సూర్యరశ్మి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరించాను
పంక్తి 8:
భూమ్మీద జీవించే ప్రతీ జీవరాశీ ఏదో ఒక విధంగా సూర్యరశ్మిపై ఆధారపడి ఉంది. మొక్కలు సూర్యరశ్మి ని ఉపయోగించుకుని [[కిరణజన్య సంయోగక్రియ]] అనే ప్రక్రియ ద్వారా తమ పెరుగుదలకు కావాల్సిన పిండిపదార్థాలను తయారు చేసుకుంటాయి. జంతువులు మొక్కలు, పండ్లు, కూరగాయలు మొదలైన ఉత్పత్తులు సేవించడం ద్వారా పరోక్షంగా సూర్యరశ్మిని ఉపయోగించుకుంటున్నాయి.
==ఆరోగ్యంపై ప్రభావం==
మానవ శరీరం సూర్యరశ్మి నుంచి [[డి- విటమిన్]] ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ సేపు ఎండ తగలకుండా ఉండటం వల్ల, తీసుకునే ఆహారంలో ఇది తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల, శరీరంలో ఈ విటమిన్ కొరత ఏర్పడవచ్చు. ఎక్కువ సమయం సూర్యరశ్మికి గురికావడం మూలాన దానిలో ఉన్న అల్ట్రావయొలెట్అతినీలలోహిత కిరణాల వల్ల [[చర్మ క్యాన్సర్]] వచ్చే అవకాశం కూడా ఉంది.
 
==ఇతరత్రా==
చాలామందికి ప్రత్యక్షంగా ఎండలో ఉండటమంటే ఇబ్బంది కలిగించేదే. సూర్యునివైపు సూటిగా చూడటం వలన దృష్టి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండటం కోసం చాలామంది నల్ల కళ్ళద్దాలను వాడటం సహజం. ప్రత్యక్షంగా తలమీద ఎండ పడకుండా టోపీలు, [[శిరస్త్రాణము]]లు (హెల్మెట్). మొదలైనవి వాడుతుంటారు. చల్లని ప్రదేశాల్లో ప్రజలు ఎండవేడిమిని బాగా ఎంజాయ్ చేస్తారు. నీడవైపు ఎక్కువగా వెళ్ళరు. అదే ఉష్ణమండల దేశాల్లో దీనికి పూర్తిగా వ్యతిరేకం. మద్యాహ్న సమయాల్లో చల్లగా ఉన్న ప్రదేశాల్లో ఉండటానికే ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ బయటకు వెళ్ళవలసి వస్తే ఏదైనా నీడ పట్టున ఉండటానికి ప్రయత్నిస్తారు.
"https://te.wikipedia.org/wiki/సూర్యరశ్మి" నుండి వెలికితీశారు