జగదేకవీరుడు అతిలోకసుందరి: కూర్పుల మధ్య తేడాలు

→‎ఈ చిత్రంలోని పాటలు: వ్యక్తిగత అభిప్రాయాలు, పొగడ్తలు తొలగింపు
ట్యాగు: 2017 source edit
→‎కథ: నిర్మాణ వివరాలు మూలం సాయంతో
ట్యాగు: 2017 source edit
పంక్తి 27:
స్వర్గలోకాన ఇంద్రుని పుత్రిక అయిన ఇంద్రజ ([[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]) భూలోకాన మానససరోవరం అందంగా ఉంటుందని తెలుసుకొని తండ్రి వద్ద అనుమతి తీసుకొని అక్కడకు వస్తుంది. తిరిగి వెళ్ళు సమయంలో స్వర్గలోక ప్రవేశం గావించే ఉంగరాన్ని జారవిడుచుకొంటుంది. దానితో ఆమెకి స్వర్గలోక ద్వారాల వద్దే నిషేధం కలుగుతుంది. రాజు వద్ద తన [[ఉంగరం]] ఉందని తెలుసుకొన్న ఇంద్రజ పిల్లల ద్వారా అతనికి చేరువై ఆ ఉంగరాన్ని సంపాదించే ప్రయత్నంతో నిజంగానే అతనిని ప్రేమిస్తుంది.
మహాదృష్ట ([[అమ్రిష్ పురి]]) అనే దృష్ట మాంత్రికుడు దేవకన్యను బలిస్తే తనకి మరిన్ని శక్తులు వస్తాయని ఇంద్రజని అపహరిస్తాడు. ఇంద్రజ అమాయకత్వానికి, స్వచ్ఛమైన ప్రేమకి ముగ్ధుడైన రాజు మహాదృష్ట నుండి ఆమెను రక్షించటంతో, ఉంగరాన్ని, స్వర్గలోక ప్రవేశాన్ని త్యజించి, మనిషిగా రాజుతోనే జీవించాలని నిర్ణయించుకోవటంతో చిత్రం సుఖాంతమౌతుంది.
 
== తారాగణం ==
* చిరంజీవి
* శ్రీదేవి
* అమ్రిష్ పురి
* కన్నడ ప్రభాకర్
* అల్లు రామలింగయ్య
* రామిరెడ్డి
* బ్రహ్మానందం
* తనికెళ్ళ భరణి
* ప్రసాద్ బాబు
* జనకరాజ్
* సంగీత
* మాస్టర్ రిచర్డ్స్
* బేబి షాలిని
* బేబి షామిలి
* పి. జె. శర్మ
* ఆర్. ఎస్. శివాజీ
* క్రేజీ మోహన్
 
== నిర్మాణం ==
దేవలోకం లోని ఒక దేవకన్య ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ దేవేంద్రుడు కూతురు ఇంద్రజ భూలోకానికి వస్తుంది. ఈ కథాంశాన్ని చక్రవర్తి అనే రచయిత నిర్మాత అశ్వనీదత్ కు చెప్పాడు. దీని ఆధారంగా కథను రాసిన జంధ్యాల దర్శకుడు రాఘవేంద్రరావు ఇచ్చాడు. తర్వాత ఈ సినిమాకు జంధ్యాల మాటలు కూడా రాశాడు.
 
కథానాయిక, నాయకుడు కలుసుకునే తొలి సన్నివేశం మొదటగా ఇలా అనుకున్నారు. గాయపడిన పాపకు చికిత్స చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రుడు మీదకి వెళ్ళేందుకు ఒక మిషన్ నిర్వహించాలనుకుంటుంది. అంతరిక్ష నౌకలో చంద్రుడి మీదకి వెళ్ళివచ్చినవారికి కోట్ల డబ్బులు ఇస్తామని చెబుతుంది. పాపకోసం అందుకు ఒప్పుకున్న కథానాయకుడు చంద్రుడి మీదకి వెళతాడు. అక్కడ విహారానికి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఉంగరం పోగోట్టుకొంటుంది. అది కథానాయకుదికి దొరకడంతో దాన్ని వెతుక్కుంటూ ఆమె భూమి మీదికి వస్తుంది. తర్వాత చంద్రుడు, అంతరిక్ష నౌక అంత సహజంగా చిత్రీకరించలేమని భావించిన దర్శకుడు రాఘవేంద్రరావు ఇద్దరూ మానససరోవరంలో కలుసుకునే ఆలోచనను చిరంజీవి స్వయంగా సూచించాడు.<ref>{{Cite web|url=https://telugu.news18.com/news/movies/megastar-chiranjeevi-sridevi-k-raghavendra-rao-c-aswani-dutt-jagadeka-veerudu-athiloka-sundari-behind-the-story-ta-512332.html|title=జగదేకవీరుడు అతిలోకసుందరి అసలు కథ అది కాదట.. ఇంతకీ ఏమిటంటే..|date=2020-05-08|website=News18 Telugu|access-date=2021-01-22}}</ref>
 
==ప్రత్యేకతలు==