హెరాకిల్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
'''మూడవ సాహసం:''' హెరాకిల్స్ ను ఎరిమాన్తియన్ పర్వతంలో రాకాసి పందిని సజీవంగా తీసుకురమ్మంటాడు యురిస్తియోస్. హెరాకిల్స్ ఆ పందిని మంచుకొండల గూండా అలసిపోయే వరకూ తరిముతాడు. ప్రమాదవశాత్తు ఆ పంది మంచులో చిక్కుకుపోగా హెరాకిల్స్ దాన్ని పట్టి కాళ్ళు కట్టి, తన భజాలకు తగిలించుకొని యురిస్తియోస్ వద్దకు వెళ్ళతాడు. రాకాసి పందిని చూసిన యురిస్తియోస్ భయంతో పెద్ద జాడీలో పెట్టేస్తాడు.
 
'''నాల్గవ సాహసం:''' ఈ సాహసంలో ఆర్టిమిస్ అనే కన్యక దేవతకు ప్రీతికరమైన జింకను హెరాకిల్స్ బంధిస్తాడు. సెర్నియా అను ప్రదేశంలో నివసించే ఈ జింక కాంస్య
కంచు, బంగారపు గిట్టలు కలిగివుండి గాలిలో వదిలిన బాణ వేగాన్ని సైతం అధికమిస్తుంది. హెరాకిల్స్ సంవత్సరం పాటూ శ్రమించి ఆ జింకను ఓ నది దాటుతుండగా బాణంతో కొట్టి పట్టుకుని తన భుజంపై వేసుకుంటాడు. ఆర్టిమిస్ కు గతాన్ని అంతా చెబుతాడు. హెరాకిల్స్ ఆ జింకను తీసుకెళ్ళి యొరిస్తియోస్ కు చూపిస్తాడు. మాట ప్రకారం హెరాకిల్స్ ఆ జింకను ఆర్టిమిస్ కు సజీవంగా తిరిగి ఇచ్చేస్తాడు.
 
'''ఐదవ సాహసం:''' ఎలిస్ దేశపు రాజైన ఆగీస్ కి ఒక 30 సంవత్సరాల నుండి శుభ్రం చేయబడని అశ్వశాల ఉంది. ఈ అశ్వశాలను ఒక్క రోజులో శుభ్రపరచడమే హెరాకిల్స్ చేసిన ఐదవ సాహసం. అశ్వశాలలో రెండు వైపుల గోడలను పడగొట్టి కందకాలు తవ్వి ఆఫయుస్, పెయుస్ అనే రెండు నదుల ప్రవాహాలను మళ్ళించాడు. దాంతో అశ్వశాల శుభ్రమైపోతుంది. అశ్వశాల శుభ్రమైతే పదవ వంతు అశ్వాలను ఇస్తానని మాట తప్పిన అగీస్ ను హెరాకిల్స్ హతమార్చుతాడు. తన పనిలో సహాయపడినందుకుగాను అగిస్ కుమారుడైన ఫైలియూస్ కు తిరిగి రాజ్యాన్ని ఇచ్చేస్తాడు.
 
'''ఆరవ సాహసం:''' స్టింపాలియా నది వద్ద ఉన్న నరమాంస పక్షులను తరిమివేయడం హెరాకిల్స్ చేసిన ఆరవ సాహసం. ఈ పక్షుల ముక్కులు కాంస్యంతోను, రెక్కలు లోహంతోను తయారుచేయబడి ఉంటాయి. పంటలను, పండ్ల చెట్లను, మనుష్యులను నాశనం చేసే ఇవి యుద్ధ దేవుడైన ఎరిస్ కు ప్రీతికరమైనవి. హెపేస్తస్ తయారు చేసిన గలగల శబ్దం చేసే కాంస్యపు యంత్రాన్ని ఉపయోగించి హెరాకిల్స్ ఆ పక్షులను భయపెడతాడు. భయంతో ఎగురుతున్న ఆ పక్షులను హెరాకిల్స్ తన బాణాలతో (లేక పంగళి కర్రతో) చాలా వరకూ చంపేస్తాడు. మిగిలిన పక్షులు అక్కడినుండి శాశ్వతంగా వెళ్ళిపోతాయి.
 
'''ఏడవ సాహసం:''' క్రేట్ ద్వీపంలో పంటలను నాశనం చేస్తున్న వృషభాన్ని బంధించమే హెరాకిల్స్ చేసిన ఏడవ సాహసం. క్రేటాన్ ను పాలించే మినోస్ అనే రాజు హెరాకిల్స్ కు వృషభాన్ని బంధించేందుకు అనుమతిస్తాడు. హెరాకిల్స్ ఆ వృషభాన్ని బంధించి ఓడలో ఎధెన్స్ పంపేస్తాడు. యురిస్తియోస్ ఆ వృషభాన్ని హెరా కోసం బలివ్వాలనుకుంటాడు. సుందరంగా ఉన్న ఆ వృషభాన్ని యురిస్తియోస్ బలివ్వడం హెరా నిరాకరిస్తుంది.
 
'''ఎనిమిదవ సాహసం:''' డయోమెడెస్ అనే రాజు తన గుర్రాలను మనుషుల మాంసంతో మేపుతుంటాడు. హెరాకిల్స్ ఆ రాజును కంచు తొట్టిలో పడేస్తాడు. ఆ నరమాంస గుర్రాలు తమ రాజును తినేస్తాయి. దాంతో ఆ గుర్రాలు శాంతించడంతో వాటిని యురిస్తియోస్ వద్దకు తీసుకువెళ్లతాడు హెరాకిల్స్. అలెగ్జాండర్ గుర్రమైన బుష్పలాస ఈ గుర్రాల జాతికే చెందినదని భావిస్తారు.
 
'''తొమ్మిదవ సాహసం:''' హెరాకిల్స్ అమెజాన్ దేశానికి ఒంటరిగా (లేక థెసస్ మరియు తెలమన్ అను యువకులతో) వెళ్ళతాడు. థెర్మోడాన్ నది ఒడ్డున ఉన్న థెమిస్క్రియా దేశాన్ని పరిపాలించే హిప్పోలైట్ అనే రాణి ఎప్పుడు ఎరిస్ అనే దేవుడు బహూకరించిన నడికట్టుతో ఉంటుంది. హెరాకిల్స్ రాణి అయిన హిప్పోలైటస్ ను అపహరిస్తున్నాడని హెరా అమెజాన్ దేశమంతా పుకారు సృష్టించి ఆ అమెజానులను హెరాకిల్స్ పై ఉసిగొల్పుతుంది. అమెజానులు హెరాకిల్స్ యొక్క ఓడపై దాడి చేస్తారు. హెరాకిల్స్ తన పై హిప్పోలైటస్ హత్యాప్రయత్నం చేస్తోందని భావించి ఆమెను చంపి నడికట్టును దక్కించుకుంటాడు.
 
[[వర్గం:గ్రీకు పురాణం]]
"https://te.wikipedia.org/wiki/హెరాకిల్స్" నుండి వెలికితీశారు