వాడుకరి:Ch Maheswara Raju/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
Replaced content with '*వాడుకరి:Ch Maheswara Raju/ప్రయోగశాల-1 *వాడుకరి:Ch Maheswara Raju/ప్రయోగశాల-2 *మిగిలిన వ్యాసాల కొరకు *వాడుకరి:Ch Maheswara Raju/ప్రయోగశాల లింకులు PDF ఫైలు క...'
ట్యాగులు: మార్చేసారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 18:
==మరణం==
==మూలాలు==
 
==ఎడిట్==
నేను 1909లో జన్మించాను చిన్నప్పుడు కాకినాడలో చదువుకొంటూండగా సహాయ నిరాకరణోద్యమంవల్ల ప్రభావితుణ్ణయ్యాను టౌన్ హాలులో పట్టణ, జిల్లా కాంగ్రెస్ నాయకు లిచ్చే ఉపన్యాసాల్ని విడవకుండా వినేవాణ్ణి పాటలు, పద్యాలు, ఉపన్యాసాలే కాక, విదేశీ వస్త్ర దహనం కూడా ఒక కార్యక్రమంగా వుండేది. సాంబమూర్తి, ప్రకాశం, గోపాలకృష్ణయ్య లాంటి మేధావులు న్యాయవాద వృత్తిని విడిచి పెట్టి, ఇద్దరు ధరించి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిప్పులు చెరుగుతూ ఉపన్యసిస్తూంటే, ఒళ్ళు మరచిపోయేవాణ్ణి 1921-22లో చట్టరిక్కరణ చేసినందుకు అరెస్టు చేయబడి శిక్షలు విధింపబడ్డ నాయకుల్ని చూడ్డానికి వెళ్ళేవాణ్ణి కొన్నాళ్ళ తర్వాత నేను కూడా ఇద్దరు ధరించడం ప్రారంభించాను ఇంట్లో రాట్నం మీద ప్రతి సాయంత్రం నూలు వడికేవాణ్ణి. కొన్ని నెలల తరువాత ఆ నూలుతో పంచలు వేయించి కట్టుకున్నాను. 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభ దృశ్యాలు నన్ను ఉత్సాహపరిచాయి. పి ఆర్ కాలేజీలో చదువుతూండగా, 1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని, టౌన్పోల్లో జరిగిన బహిరంగ సభకు
 
స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు
 
హాజరయ్యాను అక్కడ సాంబమూర్తిగారి అధ్యక్షత క్రింద జరిగిన బహిరంగసభలో స్వామి కుమారానంద్ అహింసా విధానాన్ని దుయ్యబడుతూ ఉపన్యసిస్తూంటే, ఒళ్ళు గగుర్పొడించింది. మరునాడు ఆయన్ని కలుసుకోడానికి సాంబమూర్తిగా రింటికి వెళ్ళాను కుమారానంద్ నాతో చాలా చనువుగా మాట్లాడారు చదవడానికొక పుస్తకం యిచ్చారు. అది రెనీపుల్లస్ మిల్లర్ అను జర్మన్ రచయిత రచించిన "ది. మైండ్ అండ్ ఫేస్ ఆఫ్ బోల్షివిజం" సోవియట్ రష్యాలో ఏర్పడ్డ సోషలిస్టు వ్యవస్థను వర్ణించే గ్రంధం అది రెండు రోజులు కాలేజీకి సెలవు పెట్టి దాన్ని అమూలాగ్రం చదివాను చదివి ఉత్తేజితుణ్ణయ్యాను ఆ పుస్తకంలో ఉన్న లెనిన్ చిత్రాన్ని ఒక ఆర్టిస్టు మిత్రుని చేత తిరిగి గీయించుకొని, పుస్తకాన్ని తిరిగి యిచ్చేశాను అప్పటి కాయన కమ్యూనిస్టు అయి వుండవచ్చు. రాజస్తాన్లో చాలాకాలం కమ్యూనిస్టు కార్యకర్తగా ఉండి తరువాత రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు.
 
నేను బిఏ చదువుతూండగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకాలో ఒకరిదగ్గర సావర్కార్ రచించిన "ది ఇడియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్" ఉన్నదని తెలుసుకొని, మరునాడు ఆయనను కలుసుకోడానికి వెళ్ళాను అది నిషిద్ధ గ్రంధం దగ్గరున్నట్టు పోలీసులకు తెలిస్తే జైలు శిక్ష తప్పదు. అయినా, ఆయన దగ్గరకు వెళ్ళాను. అడిగీ అడగ్గానే ఆయన ఆ పుస్తకం యిచ్చారు. దాన్ని నాలుగు రోజుల్లో పూర్తి చేసి తిరిగి యిచ్చేశాను గ్రంధం 1857 పోరాటాన్ని ఒళ్లు జలదరించేటట్లు వర్ణించేది. ఆ గ్రంధం చదువుతూన్నంతసేపూ నా రక్తనాళాల్లో రక్తం కుతకుత లాడింది.
 
1929లో నేను బిఏ ప్యాసై, ఉన్నత విద్యకై మద్రాసు వెళ్ళాను లయోలా కాలేజీలో ఎంఏ చదువుతూండగా, దేశం స్వాతంత్య్ర సమరానికి సన్నద్ధ మవుతోంది. నేనూ, సుందరయ్య (ఆయన అప్పుడు ఇంటరు చదువుతూండేవారు మరికొందరు విద్యార్థులతో సోదర సమితిగా ఏర్పడి, కాలేజీ హాస్టల్లో ప్రతి ఆదివారం ఖద్దరు విక్రయించేవాళ్ళం యువకుల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలను వ్యాప్తి చేసే పత్రిక "యంగ్ లిబరేటర్"కి చందాలు చేర్పించాం అది మాస పత్రిక తొంబాయి నుంచి వెలువడేది. దాని సంపాదకుడు హెచ్ డి రాజా ఆయన నాలుగురోజులు హాస్టల్లో మా అతిధిగా ఉన్నారు. 1929 డిసెంబర్లో లాహోరు కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించిన సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానాన్ని పురస్కరించుకొని, 1930 జనవరి 26న మేం విద్యార్థులందరిచేత క్లాసులు బహిష్కరింపచేశాం సాయంత్రం ట్రిప్లికేన్ బీచ్ కి ఊరేగింపు నడిపాం. అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజలందరితో కలిసి స్వాతంత్య్ర్య ప్రతిజ్ఞ తీసుకున్నాం. మొదటి సంవత్సరం పరీక్షలైపోగానే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళి, సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నాం కొన్ని వారాల తర్వాత సుందరయ్య 1930 జూన్లో చట్టధిక్కరణ చేసినందుకు అరెస్టు చేయబడి జైలుకు వంపబడ్డాను. నేను తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళి, డాక్టరు చెలికాని రామారావుగారితో కలిసి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆఫీసు (కాకినాడ) లో పనిచేశాను. ఆ కమిటీ ఇతర జిల్లా కాంగ్రెస్ కమిటీల్లాగ నిషిద్ధసంస్ధకాదు అయినా, మాలో కొందరం (నాతో సహా) పగలు బహిరంగంగాను, రాత్రి రహస్యంగాను పనిచేసేవాళ్ళం, “రణదుందుభి” అనే పేరుతో మేమొక రహస్య సైక్లోస్టయిల్ పత్రిక నడిపేవాళ్ళం. దానికి సంపాదకుణ్ణి
 
సంపాదకుడు పరకాల పట్టాభిరామారావు
 
7
 
ప్రొడ్యూసర్నీ నేనే ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో "వీర భారతి" అనే మరో పత్రిక ప్రారంభించాం
 
శాసనోల్లంఘనోద్యమంలో అనేక మంది జైలు శిక్షలకు, లారీ దెబ్బలకు, తుపాకులకు గురి అయ్యారు నేను 1931 జనవరి 26న భీమవరం వెళ్ళి, తనికెళ్ళ చలపతితో కలిసి 144వ సెక్షన్ ధిక్కరించి జైలు శిక్షకు గురి అయ్యాను దాదాపు ఒకటిన్నర నెలలు రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించి, గాంధీ ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా, మార్చి నెలలో విడుదల చేయబడ్డాం కాని, మాకు సంతోషం లేదు ఉద్యమం ఉచ్ఛస్థాయి నందుకొంటున్న తరుణంలో, గాంధీజీ తాను కోరిన 11 కోరికల్లో ఏది సిద్ధించకపోయినా, ఉద్యమాన్ని ఆయన విరమించినందుకు హతాశులముయాం ప్రజల త్యాగాలన్నీ నిరర్ధకమైనట్లు మాకు తోచింది.
 
విడుదలైన వెంటనే భీమవరం వచ్చి, జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షుని ఆదేశం మేరకు కరాచీ కాంగ్రెసుకు నేనూ, చలపతీ ప్రతినిధులుగా వెళ్ళాం. బొంబాయిలో ఓడ ఎక్కేముందు భగత్సింగ్, సుఖదేవ్, రాజగురులు ఉరి తీయబడ్డారనే వార్త పత్రికలో చదివి శోకతప్త హృదయులమయాం. గాంధీజీ భగత్సింగ్ ప్రాణాలను కాపాడగలిగివుండీ, అందుకు కృషి జరపకపోవటం నా వంటి యువకుల్ని కలవర పెట్టింది. అహింసా మార్గం మీద నాకు విశ్వాసం పోయింది. మహాసభలో, భగత్సింగ్ ప్రభృతుల దేశభక్తినీ, ఆత్మబలిదానాన్ని కొనియాడుతూనే, వారు చేబట్టిన హింసాత్మక పద్ధతుల్ని ఖండిస్తూ గాంధీజీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించిన వందలాది ప్రతినిధుల్లో నేనొక్కణ్ణి.
 
కరాచీ నుంచి తిరిగి వస్తూ సావర్కార్ రచించిన "ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ రహస్యంగా కొని తెచ్చుకున్నాను.
 
నే నప్పటికే కమ్యూనిస్టు సాహిత్యం చదివినవాణ్ణి "ది ఇలస్ట్రేటెడ్ హిస్టరీ ఆఫ్ రష్యన్ రివల్యూషన్" మొదలైన పుస్తకాలు చదివియున్నాను మీరట్ కుట్రకేసు నిందితుల స్టేట్ మెంట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద వారు విసిరే సవాళ్ళు నన్ను ఆకట్టుకున్నాయి. కాని కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వారెవరూ నాకు తారసిల్లలేదు అందుచేత కొన్నాళ్ళు చుక్కానిలేని పడవలా తిరిగాను గుంటూరులో ఒక వ్యక్తిగత విప్లవవాద గ్రూపులో చేరి పని చేయసాగాను 1932 ఏప్రిల్ నేను కాకినాడలో ఉండగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒకరోజు రాత్రి నాకు కబురు చేశారు. నేను వ్యక్తిగత విప్లవవాద ఉద్యమంలో ఉన్నానని ఆయనకు తెలుసు. తెలిసే కబురు చేశారు నేను వెళ్ళాను ఏప్రిల్ 24న ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్ మహాసభకు వెళ్ళవలసిందని న న్నాయన ప్రోత్సహించారు. అది నిషిద్ధసభ. విప్లవకారులతో సంబంధం పెట్టుకోవచ్చుననే ఉద్దేశంతో, నేను వెళతానన్నాను. రాకపోకలకు రెండువందల రూపాయ లిచ్చారు ఢిల్లీ నాకు కొత్త, అయినా నాకున్న ఇంగిత జ్ఞానానికి బుద్ధిబలం జోడించి, ఢిల్లీ జైల్లోని విప్లవకారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, ఆంధ్రదేశంలో హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీశాఖ (ఇది భగత్సింగ్ సంస్థ స్థాపించడానికి అనుమతి పత్రం సంపాదించాను తిరిగి వచ్చేటప్పుడు
 
8
 
అకోలాలో దిగి, అక్కడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని యింటికి వెళ్ళి, ఒక రివాల్వరూ, ఒక తూటా సంపాదించుకొన్నాను.
 
కాని ఆ ఆయుధాన్ని ఎవ్వరమూ ఉపయోగించకముందే మేము గుంటూరు "డెన్"లో వుండగా, మద్రాసు నుంచి నా కాలేజీ మిత్రుడొక ఉత్తరం వ్రాశారు, నన్ను వెంటనే బయల్దేరి రావలసిందని. నేను 1931 మధ్యలో మద్రాసు వెళ్ళాను. అక్కడ అమీర్ హైదర్ ఖాన్ అనే కమ్యూనిస్టు కార్యకర్తతో నాకు పరిచయమైంది ఆయన మీరట్ కుట్రకేసులో ముద్దాయిగా ఉండవలసినవాడు కాని, అరెస్టు నుంచి తప్పించుకొని, రహస్యంగా మాస్కోకు వెళ్లి, అక్కడ కొంత కాలం ఉండి, తిరిగి 1932లో ఇండియాకు వచ్చారు. చేయడానికి ఆనాడు కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా పని అవకాశం లేదు. అందుచేత హైదరాఖాన్ యంగ్ వర్కర్క్స్ లీగ్ అనే చట్టబద్ధ సంస్థ నేర్పరచారు దాని ఆధ్వర్యం క్రింద కార్మికుల్ని విప్లవ మార్గంలో సంఘటిత మొనర్చి, తాను సుశిక్షితులనుకొన్న కొందరిని మాస్కోకు పంపడం ఆయన ఉద్దేశం.
 
వారు మాస్కోలోని ప్రాచ్యప్రజల విశ్వవిద్యాలయంలో తర్ఫీదు పొందవలసి
 
వుంటుంది.
 
హైదర్ ఖాన్ ఇప్పటి పాకిస్తాన్ లో భాగమైన పశ్చిమ పంజాబు నివాసి పెద్ద చదువులు చదువుకోలేదు బొంబాయిలో ఓడ క్లీనర్ గా ఉంటూ అమెరికా వెళ్ళి అక్కడ అనేక కర్మాగారాల్లో పని చేశారు. నిపుణుడైన ఇంజనీరుగా, విమాన చోదకుడుగా కొన్ని సంవత్సరాలు అమెరికాలో గడిపారు. అక్కడ నుంచి సోవియట్ యూనియన్ వెళ్ళి, ప్రాచ్యప్రజల విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందారు.
 
మద్రాసులో స్థాపింపబడ్డ యంగ్ వర్కర్స్ లీగ్ నేనొక హోల్ టైమరును. అందులో దాదాపు 25 గురు సభ్యులుండేవారు జౌళి, బ్రాంవే, రైల్వే, ప్రింటింగ్ తదితర పరిశ్రమల్లో వారు పనిచేస్తూ ఉండేవారు. నేను ట్రాంవే కార్మికుల మధ్య పని చేసేవాణ్ణి ప్రచారం, ఆందోళన, ప్రబోధం ద్వారా కార్మికుల్లో వర్గ చైతన్యం కలిగించి, ఉమ్మడి కార్యాచరణకు వారిని సన్నద్ధం చేయడం, కాంగ్రెస్ నాయకత్వపు మితవాద ధోరణుల్ని తూర్పారబట్టడం, ట్రేడ్ యూనియన్లలో అవకాశవాద నాయకుల్ని బహిర్గత మొనర్చడం మా ప్రధాన కర్తవ్యాలు, శాసనోల్లంఘనోద్యమాన్ని రెండుసార్లు ఉపసంహరించి, ప్రజా విప్లవాన్ని నిరోధించిన గాంధీ నాయకత్వాన్ని కూడా వ్యతిరేకించడం మా కర్తవ్యం. నేనూ, నా భార్య మాణిక్యాలు ఒక బ్రాంచే కండక్టరు యింట్లో నివసించేవాళ్ళం.
 
తమిళంలో "మున్నేట్రం" (ప్రగతి) అను పక్ష పత్రిక యంగ్ వర్కర్స్ లీగ్ ప్రచార సాధనంగా ఉండేది 4 పేజీలతో 500 ప్రతులు ముద్రింపబడేవి కార్మికులను గురించిన వ్యాసాలు, వార్తలతో పాటు కొమింటర్న్ పత్రిక. "ఇంప్రికార్”లోని వ్యాసాలు అనువదింపబడి ప్రచురింపబడేవి హైదర్ ఖాన్ డిక్టేట్ చేసే ప్రత్యేక వ్యాసాల్ని లీగ్ కార్యదర్శి వి.కె నరసింహన్ (లయోలా కాలేజీలో ఆనర్స్ విద్యార్ధి) తమిళంలోకి అనువదించేవాడు మొత్తంమీద ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ పాలసీని అమలు జరపడంలో "మున్నేట్రం" ఎనలేని సేవ చేసింది. హైదరాఖాన్కి
 
సంపాదకుడు పరకాల పట్టాభిరామారావు
 
తమిళంగాని, తెలుగుగాని తెలియకపోయినా, తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఇంగ్లీషులోను, తమిళంలోను మాట్లాడ్డానికి కృషి చేసేవారు. సోవియట్ యూనియన్తో హైదర్భానికి సజీవ సంబంధాలుండేవి యంగ్
 
వర్కర్స్ లీగ్ సభ్యుల్లో ఒకడైన జయరాంని రాజకీయ శిక్షణ కొరకు మాస్కో
 
పంపించారు.
 
హైదర్ ఖాన్ 1932 చివరిభాగంలో అరెస్టు చేయబడ్డారు రాజద్రోహ నేరం క్రింద రెండేళ్ళ కఠిన శిక్ష విధింపబడింది విడుదలయాక తిరిగి అరెస్టు చేయబడి, స్టేట్ ప్రిజనర్ నిర్బంధింపబడ్డారు తరువాత, 1938లో విడుదల అయ్యారు.
 
నేను మద్రాసులో కొన్ని నెలలున్న తరువాత, ఆర్ధిక యిబ్బందుల వల్ల ఆంధ్రదేశానికి తిరిగి రావలసివచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉండగా పోలీసులు నన్నొక రోజున అరెస్టు చేశారు. అదివరకు నేనా జిల్లాలో నడిపిన "వీర భారతి" ప్రతుల్ని పంచిపెడుతున్నట్లు నామీద నేరం ఆరోపించారు. కేసు విచారణ 1933 జనవరి నుంచి ఏప్రిల్ వరకు సాగింది కోర్టు 6 నెలల కఠిన శిక్ష విధించింది. ఆరు నెలలూ బళ్లారి సెంట్రల్ జైలులో గడిపాను.
 
జైలు నుంచి విడుదల అయ్యాక, నేను మద్రాసులో కొన్ని వారాలు ప్రకాశం పంతులు "స్వరాజ్య" (ఇంగ్లీసు పత్రికలో రిపోర్టరుగా పనిచేశాను. ఆ తరువాత, మద్రాసులోనే, యిదివరకటి "యంగ్ లిబరేటర్" పత్రిక సంపాదకుడైన హెచ్.డి. రాజా స్థాపించిన “న్యూ ఏజ్"లో సహాయ సంపాదకునిగా 1933 నవంబరు నుంచి 1934 నవంబరు వరకు పనిచేశాను. ఈ పత్రిక యువకుల్లోను, మేధావుల్లోను శాస్త్రీయ సోషలిస్టు (కమ్యూనిస్టు) భావాలను ప్రచారం చేయడాని కుద్దేశింపబడింది. చట్టానికి లోబడి సామ్రాజ్యవాద దోపిడీని బహిర్గతం చేస్తూ, కాంగ్రెస్ నాయకత్వపు మితవాద పాలసీలను విమర్శించేది ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలోని ముఖ్య ఘట్టాలను ప్రచురించేది. దానిని ఆర్థిక కారణాలవల్ల మూసివేయవలసి వచ్చింది.
 
నేను 1930లో లయోలా కాలేజీలో వదిలిపెట్టిన ఎం.ఏ. చదువు పూర్తి చేయదలచుకొన్నాను. నాలుగు నెలలు కష్టపడి, చదివి, 1935 ఏప్రిల్లో ప్రైవేటుగా పరీక్షకు కూర్చొని ప్యాసయ్యాను. తరువాత, సుందరయ్యా మరికొందరూ స్థాపించిన కూలీ రక్షణ సమితిలో సభ్యునిగా చేరి పని చేయసాగాను.
 
***
 
10
 
స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు