పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 6:
| imagesize =300px
| caption = అమరజీవి పొట్టి శ్రీరాములు
| birth_date ={{birth date|1901|03|16}}<ref name=hindu1>[{{Cite web |url=http://www.hindu.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm |title=హిందూ పత్రికలో వ్యాసం] |access-date=2008-07-25 |website= |archive-date=2003-06-28 |archive-url=https://web.archive.org/web/20030628004428/http://www.hindu.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm |url-status=dead }}</ref>
| birth_place ={{flagicon|India}} అణ్ణాపిళ్ళె, జార్జిటౌను, మద్రాసు.
| native_place =[[పడమటిపాలెం]]
పంక్తి 69:
[[గుజరాత్]] రాష్ట్రంలోని [[రాజ్‌కోట్ లోకసభ నియోజకవర్గం|రాజ్‌కోట్‌]]లోను, ఆంధ్రలో [[కృష్ణా జిల్లా]]లోని [[కొమరవోలు]]లోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. [[కొమరవోలు]]లో [[యెర్నేని సుబ్రహ్మణ్యం]] నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. [[1943]]-[[1944|44]]ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. [[1946]]లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
 
గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని [[ఆమరణ నిరాహారదీక్ష]] ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్ర్యోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. అప్పుడు మహాత్మా గాంధీ [[టంగుటూరి ప్రకాశం]]కు ఇలా వ్రాశాడు - "హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)". - 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది.<ref>[http://www.hindu.com/thehindu/mp/2002/11/11/stories/2002111101540200.htm హిందూ పత్రికలో ఈ వ్యాసం] {{Webarchive|url=https://web.archive.org/web/20030701130051/http://www.hindu.com/thehindu/mp/2002/11/11/stories/2002111101540200.htm |date=2003-07-01 }} --11/11/2002 - The martyr of Telugu statehood</ref>
 
జీవితం చివరిదశలో [[నెల్లూరు]]లో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు