సందడే సందడి: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP బొమ్మ చేర్చితిని.
ట్యాగు: 2017 source edit
కథ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 24:
|imdb_id =
}}
'''సందడే సందడి''' 2002 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ చిత్రాన్ని ఆదిత్యరాం మూవీస్ పతాకంపై ఆదిత్య రాం నిర్మించాడు. ఇందులో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీ, రాశి, ఊర్వశి, సంఘవి, కోవై సరళ ముఖ్య పాత్రల్లో నటించారు.
 
== కథ ==
బాలు, చందు, కామేష్ అనే ముగ్గురు మిత్రులు తమ కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వ్యాపారాలు సరిగా నడవక ఆత్మహత్య చేసుకోబోతున్న లక్ష్మీనారాయణ అనే వ్యాపారవేత్తను ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతారు. అతని వ్యాపారాన్ని తమ ఆలోచనలతో గాడిలో పెట్టి అతని దగ్గర ఉద్యోగస్తులుగా స్థిరపడతారు. ఈ ముగ్గురికీ వివిధ కారణాలతో సంసార సుఖం ఉండదు. చందు భార్య దైవభక్తురాలు. పూజలు, పునస్కారాల పేరుతో భర్తను దగ్గరికి రానివ్వదు. బాలు భార్య ఒక న్యాయవాది. ఆమెకు పనే లోకం. దాంతో ఆమె భర్తను చెంత చేరనివ్వదు. కామేష్ భార్య ఒక టి.వి నటి, ఆమె తన అందాన్ని కాపాడుకోవడం కోసం భర్తకు దూరంగా ఉంటుంది.
 
ఈ లోపు లక్ష్మీనారాయణ ముగ్గురు కూతుర్లు విదేశాల్లో చదువుకుని అక్కడకు వస్తారు. వాళ్ళు తండ్రి చెప్పినట్లు ఆయన స్నేహితుడి కొడుకులను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోరు. అప్పుడు వారికి ఒక ఆలోచన వస్తుంది. ఎవరైనా ముగ్గురు అందమైన యువకులను వాళ్ళను ప్రేమించినట్లు నటింపచేసి తర్వాత మోసం చేస్తే అప్పుడు తమ మాట విని తాము చూసిన సంబంధాలే పెళ్ళి చేసుకుంటారని అనుకుంటాడు. అందుకోసం తనదగ్గర నమ్మకస్తులుగా పనిచేసే చందు, బాలు, కామేష్ ల మీదనే ఆధారపడతాడు లక్ష్మీనారాయణ. ఈ ముగ్గురు కూడా తమకు ఆయన సకల సౌకర్యాలు కల్పిస్తుండటంతో సరేనని ఒప్పుకుంటారు. తీరా వాళ్ళని మోసం చేసే సమయం వచ్చేసరికి వారికి వాళ్ళని నిజంగానే పెళ్ళి చేసుకోవాలనే కోరిక పుడుతుంది. చివరికి వారు తమ భార్యలను వదిలేసి వాళ్ళను పెళ్ళిచేసుకున్నారా లేదా అనేది మిగతా కథ.
 
==నటీనటులు==
{{colbegin}}
Line 33 ⟶ 39:
* [[ఊర్వశి]] ... లక్ష్మి
* [[సంఘవి]] ... ప్రియ
* [[శివాజీ]] ... లోకేష్కామేష్
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[స్వప్న మాధురి]]
"https://te.wikipedia.org/wiki/సందడే_సందడి" నుండి వెలికితీశారు