హెరాకిల్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
'''నాల్గవ సాహసం:''' ఈ సాహసంలో ఆర్టిమిస్ అనే కన్యక దేవతకు ప్రీతికరమైన జింకను హెరాకిల్స్ బంధిస్తాడు. సెర్నియా అను ప్రదేశంలో నివసించే ఈ జింక కాంస్య, బంగారపు గిట్టలు కలిగివుండి గాలిలో వదిలిన బాణ వేగాన్ని సైతం అధికమిస్తుంది. హెరాకిల్స్ సంవత్సరం పాటూ శ్రమించి ఆ జింకను ఓ నది దాటుతుండగా బాణంతో కొట్టి పట్టుకుని తన భుజంపై వేసుకుంటాడు. ఆర్టిమిస్ కు గతాన్ని అంతా చెబుతాడు. హెరాకిల్స్ ఆ జింకను తీసుకెళ్ళి యొరిస్తియోస్ కు చూపిస్తాడు. మాట ప్రకారం హెరాకిల్స్ ఆ జింకను ఆర్టిమిస్ కు సజీవంగా తిరిగి ఇచ్చేస్తాడు.
 
'''ఐదవ సాహసం:''' ఎలిస్ దేశపు రాజైన ఆగీస్ కి ఒక 30 సంవత్సరాల నుండి శుభ్రం చేయబడని అశ్వశాల ఉంది. ఈ అశ్వశాలను ఒక్క రోజులో శుభ్రపరచడమే హెరాకిల్స్ చేసిన ఐదవ సాహసం. అశ్వశాలలో రెండు వైపుల గోడలను పడగొట్టి కందకాలు తవ్వి ఆఫయుస్, పెయుస్ అనే రెండు నదుల ప్రవాహాలను మళ్ళించాడు. దాంతో అశ్వశాల శుభ్రమైపోతుంది. అశ్వశాల శుభ్రమైతే పదవ వంతు అశ్వాలను ఇస్తానని మాట తప్పిన అగీస్ ను హెరాకిల్స్ హతమార్చుతాడు. తన పనిపనిలో సహాయపడినందుకుగాను అగిస్ కుమారుడైన ఫైలియూస్ కు తిరిగి రాజ్యాన్ని ఇచ్చేస్తాడు.
 
[[వర్గం:గ్రీకు పురాణం]]
"https://te.wikipedia.org/wiki/హెరాకిల్స్" నుండి వెలికితీశారు