లాంగ్‌లెంగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
== జనాభా ==
ఇక్కడ ఫోమ్ నాగా ప్రజలు నివసిస్తున్నారు, ఇక్కడి ప్రజలు ఫోమ్ భాషను మాట్లాడుతారు. 2011 [[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం, లాంగ్‌లెంగ్ పట్టణంలో 7,613 జనాభా ఉంది.<ref name="2011census">{{Cite web|url=http://www.census2011.co.in/data/town/801463-longleng-nagaland.html|title=Longleng City Population Census 2011 - Nagaland|website=www.census2011.co.in}}</ref> ఇందులో 3,991 మంది పురుషులు, 3,622 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 1,226 (16.10%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 91.45% కాగా, ఇది రాష్ట్ర సగటు 79.55% కన్నా ఎక్కువ ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 92.48% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 90.30% గా ఉంది.
 
== పరిపాలన ==
ఈ పట్టణంలో 1,690 గృహాలు ఉన్నాయి, దీనిని 11 వార్డులుగా విభజించారు. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను సరఫరా చేస్తోంది. పట్టణ కమిటీ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ పట్టణ కమిటీకి అధికారం ఉంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లాంగ్‌లెంగ్" నుండి వెలికితీశారు