ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్ర ప్రదేశ్ 2010 ద్వితీయ ఇంటర్మీడియట్ ఫలితాలు
పంక్తి 3:
==ఇంటర్మీడియట్ ఫలితాలు==
===2010 ఇంటర్ ద్వితీయ===
2010 మార్చిలో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో బాలికలు , ఉత్తీర్ణతలో బాలుర కంటే మరోసారి పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,17,794 మంది పరీక్షలు రాయగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,95,927 మంది, ప్రైవేట్ విద్యార్థులు 2,21,867 మంది ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 4,50,248 (64.69%) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 74,915 (33.77%) మంది మాత్రమే పాసయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోల్చితే 4.54 మేర పెరిగింది.
 
జనరల్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్ర భాగాన నిలవగా, 53 శాతంతో అనంతపురం జిల్లా అట్టడుగున ఉండిపోయింది. పరీక్షలు రాసిన బాలికల్లో 67 శాతం మంది, బాలురలో 63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 75 శాతానికి పైగా మార్కులతో 1,82,408 మంది (40.51%) 'ఏ' గ్రేడ్ సాధించారు.
మిగతా వారిలో 1,65,002 (36.65%) మంది 'బీ' గ్రేడ్ (60- 75% మార్కులు) పొందారు. మరో 78,509 (17.44%) మందికి 'సీ'గ్రేడ్ (50-60% మార్కులు), మిగతా 24,329 (5.40%) మందికి 'డీ' గ్రేడ్ (35-50% మార్కులు) వచ్చాయి. మొత్తం 622 మంది జనరల్ అభ్యర్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదవగా,84 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. 73,172 మంది కంపార్ట్‌మెంటల్‌లో పాసయ్యారు.
 
మొత్తం 60,644 మంది వొకేషనల్ అభ్యర్థుల్లో 48,885 మంది రెగ్యులర్, 11,759 మంది ప్రైవేట్ అభ్యర్థులున్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 58.03 శాతం మంది పాస్ అయ్యారు. బాలికల్లో 63%, బాలురలో 54% ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ అభ్యర్థుల్లో 7,684 మంది ఏ- గ్రేడ్, 18,165 మంది బీ- గ్రేడ్, 2,456 మంది సీ-గ్రేడ్, 63 మంది డీ-గ్రేడ్ సాధించారు. 22 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. 3,593 మంది కంపార్ట్‌మెంటల్‌లో పాసయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 30.75% ఉత్తర్ణీతఉత్తీ ర్ణత నమోదైంది.
 
 
===2009===
"https://te.wikipedia.org/wiki/ఇంటర్మీడియట్_విద్య" నుండి వెలికితీశారు