ఎఱ్రాప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ మార్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
 
'శంభుదాసుడు'గా తాను ప్రశస్తుడవుతాడని తన తాతగారు కలలో కనిపించి ఆశీర్వదించారని నృసింహపురాణం పీఠికలో ఎర్రన వ్రాసుకొన్నాడు. అతని బిరుదు శంభుదాసుడు అయినప్పటికీ అతడు గ్రహించినవన్నీ విష్ణుకథలే. ఈ విధంగా ఎర్రన హరిహరాద్వైతమును [[జీవితం]]లోనూ, రచనలలోనూ కూడా పాటించాడని తెలుస్తుంది.
 
 
'ప్రబంధ పరమేశ్వరుడు' అనే ప్రశస్తి అరణ్య పర్వశేష రచన వలన కలిగి, తరువాత అది బిరుదంగా కొనసాగిందని నృసింహపురాణంలోని ఒక పద్యం ద్వారా తెలుస్తున్నది. ఎర్రన పురాణకవుల కోవకు చెందినవాడయనా గాని, అద్భుతమైన తన వర్ణనాత్మకత ద్వారా తరువాతి ప్రబంధ కవులకు మార్గదర్శకమైనాడు. అతని ప్రబంధశైలి నృసింహపురాణంలో ఉన్నత స్థాయిని చేరుకుంది.
"https://te.wikipedia.org/wiki/ఎఱ్రాప్రగడ" నుండి వెలికితీశారు