ref name = "collins">The Iconography and Ritual of Siva at Elephanta, by Charles Dillard Collins, at pg. 86 at https://books.google.com/books?id=pQNi6kAGJQ4C&pg=PA86&dq=shiva+Tilottama&cd=5#v=onepage&q&f=false</ref>
 
== జననం ==
మహాభారతం యొక్క ఆది పర్వంలో దైవర్షి [[నారదుడు]], [[పాండవులు|పాండవుల]]<nowiki/>కు అప్సరస తిలోత్తమ కారణంగా సుంద ఉపసుంద అనే రాక్షస సోదరులు మరణించిన కథను చెబుతాడు. పాండవుల మధ్య గొడవలకు [[ద్రౌపది]] కూడా ఒక కారణం కావచ్చని హెచ్చరించాడు. సుంద, ఉపసుంద ఇద్దరూ [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] వంశ రాక్షసుడు నికుంభ కుమారులు. రాజ్యం, మంచం, ఆహారం, ఇల్లు, సింహాసనం మొదలైనవి అన్ని వారు ప్రతిదీ పంచుకుంటూ విడదీయరాని బంధంగా కలిసివున్నారు. ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్న కోరికతో ఆ సోదరులు [[వింధ్య పర్వతాలు|వింధ్య పర్వతాల]]<nowiki/>పై తపస్సు చేసి, బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నారు. 'తాము ఏ రూపం కోరుకుంటే ఆ రూపంలోకి మారిపోవడం, ఏ మాయ చేయాలన్నా ఆ మాయను చేయగలగడం, అన్యుల చేతుల్లో చావకుండా ఉండడం' వంటి వరాలు కోరారు. బ్రహ్మ వాటిని ప్రసాదించాడు.
 
[[File:The Churning of the Milky Ocean.jpg|thumb|పాల సముద్ర మధనంలో సముద్రం నుండి ఉద్బవించిన అప్సరసలు.]]
పంక్తి 24:
తిలోత్తమ తన మునుపటి జన్మలో కుబ్జా అనే అందవిహీనమైన వితంతువు అని పద్మ పురాణం వివరిస్తుంది. కుబ్జా ఎనిమిదేళ్లుగా పూజలు చేసిగా మరుసటి జన్మతో తిలోత్తమగా జన్మించి, స్వర్గానికి అప్సరస అయింది.<ref>{{cite book|last=Williams|first=George Mason |title=Handbook of Hindu mythology|year=2003|publisher=ABC-CLIO|page=282}}</ref>
 
బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ [[చంద్రుడు|చంద్రుని]] దగ్గరకు వెళ్తున్నప్పుడు [[బలి చక్రవర్తి]] మనవడు సాహసికుడు ఆపినపుడు, వారి ప్రేమవల్ల కలిగిన అల్లరితో తపోభంగమైన [[దుర్వాసుడు]], సాహసికుడిని [[గాడిద]] <nowiki/>గా మార్చి తిలోత్తమకు శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల [[బాణాసురుడు|బాణాసురుడి]] కూతురుగా ఉష (రాక్షసి)గా పుట్టిన తిలోత్తమ కృష్ణుని మనవడు [[అనిరుద్ధుడు|అనిరుద్దుడి]]<nowiki/>ని వివాహం చేసుకొని శాప విముక్తి పొందింది.<ref>{{cite journal|last=Wilson|first=H H|date=September–December 1833|title=Analysis of the Puranas: Brahma Vaiverita|journal=The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia|volume=XII|page=232}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తిలోత్తమ" నుండి వెలికితీశారు