గుండా మల్లేష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
సింగరేణిలో కార్మికుడిగా చేరిన మల్లేష్ సీపీఐ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు. 1970లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయు రాజకీయ నాయకుడిగా మారాడు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న మల్లేష్, 8సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి, 4సార్లు గెలుపొందాడు. ఒకప్పటి ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గ పరిధిలో బెల్లంపల్లి ఉన్న సమయంలో ఆరుసార్లు, బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు తర్వాత 2009, 2014లో రెండుసార్లు సిపిఐ తరపున పోటీ చేసాడు.
 
1978లో తొలిసారిగా [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం]] నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో 3,849 ఓట్లతో ఓడిపోయాడు. తరువాత [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1983)|1983]] ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యపై 303 ఓట్ల తేడాతో, [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)|1985]] ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యపై 4,048 ఓట్ల తేడాతో గెలిచాడు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్య చేతిలో 5,932 ఓట్లతో ఓడిపోగా, [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)|1994]] ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసరి నర్సయ్యపై 34,155 ఓట్ల తేడాతో గెలిచాడు. అనంతరం 20092004 ఎన్నికల్లో [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అమ్రాజుల శ్రీదేవి చేతిలో 5,452 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
 
బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాడ్డాక 2009లో[[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)|2009]]లో జరిగిన ఎన్నికల్లో పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ పై గెలుపొంది, 12వ శాసనసభలో సభానాయకుడిగా వ్యవహరించాడు. 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో [[టిఆర్ఎస్]] అభ్యర్థి [[దుర్గం చిన్నయ్య]] చేతిలో ఓడిపోయాడు.<ref name="Four-time MLA Gunda Mallesh passes away">{{cite news |last1=Telangana Today |first1=Telangana |title=Four-time MLA Gunda Mallesh passes away |url=https://telanganatoday.com/four-time-mla-gunda-mallesh-passes-away |accessdate=13 October 2020 |date=13 October 2020 |archiveurl=https://web.archive.org/web/20201013133641/https://telanganatoday.com/four-time-mla-gunda-mallesh-passes-away |archivedate=13 October 2020}}</ref>
 
== ఇవికూడా చూడండి ==
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/గుండా_మల్లేష్" నుండి వెలికితీశారు