వాడుకరి చర్చ:Kasyap/పాతవి1: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 358:
మొదటిది కాపీహక్కుల ఉల్లంఘన. [[వికీపీడియా:కాపీహక్కులు|కాపీహక్కుల]] ఉల్లంఘన అన్నది వికీపీడియాలో చాలా తీవ్రంగా పరిగణించాలి. నిజానికి స్పీడీ డిలీషన్ క్రైటీరియాలో కాపీహక్కుల ఉల్లంఘన అనేది ఉంటుంది. అంటే- కాపీహక్కుల ఉల్లంఘన కనిపిస్తే నిర్వాహకులు అత్యంత వేగంగా దాన్ని తొలగించేయవచ్చు (లేదా తొలగించాల్సి ఉంటుంది). ఐతే, ఈ సమస్య మీ దృష్టికి తీసుకువచ్చి, సమస్య తెలియజేస్తే పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువ కాబట్టి, మీ భావి వ్యాసాల కృషిలో ఇలాంటివి లేకుంటాయి కాబట్టి వాటిపై నోటీసు పెట్టి చర్చ ప్రారంభించాను. [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం|ఒక తొలగింపు చర్చలో]] "కొన్ని అనువాదాలను సరిదిద్దాను, ఇంకా కొన్ని మార్పులు చేసాను, ఈ వ్యాసం అందరూ వికీ నియమాలు అనుగుణంగా సరిదిద్ద వచ్చు , ఆయితే వ్యాసం అంతా యాంత్రిక అనువాదం కాదు అన్న విషయం గ్రహించండి" అన్నారు, ఆ అనడంలో నేను వ్యాసం సింహభాగం కాపీ పేస్టు చేసి తెచ్చిందని అన్న సంగతికి మీరు ప్రాముఖ్యత ఈయలేదు. ఇక, మరో [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య|తొలగింపు చర్చలోనూ]] "కాపీ పేస్ట్ భాగాలు ఉన్నాయి" అంటున్నప్పుడు ఆ ప్రస్తావన విడిచిపెట్టి మరేదో అన్నారు. అలానే రచ్చబండలోనూ [[వికీపీడియా:రచ్చబండ#సదుపయోగం_(fair_use)_కింద_మరింత_స్పష్టత_ఇవ్వగలరు|ఒక చర్చ ప్రారంభించి]] ఫెయిర్ యూజ్ కింద దీన్ని లెక్కించవచ్చా అన్నట్టూ రాశారు. ఇక, మీతో నేరుగా చెప్తేనే ప్రయోజనకరంగా ఉంటుందేమోనని ఇలా చెప్తున్నాను. విషయం ఏమంటే - కాపీహక్కులు కలిగిన పాఠ్యాన్ని నేరుగా తెచ్చి వికీపీడియాలో పెట్టడం సరికాదు. ఆ మూలాలు మీరు ఇచ్చినా కూడా ఒప్పదు. మూలం ఇవ్వడం అనేది ఎందుకంటే ఇదిగో ఇదీ ఆధారం అని చెప్పడానికి అంతే కదా. కాపీ పేస్టు చేయడం ఇంటర్నెట్‌లో ఎక్కడైనా సమస్యాత్మకమే, ఇక్కడ మరింత సమస్యాత్మకం. ఇంకొకటి, ఎక్కడ ఏ కాస్త, ఏ రూపంలో కాపీ పేస్టు చేసినా ఒప్పుదల కాదు.<br>
రెండో ముఖ్యమైన సమస్య యాంత్రికానువాదమో ఏమో నాకు తెలియదు, మీరు ప్రచురిస్తున్న వ్యాసాల్లో పెద్ద ఎత్తున కృత్రిమ భాష ఉంటోంది. నేను కొంత దిద్దాను, వెంకటరమణ గారు కొంత దిద్దుతున్నారు. కానీ, అసలంటూ రాస్తున్నప్పుడే మీరు సరిగా రాయడాన్ని మించింది ఏమీ లేదు. ఎందుకంటే నేను సరిదిద్దినంతలో చూసాను, కొన్ని వాక్యాల అసలు అర్థమేమిటో ఊహించడం సాధ్యం కావట్లేదు కూడాను. ఉదాహరణకు [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%9A%E0%B1%88%E0%B0%A8%E0%B1%80%E0%B0%B8%E0%B1%8D&diff=prev&oldid=3059489 ఇందులో] చూడండి: ''ఈ లో, పదం 'హాన్' ఉపయోగించబడుతుంది కోసం పదం Kshirmarg (మా గెలాక్సీ ) లో పురాతన చైనీస్ పురాతన చైనా పీపుల్స్ స్వర్గం యొక్క నది 'కాల్ ఉపయోగిస్తారు ఇది, (天河, టియాన్ అతను).'' అన్న వాక్యాన్ని మూలం వెతుక్కోకండా నాబోటివాడే కాదు ఎంతటి కొమ్ములు తిరిగిన వికీపీడియన్‌ అయినా అర్థం చేసుకుని దిద్దలేరు. [[హాన్ చైనీస్]], [[ఆహా (స్ట్రీమింగ్ సేవ)]] వంటి మీరు మొదలుపెట్టిన వ్యాసాలను నేను సాధ్యమైనంతవరకూ మెరుగుపరిచాను, [[పద్మ కుప్పా]] అనే వ్యాసాన్ని రమణ గారు అసహజ వాక్యాలన్నీ శుద్ధి చేశారు. ఐనా చేయాల్సింది ఇంకా ఉంది. పలు వ్యాసాలు అయితే శుద్ధిచేయాలన్న నోటీసులతో అలానే ఉన్నాయి. ఇందుకు బదులు మీరే మెరుగుగా రాయడం మాత్రమే సిసలైన పరిష్కారం. దానివల్ల ఈ వ్యాసాలే కాదు భవిష్యత్తులో మీరు రాయబోయే వ్యాసాలను కూడా మెరుగుపరిచినవారం అవుతాం. అలా చేయడం ఎలాగంటే - ఒక కిటుకు ఉంది. ఒకసారి మీరు ప్రచురించే ముందు వాక్యాలన్నీ చదివి చూడండి. ఒక్కో వాక్యం మీకే అర్థం కాదు, లేదంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఎలా దిద్దాలో ఆలోచిస్తారు. మొదట్లో ఈ ప్రక్రియ అవలంబిస్తే పోను పోను మీరు అభివృద్ధి చేయగలరని భావిస్తున్నాను. <br>
తెలుగు వికీపీడియాలో చాలామందిమి ఎన్నో వాక్యాలు, వ్యాసాలు కూడా దిద్దుతూ పోతూ ఉంటాం. కానీ ఉన్నవారం ఎంతమందిమి, పెట్టగలిగిన సమయం ఎంత అని చూస్తే మీ వ్యాసం ఎవరో ఒకరు వచ్చి దిద్దేంతవరకూ అది అలాగే సమస్యాత్మకంగా మిగిలిపోతుంది. అందుకు బదులుగా మీకు ఈ విషయం సూటిగా చెప్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కదా అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 10:59, 13 నవంబరు 2020 (UTC).
 
[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు , మీ ప్రత్యేక శ్రద్ధ కు నెనర్లు ... అవును నేను చేసున్న చాలా వాటిలో కృత్రిమ భాష ఉంటోంది , ఎందుకంటే గత మూడు నెలల నుండి రాసున్న నా వ్యాసాలను చాలా వరకు యాంత్రిక అనువాదాలు , వీటిని చాలా వరకు నేను వివిధ అనువాద ఉపకరణాలు పరీక్షించటానికి లేదా నేను ట్రైన్ చేస్తున్న కొంత మంది కొత్తవారికి నా చర్చా పేజి తో సహా ఇక మంచి , చెడ్డ ఉదాహరణలు గా చూపించటానికి వాడుతుంటాను, అలానే కాపీహక్కుల ఉల్లంఘన కింద తీసివేసిన వ్యాసాలను కూడా గమనిస్తూ ఉంటాను , ఇలానే భాషమీద కూడా, వాటిని మార్చటంలో , లేదా ఎత్తిచూపటంలో ఎవరైనా వికీ నియమాల ప్రకారం నడ్చుకోవచ్చు. అయితే ఇక్కడ భాష , సమస్యాత్మకం అనే పదం మీద నావైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలా వాటికి https://en.wikipedia.org/wiki/Wikipedia:Non-free_content ప్రకారం ఉల్లేఖిస్తూ వుంటాను , అయితే అందులో ఎంతవరకు వాడుకోవచ్చు అన్న విషయం మీద నాకు కొంత స్పష్టత లేదు మీరు చెప్పినట్లు అసలు ఏపదము తీసుకోకుంటే ఇబ్బందే లేదు. మీరు సూచించిన అంశాలు పరిగణిస్తాను కొమ్ములు తిరిగిన వికీపీడియన్‌ లకు కూడా అర్ధం అయ్యేట్లు ప్రయత్నం చేస్తాను ! , మరొక్క సారి ధన్యవాదములు [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 17:17, 13 నవంబరు 2020 (UTC)
Return to the user page of "Kasyap/పాతవి1".