అక్క మహాదేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5:
ఉడుతడిని పాలించే రాజు
కొంత కాలానికి కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కలిగించాడు. ఒకనాటి రాత్రి ఆమె పడకగదిలో నిద్రిస్తుండగా ఆరాధ్య గురువు వచ్చాడని తెలిసి ఆమె ఉన్నపాటున (దిగంబరిగా) బయటికి వచ్చి గురుదర్శనం చేసుకొనగా, వస్త్రాలు ధరించి రావలసిందిగా గురువు ఆమెను ఆజ్ఞాపించాడు. ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ, "పరమభక్తురాలివి గదా, నీకు వస్త్రం ఎందుకు?" అని అపహాస్యం చేస్తాడు. తక్షణం ఆమె నిడువైన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పివేసి గురుదర్శనం చేసుకుంటుంది. అప్పటినుండి అక్క మహాదేవి వస్త్రాలు ధరింపక జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది. రాజమందిరం నుండి బయటపడిన మహాదేవి అనేక కష్టాలను ఎదుర్కొని కళ్యాణ పట్టణం చేరుతుంది.
అనుభవ మంటపానికి అధిపతి ప్రభుదేవుడు ఆమెను పరీక్షించి మంటప ప్రవేశం కల్పిస్తాడు. బసవేశ్వరుడు ఆమె తేజస్సుకు, వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు. ఆనాటి నుండి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతిచెందినది. ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి తెలుపుతుంది. అతడు శ్రీశైలంలో కదళీ వనంలోగల
|