మృత్తికలు: కూర్పుల మధ్య తేడాలు

వర్గీకరణ
పంక్తి 2:
మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో '''నేలలు''' లేదా '''మృత్తికలు''' ముఖ్యమైనవి. భూ ఉపరితలంలోని సారవంతమైన సన్నటి పొరే నేల. వ్యవసాయాభివృద్ధిలో నేలలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వృక్షసంపద , పంటల ఉత్పత్తికీ తద్వారా సకల ప్రాణుల జీవనానికి మృత్తిక అవసరం. ఇది గతిశీలమైన [[ప్రకృతి వనరు]].
==రకాలు==
నేలలు లేదా మృత్తికల అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అనీ మృత్తికా నిర్మాణ ప్రక్రియను పెడోజెనిసిస్ అని అంటారు. స్వభావం, రంగు, వాటి రసాయన ధర్మాలను ఆధారంగా చేసుకుని భారత వ్యవసాయ పరిశోధన మండలి భారతదేశంలో నేలలను 8 రకాలుగా విభజించింది.<ref>ఈనాడు ప్రతిభ వ్యాసం, అక్టోబర్ 6, 2009 </ref>
అవి
#'''ఒండలి నేలలు''': ఇవి భారతదేశంలో దాదాపు 45 శాతం ఆక్రమించి ఉన్నాయి. నేలలన్నింటిలోకి అత్యంత సారవంతమైనవి. నదులు తెచ్చే అవక్షేప పదార్థాలు నిక్షేపితం కావడంతో ఏర్పడ్డాయి.
#'''నల్లరేగడి నేలలు''': ఇవి బసాల్ట్ శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడతాయి. వీటికి నలుపు రంగు రావడానికి కారణం అందులో కరిగే ఉండే ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్ లు. ఇవి [[మహరాష్ట్ర]], [[గుజరాత్]], [[మధ్యప్రదేశ్]], [[కర్ణాటక]], [[ఆంధ్రప్రదేశ్]], [[తమిళనాడు]], [[రాజస్థాన్]] లోని దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వీటినే స్థానికంగా రేగడి నేలలు అనికూడా అంటారు.
#'''ఎర్ర నేలలు''': గ్రానైట్, నీస్ లాంటి శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడ్డాయి. ఇవి ఎర్రగా ఉండటానికి ప్రధాన కారణం అందులో కరిగి ఉండే ఫెర్రిక్ ఆక్సైడ్ లు
#'''లేటరైట్ నేలలు''': లేటర్ అంటే ఇటుక అని అర్థం. ఇవి ఇటుక రంగులో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది.
#'''శుష్క, ఎడారి నేలలు''': ఇవి భారతదేశ వాయువ్య ప్రాంతంలోని శుష్క, అర్థ శుష్క ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. నిస్సారమైన నేలలు కావడంతో వ్యవసాయానికి వీలుపడదు.
#'''పర్వత ప్రాంత నేలలు''': దేశంలోని శుష్క, అర్థ శుష్క ప్రాంతాల్లో ఉన్న సోడియం, కాల్షియం, మెగ్నీషియం లవణాలతో కూడిన చవుడు నేలలను క్షార మృత్తిక నేలలు అంటారు.
#లవణీయ, క్షార మృత్తిక నేలలు
#బురద, జీవ సంబంధ నేలలు
 
==మృత్తికా క్రమక్షయం==
క్రమక్షయ కారకాలైన ప్రవహించే నీరు, గాలి, హిమానీ నదాలు, మానవులు, జంతువుల కార్యకలాపాల వల్ల మెత్తని, సారవంతమైన మృత్తిక పైపొర కొట్టుకొని పోవడాన్ని మృత్తికా క్రమక్షయం అని అంటారు. విచక్షణా రహితంగా అడవులను నరికివేయడం, అధిక వర్షపాతం, తరచు సంభవించే [[వరద]]లు, అతి వేగంగా వీచే గాలులు, అతి పశుగ్రాసం మొదలైనవి మృత్తికా క్రమక్షయానికి ప్రధాన కారణాలు.
"https://te.wikipedia.org/wiki/మృత్తికలు" నుండి వెలికితీశారు