వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 418:
చర్చలో తమ అభిప్రాయం చెప్పినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, దీనిపై చర్య తిసుకోవాలనే ఏకాభిప్రాయం వచ్చిందని ప్రకటిస్తున్నాను. ఇకముందు ఈ ఖాతాలు చేసే దిద్దుబాట్లను పరిశీలిస్తూ, అవసరమనిపించినపుడు చర్య తీసుకుందామని నా అభిప్రాయం. నమస్కారం. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 14:34, 25 మే 2021 (UTC)
{{Discussion bottom}}
== చంద్రకాంతరావు గారి వ్యక్తిగత దాడులు, వేధింపులు ==
గత వారం రోజులుగా చంద్రకాంతరావు గారు తెలుగు వికీపీడియాలో చేస్తున్న వ్యక్తిగత దాడులు, నిరాధారమైన నిందలు, వేధింపులు, ఇతర వికీపీడియా నియమాల ఉల్లంఘనలు ఇలా ఉన్నాయి:
;వ్యక్తిగత దూషణలకు ప్రోత్సాహం
* అజ్ఞాత వాడుకరి చదువరి గారిని, నన్ను [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%3A%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1&type=revision&diff=3219216&oldid=3219034 అసభ్యమైన భాష ఉపయోగించి] తిట్టారు. "అరేయ్, ఒరేయ్" అంటూ [[వికీపీడియా:రచ్చబండ#అజ్ఞాత_వాడుకరి_రాసిన_చెత్త_తొలగింపు|సూటిగా అవమానించారు]]. "సభ్యుడిపై ఒళ్ళుమండి ఇలా చేశాడనుకుంటాను.", "అజ్ఞత వాడుకరి రాసినది చెత్త కానేకాదు." అని ప్రారంభించి అజ్ఞాత ఇలా వ్యక్తులను అసభ్యకరమైన భాష వాడడాన్ని, అవమానించడాన్ని [[వాడుకరి:C.Chandra Kanth Rao]] గారు సమర్థించారు. ఈ సమర్థన అన్నది ఆయన దాదాపు 14 తేదీ నుంచి 21 తేదీ వరకూ రకరకాలు వ్యాఖ్యల్లో చేశారు. "తిట్లు తినడం మీ స్వయంకృతాపరాధం.", "స్వయంగా కల్పించికున్న స్వయంకృతాభిరామమిది" (స్వయంకృతాపరాధం?) అంటూ [[వికీపీడియా:రచ్చబండ#చంద్రకాంత_రావు_గారు_మర్యాదగా_మాట్లాడితే_బావుంటుంది!|రకరకాలుగా ఆ తిట్లను ప్రోత్సహించార]]ు.
* సమాజంలోని ప్రతీవ్యక్తికీ గౌరవం పొందే కనీస హక్కు ఉంటుంది. వికీపీడియాలో చూసినా [[వికీపీడియా:ఐదు మూలస్తంభాలు|మూలస్తంభాల్లో]] తోటి సభ్యులను గౌరవించడమన్నది ఒకటి. చంద్రకాంతరావు గారు కూడా అవి తిట్లేనని అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు వికీపీడియాలో "వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి.", "వివాదాలేమైనా తలెత్తితే, సరైన చర్చాపేజీలో మృదువుగా చర్చించండి." అంటూ ఉన్న తెలుగు వికీపీడియా మూలస్తంభానికి తిట్లు నేరుగా వ్యతిరేకం అని ఆయనకు ఒక మాజీ నిర్వాహకునిగా తెలిసినప్పుడు. ఇలా ఒక అజ్ఞాత చేసిన తిట్లదాడిని, దూషణను సమర్థించడం వికీపీడియా విధానాలకు సర్వధా విరుద్ధం. అసలు ఇవన్నీ పక్కనపెడితే సమాజంలో ప్రతీ వ్యక్తికీ గౌరవం పొందే అర్హత ఉంటుంది. అలానే మా ఇద్దరికీ కూడా ఉంది. కాబట్టి, ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన.
;వ్యక్తిగత దాడులు, సభ్యులను అవమానించడం
* "ప్రణయ్ రాజ్, ఏమిటీ చెప్పేది?", "యర్రా! ఏమిటీ చెప్పేదీ?", "అబ్బబ్బో రామారావు బాగా పనిచేస్తున్నాడా? ఇది ప్రపంచపు ఎన్నో వింతనో అది కూడా చెబితే బాగుండేది." ఇవన్నీ చంద్రకాంతరావు గారు చర్చల్లో పాల్గొన్న [[వాడుకరి:Pranayraj1985]], [[వాడుకరి:యర్రా రామారావు]] గార్లను న్యూనపరుస్తూ, కించపరుస్తూ, అవమానిస్తూ వాడిన భాష.
** ప్రణయ్ రాజ్ గారిని "అసలు నిర్వాహకుడిగా మీ తెవికి సేవలేంటీ? అస్తమానం మీ రికార్డులే ధ్యాసే తప్ప నిర్వహణ గురించి ఏమైనా పట్టించుకున్న దాఖలాలున్నాయా?" అని నిరాధారమైన నింద వేశారు. ప్రణయ్ రాజ్ గారు తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం నిర్వహణా చర్యలు ఎక్కువ తీసుకున్నవారిలో 5వ స్థానంలో నిలిచిన వ్యక్తి. తన నిర్వహణా సమీక్ష క్రమం తప్పకుండా చేసుకుంటున్నారు. ఇవన్నీ చంద్రకాంతరావు గారికి చూపించినా కూడా [[వికీపీడియా:రచ్చబండ#చంద్రకాంత_రావు_గారు_మర్యాదగా_మాట్లాడితే_బావుంటుంది!|ఆయన నిరాధారమైన నిందలు వేయడం కొనసాగించారే]] తప్ప మానలేదు. ఇలాగ అవాస్తవాలు మాట్లాడుతూ, ప్రణయ్ రాజ్ గారి మీద లేనిపోని నిందలు వేస్తున్నారు.
** "చదువరి కృషి గుండుసున్నా." అంటూ చదువరి గారిని చంద్రకాంతరావు గారు న్యూనపరిచారు, అవమానించారు. ఇది ఆధారం చూపడానికి కూడా అవకాశం లేని ఆరోపణ. ఆయన ఆధారం చూపే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది అసంబద్ధమైన, చాలా అన్యాయమైన వ్యాఖ్య అయినా కూడా నిరూపించాలి కనుక చదువరి గారి [[వాడుకరి:Chaduvari#నేను_చేసిన_కొన్ని_ఎన్నదగ్గ_పనులు|వాడుకరి పేజీలోని "నేను చేసిన కొన్ని ఎన్నదగ్గ పనులు" విభాగం]] చూడవచ్చు.
** "తెవికీ తరఫున లాభదాయక పదవులు పొంది లక్షల్లో జీతం పొందిన పవన్ కూడా నిర్లక్ష్యపూర్వక ధోరణిలో ఉండుట శోచనీయం." - అని చంద్రకాంతరావు గారు నామీద అత్యంత నిర్లక్ష్యపూరితమైన, తప్పుదోవపట్టించే వ్యాఖ్య చేశారు. ప్రభుత్వోద్యోగంలో ఎంతో అనుభవం ఉండి కూడా పదవికీ, ఉద్యోగానికి తేడా తెలియకుండా వ్యాఖ్య చేయడం ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించడానికే. నేనెప్పుడూ లాభదాయకమైన పదవి చేపట్టలేదు. (వికీలో కానీ బయట కానీ) చాలామందిలాగానే గౌరవప్రదమైన, నా నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు చేశాను. 2015-2019 మధ్యకాలంలో వికీమీడియా ఫౌండేషన్ నుంచి గ్రాంట్ స్వీకరించే ఒక సంస్థలో తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల మెరుగుదలకు ప్రణాళికలు రూపొందించి, అమలుచేసే బాధ్యతలతో కూడిన ఉద్యోగం ఎప్పుడూ రహస్యమూ కాదు, పైపెచ్చు ప్రపంచంలో ఏ ఉద్యోగంలోనూ లేనంత పబ్లిక్‌గా వివరాలు ఉన్నాయి. తెలుగు వికీపీడియాలోనే నా ఆ ఉద్యోగ బాధ్యతల్లో ఏమేమి చేశానన్న వివరాలు ఉన్నాయి. ఉద్యోగం చేసినవాడు జీతం తీసుకుంటాడు. చంద్రకాంతరావు గారు కూడా ప్రభుత్వంలో ఉద్యోగం ఒకటి చేస్తూ జీతం పుచ్చుకుంటారు. ప్రపంచంలో ఎంతమందిమో ఉద్యోగాలు చేస్తున్నాం జీవితాలు సాగిస్తున్నాం. అదే తప్పు అన్నట్టు, అంతమాత్రాన ఉద్యోగం మానేశాకా కూడా నన్ను నోటికి వచ్చిందల్లా మాట్లాడడానికి లైసెన్సు అన్నట్టు మాట్లాడడం అత్యంత అవమానకరం, పూర్తి అనైతికం.
** ఇక అత్యంత ముఖ్యమైన సంగతి. నా జీతం ఎప్పుడూ లక్షల్లో లేదు. (ఒకవేళ ఉన్నా చంద్రకాంత రావుగారు నోటికి వచ్చిందల్లా అనడానికి హక్కు ఇచ్చినట్టు కాదు.) ఆ జీతం ఎంతో ఇప్పటికీ మెటా-వికీలో పబ్లిక్‌గానే ఉంది. ఇలా నోటికి వచ్చిన అవాస్తవమల్లా చెప్పడం కేవలం నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే. నిజానికి నేను ఈ వివరాలన్నీ బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే - తమ తమ జీతాలు ఎంతో చంద్రకాంతరావు గారు చెప్తారా? ఏమైనా కనీస మర్యాద ఉందా ఆయన మాటలకు? కానీ, ఎందుకు చెప్పానంటే అబద్ధానికి నోరెక్కువ. ఆయన అబద్ధాలను ప్రచారంలో పెట్టే పనిలో ఉన్నారు. కాబట్టి, నేను నిజాలు చెప్పాల్సిందే.
;వికీపీడియాలో పనిచేయవద్దని నిరుత్సాహపరచడం
* చంద్రకాంతరావు గారు, ఆ అజ్ఞాత మొట్టమొదట ఎత్తుకున్న అంశమే యర్రా రామారావు గారు చేస్తున్న దిద్దుబాట్లను ఆపించాలన్న ప్రయత్నం. "సునాయాస లేదా చిన్న దిద్దుబాట్లు చేస్తూ ఇటీవలి మార్పులు మొత్తం ఇతరులకు చికాకుగా కలిగించడమే అసలుకారణం." అంటారు చంద్రకాంతరావు గారు. దీనికి సరళంగా [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు సమాధానం ఇచ్చారు ఇలాగ: "సునాయాసమైన చిన్న దిద్దుబాట్లైనా వ్యాసానికి మేలు చేసే దిద్దుబాట్లే కదా చేస్తున్నారు. ఒకవేళ ఇటీవల మార్పుల్లో ఆయన మార్పులు కనిపించకుండా ఉండాలంటే ఎవరైనా ఒక వడపోత సృష్టించుకోవచ్చు. అది పెద్ద పనే కాదు. ఒకవేళ యాంత్రిక పనులు చేయవలసి వచ్చినా అందుకు సమయం పడుతుంది, పైగా అది చేసే వాళ్ళకు ఆ పనిపైన ఆసక్తి ఉండాలి. అర్జున గారు చేయగలిగినా ఆయనకు ఆసక్తి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రామారావు గారు మాన్యువల్ గా చేస్తే తప్పేమిటి?". ఈ మాటకు చంద్రకాంతరావు గారి నుంచి ఇప్పటికీ సమాధానం లేదు. అంటే ఎలాగైనా ప్రస్తుతం యర్రా రామారావు గారిని పనిచేయనీకుండా ఆపడం మౌలిక లక్ష్యం. అందుకోసం ఆయన చేస్తున్న పనిలో లోపం లేకపోయినా ఉందన్న భ్రమ కల్పించే విఫల యత్నం చేశారు. ప్రపంచంలో ఏ క్రౌడ్ సోర్సింగ్ ప్లాట్ ఫారమూ, వికీపీడియాతో సహా, "మేలుచేసే కంట్రిబ్యూషన్లు" చేస్తున్నవారిని పని మానమని చేసే వ్యాఖ్యలను సహించదు. ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన.
* తెలుగు వికీపీడియాలో ఆయనకు వ్యక్తిగతంగా నచ్చని నిర్వాహకులందరినీ కూడా బాధ్యతల్లోంచి దింపేయాలన్నది ఆయన మరో అజెండా. "ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్వాహకులందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతే" - అని ఆ అజెండా ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పారు. కానీ ఎందుకు రాజీనామా చేయాలన్నది మాత్రం చెప్పలేకపోయారు. "గత కొన్ని సంవత్సరాలలో ఇద్దరు సభ్యుల చర్చను పరిశీలిస్తే వారు తెవికీ నిరోధకులుగా ఉన్నట్లుగా ప్రస్పుటంగా కనిపిస్తోంది.", "కేవలం పదవులపై మాత్రమే ధ్యాస ఉంచుకొని, సభ్యులపై నిష్కారణంగా నిరోధాలు విధిస్తూ, నిర్వాహకహోదాను దువినియోగపర్చే వారు తెవికీకి చెడ్డ పెరు తెచ్చేవారు నిర్వాహకులుగా ఉండతగరు.", "తెలుగు భాషాభిమానులు ఇద్దరిపై మండిపడుతున్నారు." ఇవీ ఆయన చేసే సారం లేని, ఆధారం లేని ఆరోపణలు. ఇప్పుడు పైన నేను చంద్రకాంతరావు గారు చేస్తున్న దాడుల గురించి ఒక్కొక్క వ్యాఖ్య ఎత్తిరాసి, లింకులు ఇచ్చి చెప్తున్నాను కదా. మరి చంద్రకాంత రావు గారు మాత్రం "ప్రస్ఫుటంగా కనిపిస్తోంది", "దువినియోగపర్చే వారు", ఎవరో భాషాభిమానులు ఎక్కడో మండిపడుతున్నారు - ఇలా ఏ ఆధారం ఇవ్వకుండా రాయడం ఏమిటి? ఇది కేవలం తెవికీ చర్చలపట్ల ఆయనకున్న కొంచెంభావం తప్ప మరేమీ కాదు. ఏదైనా రాయవచ్చు, ఎలాంటి ఆరోపణ అయినా చేయవచ్చు చెల్లుతుంది అని విశ్వసిస్తున్నారని ఈ వారంరోజుల ఆరోపణల్లో దేనికీ ఆధారాలు ఇవ్వకపోవడంతో తెలుస్తోంది.
;నిర్ణయాలను, విజ్ఞప్తులను, హెచ్చరికలను, విధానాలను తృణీకరించడం
* చంద్రకాంతరావు గారు, అజ్ఞాత కలసి చేస్తున్న ఈ దాడులు, ఉల్లంఘనలు సహ సభ్యులు గమనించి ఈ వేధింపులు, వ్యక్తిగత దాడులు ఆపమని విజ్ఞప్తులు చేశారు, హెచ్చరించారు, తుదకు దీనిపై నిర్ణయం కూడా చేశారు. ఆయా సభ్యులు చేసిన ఈ అన్ని ప్రయత్నాలకూ పూచికపుల్ల విలువ కూడా ఇవ్వలేదాయన. ఉదాహరణకు:
** [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్ గారు]] ఈ దాడుల తీవ్రతను గమనించి "చంద్రకాంతరావు గారు. మీరు ఈవిధంగా ప్రతిసారి పురోగతిలో పాల్గొంటున్న వారందరి మీద; ప్రస్తుతం చదువరి మరియు యర్రా రామారావు గారి మీద నిందలు వేస్తున్నారు." అని ప్రారంభించి, "ముఖ్యంగా చదువరి గారి మీద నిషేధం విధించాల్సిన పొరపాటు ఏమీ ఇక్కడ జరగలేదని నా అభిప్రాయం." అని విశ్లేషించి, "ఇక చంద్రకాంతక్రావుగారి (నిర్వాహక హోదా నుండి ఆయనే తప్పుకొన్న తర్వాత మరియు ముందు) వలన పెద్దగా తెవికీలో సమాచారం పెద్దగా ఏమీ చేరలేదు." అని పేర్కొని, "వికీపీడియా విస్తృత పరిధిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోవడం మంచిదనీ, దీన్ని నిర్ణయంగా భావించి మన్నించాలని" [[వికీపీడియా:రచ్చబండ#మూలకారణం|తేల్చారు.]] ఆ తర్వాత చంద్రకాంతరావుగారు ఆయన రాసినదానికి ఏ రకంగానూ ప్రత్యుత్తరం ఇవ్వకుండా, ఆయన నిర్ణయాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ దాడులు చేయడం కొనసాగిస్తూనే పోతున్నారు. (ఇప్పటికీ ఆగలేదు)
** "చంద్రకాంతరావు గారు దయచేసి ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి." అని [[వాడుకరి:రవిచంద్ర]] గారు, "అజ్ఞాత చేసిన ప్రతిపాదకు పాత సభ్యులు మద్దతు పలకడం సరైన చర్య కాదు. అజ్ఞాత చేసిన ఆరోపణలలో ఒకటైనా ఆధారాలతో చూపించాడా?" అంటూ [[వాడుకరి:K.Venkataramana]] గారు ఈ కువిమర్శలు, నిరాధార నిందలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీళ్ళకు కూడా సమాధానం ఇవ్వలేదు. వీళ్ళ విజ్ఞప్తిని గౌరవించనూ లేదు.
** నేను "నిరాధారమైన నిందలు, వ్యక్తిగత దాడులు మానుకోండి. వేధింపు ధోరణి వదులుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటికే రాజశేఖర్‌ గారు వెలువరించిన నిర్ణయాన్ని కనీసం గౌరవించండి. మీరు ఆ నిర్ణయాన్ని గౌరవించినంత మాత్రాన మీకున్న విలువ తగ్గిపోదు, నిజం చెప్పాలంటే కాస్తో కూస్తో పెరుగుతుంది." అంటూ చాలా మర్యాదగా, విజ్ఞాపనపూర్వకంగా సలహా ఇచ్చాను. "ఇలా నిందించడం తప్పని ఇంతమంది చెబుతున్నప్పటికీ మీరు ఆపలేదు. వీటిపై వికీనియమాల ప్రకారం తగు చర్య తీసుకునే అవకాశం ఉంది, గమనించగలరు. దయచేసి ఇకనైనా ఆపండి." అని చదువరి గారు హెచ్చరిక జారీచేశారు. చంద్రకాంతరావు గారు తిరిగి దుమ్మెత్తిపోశారే తప్పించి సలహాలను పాటించిందీ లేదు, హెచ్చరికను మన్నించిందీ లేదు.
;తెవికీని కూడా ఆధారాలు చూపకుండా తృణీకరించడం
* "ఇప్పుడు తెవికీ చచ్చిపోయింది.", "భాషాభిమానులు తెవికీ చచ్చిపోయిందనీ తీర్మానించారు కూడా.", "ఇప్పుడు పనిచేస్తున్న వారి కృషి ఎలాగూ పనికిరాదు.", "తెవికీని పాతాళంలోకి దిగజార్చిన అపకీర్తిని సొంతం చేసుకోవడం" - ఇవీ ఆయన వాడిన పదజాలం. దీనికి ఆయన ఇచ్చిన ఆధారాలు శూన్యం. తెవికీలో పనిచేస్తున్నవారి కృషి పనికిరాదని ఏ ఆధారం లేకుండా అనడం మొత్తం తెవికీనే తృణీకరించడమే!
ఇన్ని రకాల ఉల్లంఘనలు చేసిన చంద్రకాంత రావు గారిమీద ఇప్పటికైనా ఆయన ఉల్లంఘనలు అన్నిటికీ తగ్గ, గట్టి చర్యలు తీసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 19:36, 21 జూన్ 2021 (UTC)