వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 341:
తెలుగు వికీపీడియా జన్మదినోత్సవం - 2021 వేడుకలను అందరం కలసి, ప్రభుత్వ అనుమతి తో రవీంద్రభారతి పైడిరాజు ప్రివ్యూ థియేటర్‌ ఉన్న ప్రొజెక్టర్ నహాయంతో ఆఫ్‌లైన్‌లో,ఆన్ లైన్ లో ఒకేసారి జరపవచ్చు,ఈ కరోనా కాలంలో అందరూ పాల్గోనాలంటే ఇలాంటి విధానం ఉండాల్సినదే ! : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 08:50, 22 నవంబరు 2021 (UTC)
::నమస్కారం [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారు, మీరు ప్రస్తావించిన అంశాలు బాగున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో వీలుకుదిరిన వికీపీడియన్లతో ఆఫ్‌లైన్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకు వేడుకలు నిర్వహించుకుంటూ, వీలుకుదరని వారితోపాటు వివిధ ప్రాంతాలలో ఆఫ్‌లైన్‌ వేడుకలు నిర్వహించుకుంటున్నవారితో (అందరూ హజరయ్యేలా) రెండు గంటలపాటు ఆన్‌లైన్‌ నిర్వహించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కార్యక్రమ ఎజెండా, ఖర్చులు, కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించడానికి [[వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2021|తెవికీ జన్మదిన వేడుక 2021]] పేజీని సృష్టించాను. ఆ చర్చలో సభ్యులు పాల్గొని తెవికీ జన్మదిన వేడుకలు జరపడానికి సహకరించాలని ఆహ్వానిస్తున్నాను.--<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User:Pranayraj1985|<small><font colour="white" face="segoe script" size="3">ప్రణయ్‌రాజ్ వంగరి</font></small>]]'''</span>([[User_Talk:Pranayraj1985|చర్చ]]) 18:50, 5 డిసెంబరు 2021 (UTC)
:::కరోనా వల్ల గత రెండేళ్ళుగా తెవికీ ఆధ్వర్యంలో ఆఫ్‌లైన్‌ కార్యక్రమాలు (సమావేశాలు, శిక్షణా శిబిరాలు) జరగలేదు. అయితే, ఈ రెండేళ్ళకాలంలో కొంతమంది కొత్త వాడుకరులు తెవికీకి రావడమేకాకుండా తెవికీ అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. కాబట్టి ఈసారి తెవికీ జన్మదిన వేడుకలను సముదాయ సభ్యులతో కొత్త వాడుకరుల పరిచయ వేదికగా, తెవికీ శిక్షణ కార్యక్రమంగా నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అందుకోసం వచ్చే ఆదివారం (డిసెంబరు 19న) రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్ లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడానికి వేదిక కోసం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని అనుమతికోరగా, వారు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అనుమతిని ఇచ్చారు. కాబట్టి డిసెంబరు 19 ఆదివారం రోజున ఉదయం గం. 10 నుండి సాయంత్రం గం. 5 వరకు తెవికీ జన్మదిన వేడుకలు (సముదాయ సభ్యులతో కొత్త వాడుకరుల పరిచయ వేదికగా, తెవికీ శిక్షణ కార్యక్రమం) జరుపబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పాల్గొనవీలుకాని వారికోసం ఆన్లైన్ వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. సముదాయ సభ్యులు విచ్చేసి వేడుకలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వికీ రచనలోని వివిధ అంశాలలో శిక్షణ కావలసినవారు [[వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2021|తెవికీ జన్మదిన వేడుక 2021]] కార్యక్రమ చర్చాపేజీలోనూ, నిర్వహణ సమన్వయ జట్టులో (పనులు, బాధ్యతలు) ఆసక్తివున్నవారు సంబంధింత విభాగంలో తమ పేర్లను రాయగలరు. ధన్యవాదాలు.--<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User:Pranayraj1985|<small><font colour="white" face="segoe script" size="3">ప్రణయ్‌రాజ్ వంగరి</font></small>]]'''</span>([[User_Talk:Pranayraj1985|చర్చ]]) 05:35, 16 డిసెంబరు 2021 (UTC)
 
== ఈ వారం వ్యాసాల కొరత==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు