విష్ణువు: కూర్పుల మధ్య తేడాలు

Yella Srinu (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3088030 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చి clean up, replaced: రాముడురాముడు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 6:
:వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
 
[[హిందూ మతము|హిందూ మత]] సంప్రదాయంలో [[త్రిమూర్తులు]]గా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో '''విష్ణువు''' ఒకరు. [[బ్రహ్మ]]ను సృష్టికర్తగాను, [[విష్ణువు]]నువిష్ణువును సృష్టి పాలకునిగాను, [[శివుడు|శివుని]] సృష్టి నాశకునిగాను భావిస్తారు. [[శ్రీవైష్ణవం]] సంప్రదాయంలో '''విష్ణువు''' లేదా '''శ్రీమన్నారాయణుడు''' సర్వలోకైకనాధుడు, పరబ్రహ్మము, సర్వేశ్వరుడు. శంకరాచార్యుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తుల ప్రకారం విష్ణువు ఐదు ముఖ్యదేవతలలో ఒకడు.<ref>The Sri Vaishnava Brahmans, K. Rangachari (1931)p. 2</ref> [[యజుర్వేదం]], [[ఋగ్వేదం]], [[భాగవతం]], [[భగవద్గీత]] వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.<ref>Albrecht Weber, ''Die {{IAST|Taittirîya-Saṃhitâ}},'' Leipzig, Indische Studien 11-12, Brockhaus (1871, 1872) [http://titus.uni-frankfurt.de/texte/etcs/ind/aind/ved/yvs/ts/ts.htm etext]
</ref><ref>[[A. Berridale Keith]], [http://www.sacred-texts.com/hin/yv/index.htm ''The Yajur Veda - Taittiriya Sanhita''] 1914, full text, (online at sacred-texts.com). For specific verse, see [Kanda V, verse 5.1. http://www.sacred-texts.com/hin/yv/yv05.htm] "all the deities are Agni; the sacrifice is Visnu; verily he lays hold of the deities and the sacrifice; Agni is the lowest of the deities, Visnu the highest"
</ref><ref>Devi Chand, ''The Yajurveda. Sanskrit text with English translation. Third thoroughly revised and enlarged edition'' (1980).
పంక్తి 13:
</ref>
 
[[విష్ణు సహస్రనామ స్తోత్రం]]<ref>[http://www.swami-krishnananda.org/vishnu/vishnu_1.html Sri Vishnu Sahasaranama - Transliteration and Translation of Chanting<!-- Bot generated title -->]</ref> లో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వరూపుడని, కాలాతీతుడని, సృష్టి స్థితి లయాధిపతియని, దేవదేవుడని కీర్తించింది. పురాణాలలో విష్ణువు వర్ణన ఇలా ఉంటుంది - నీలమేఘశ్యామవర్ణం కలవాడు, చతుర్భుజుడు, పంచాయుధములు ధరించినవాడు, పాల సముద్రంలో శేషునిపై పవళించినవాడు, శ్రీదేవి, భూదేవిలచే కొలువబడుచున్నవాడు, శ్రీవత్సచిహ్నమును, [[కౌస్తుభము]]ను, వైజయంతీ మాలను ధరించినవాడు, గరుడునిపై ప్రయాణించువాడు.<ref>{{cite web
|url=http://vedabase.net/bg/11/3/en1
|title=Bhagavad-gita As It Is Chapter 11 Verse 3
పంక్తి 26:
}} "..see the cosmic manifestation"</ref>
 
యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరిస్తాడు. అలాంటి అనేక అవతారాలలో [[దశావతారములు]] ప్రసిద్ధములు. ముఖ్యముగా [[నరసింహస్వామి]], [[రామావతారము|రాముడు]], [[కృష్ణుడు]], [[వెంకటేశ్వరస్వామి]] వంటి అవతారాలలో విష్ణువు పూజింపబడుతాడు.<ref>[http://www.vedabase.net/bg/4/7/en1 Bhagavad Gita 4.7] {{Webarchive|url=https://web.archive.org/web/20140928174424/http://vedabase.net/bg/4/7/en1 |date=2014-09-28 }} "...at that time I descend Myself"</ref><ref name = Krishna4>
{{cite book
|author=Matchett, Freda
పంక్తి 45:
[[దస్త్రం:Museum für Indische Kunst Dahlem Berlin Mai 2006 036 2.jpg|right|thumb|13 వశతాబ్దంలో కాంబోడియాకు చెందిన విష్ణువు విగ్రహం]]
 
"విష్" అనే ధాతువునుండి "విష్ణు" అనే పదానికి భాష్యకారులు అర్ధం చెబుతారు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్ధాలున్నాయి. [[విష్ణు సహస్రనామ స్తోత్రం]] మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. "యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు - అని నిరుక్తి అర్ధం. "వేవేష్టి ఇతి విష్ణుః" అని శంకరాచార్యుల వ్యాఖ్యానం. "విశ్వం" అంటే అంతా తానైనవాడు. "విష్ణువు" అంటే అన్నియెడలా ఉండేవాడు. "భూత భవ్య భవత్‌ప్రభుః" అంటే గడచిన కాలానికి, జరుగుతున్న కాలానికి, రాబోయే కాలానికి కూడా ప్రభువు. భూత కృత, భూత భృత్, భావః, భూతాత్మా, భూత భావనః అంటే అన్ని భూతాలను (జీవులను) సృష్టించి, పోషించి, భరించేవాడు. అన్ని జీవులలోను ఉండేవాడు. ఈ నామ పదాలు హిందూ సంప్రదాయంలో విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నాయనుకోవచ్చును. అనగా విష్ణువు కాలానికి, స్థలానికి, పదార్ధానికి అతీతుడు. <ref>Swami Chinmayananda's translation of Vishnu sahasranama pgs. 16-17, Central Chinmaya Mission Trust.</ref>
 
[[భాగవతం]] [[గజేంద్ర మోక్షం]] ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. కాని విష్ణువు ఆ మొర ఆలకించి గజరాజును రక్షించడానికి పరుగున వచ్చాడు. అనగా ఆ ప్రార్థనలో చెప్పిన లక్షణాలు విష్ణువుకు అన్వయిస్తాయనుకోవచ్చును - అవి -
పంక్తి 70:
 
== పురాణేతిహాసాలలో విష్ణువు ==
హిందూ [[పురాణాలు]], ఇతిహాసాల ప్ర‌కారం బ్ర‌హ్మ సృష్టిక‌ర్త కాగా విష్ణువు ర‌క్ష‌ణ‌కారుడుగా ప‌ర‌మ శివుడిని వినాశ‌కారుడిగా భావిస్తారు. పురాణాలలో కేవలం [[విష్ణువు]]కువిష్ణువుకు సంబంధించిన ప్రస్తావన ఆంశాలున్నది, విష్ణుపురాణం. చతుర్ముఖ బ్రహ్మ మొదటగా దక్ష పజాపతికి వినిపించగా, దక్షుడు ద్వారా పురుకుత్సుడను రాజుకు చెప్పగా, ఈ రాజు సారస్వతుడను వానికి చెప్పాడు. పులస్త్య బ్రహ్మ వలన దివ్యజ్ఞాన శక్తిని పొందిన వాడు, వశిష్టుడు మహర్షి యొక్క మనుమడు, శక్తి మహర్షి,దృశ్యంతి దంపతుల కుమారుడు అయిన పరాశర మహర్షి సారస్వతుడు ద్వారా పొందగా, పరాశరుని నుండి అతని శిష్యుడు అయిన మైత్రేయుడుకు విష్ణుపురాణం వివరించి వినిపించాడు. సృష్టి, స్థితి, లయ కారకులు అయిన [[బ్రహ్మ]], విష్ణువు, మహేశ్వరుడు కథలే పురాణాములు. ఇందులో పది పురాణాములు శివునికి, రెండు దేవీకి, నాలుగు బ్రహ్మ పరమైనవి, విష్ణువు సంబంధించినవి.
 
===మహావిష్ణువు అవయవాలు===
అష్టాదశా మహాపురాణాలు అయిన 1.బ్రహ్మ పురాణం (మహావిష్ణువు యొక్క శిరస్సు), 2.పద్మపురాణం (మహావిష్ణువు యొక్క హృదయం), 3.విష్ణుపురాణం (మహావిష్ణువు యొక్క కుడిచేయి), 4.వాయుపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమచేయి), 5.శ్రీమద్భాగవతపురాణం (మహావిష్ణువు యొక్క తొడలు), 6. నారదపురాణం (మహావిష్ణువు యొక్క నాభి), 7.మార్కండేయపురాణం (మహావిష్ణువు యొక్క కుడిపాదం), 8.అగ్నిపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ పాదం), 9.[[భవిష్యపురాణం]] (మహావిష్ణువు యొక్క కుడిమోకాలు), 10.బ్రహ్మవైవర్తపురాణం (మహావిష్ణువు యొక్క ఎడామ మోకాలు), 11.లింగపురాణం (మహావిష్ణువు యొక్క కుడి చీలమండ), 12.వరాహపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ), 13.స్కాందపురాణం (మహావిష్ణువు యొక్క కేశములు), 14.వామనపురాణం (మహావిష్ణువు యొక్క చర్మము), 15.కూర్మపురాణం (మహావిష్ణువు యొక్క వీపుభాగం), 16.మత్స్యపురాణం (మహావిష్ణువు యొక్క మెదడు), 17.గరుడపురాణం (మహావిష్ణువు యొక్క మాంససారము), 18.బ్రహ్మాండపురాణం (మహావిష్ణువు యొక్క ఎముకలు) మొదలయినవి; మహావిష్ణువు యొక్క శరీరం లోని 18 అవయవములతో పోల్చారు. <ref>పురాణ వాఙ్మయము, పుట 12 </ref> <ref>https://ramanan50.wordpress.com/2014/09/05/puranas-as-body-parts-of-vishnu-list/</ref>
 
===పురాణములు క్రమం===
"https://te.wikipedia.org/wiki/విష్ణువు" నుండి వెలికితీశారు