వి. వి. గిరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉత్తర ప్రదేశ్ గవర్నర్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''వి.వి.గిరి'''గా ప్రసిద్ధుడైన '''వరాహగిరి వేంకటగిరి''' ([[ఆగష్టు 10]], [[1894]] - [[జూన్ 23]], [[1980]]), [[భారతదేశం|భారతదేశ]] నాలుగవ [[రాష్ట్రపతి]].
 
ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని [[గంజాం జిల్లా]]కు చెందిన [[బెర్హంపూర్]] పట్టణములోని ఒక [[తెలుగు]] నియోగి బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ జిల్లా మరియు పట్టణము ఇప్పుడు [[ఒరిస్సా]] రాష్ట్రములో ఉన్నాయి. వీరి తండ్రి [[వరాహగిరి వెంకట జోగయ్య]] ప్రసిద్ధిచెందిన న్యాయవాది. ఈయన జిల్లాతండ్రి మరియుతూర్పుగోదావరి పట్టణముజిల్లాలోని ఇప్పుడుచింతలపూడి [[ఒరిస్సా]]నుండి రాష్ట్రములోబరంపురంకు ఉన్నాయివలస వెళ్ళాడు.
 
1913లో ఈయన [[యూనివర్శిటీ కళాశాల డబ్లిన్]] లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ [[ఐర్లండ్]] లో [[సీన్‌ఫెన్ ఉద్యమము]]లో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు [[ఈమొన్ డి వలేరా]], [[మైఖెల్ కోలిన్స్]], [[పాట్రిక్ పియర్సె]], [[డెస్మండ్ ఫిట్జెరాల్డ్]], [[ఈయోన్ మెక్‌నీల్]], [[జేమ్స్ కాన్నలీ]] తదితరులతో సన్నిహితము యేర్పడినది.
 
భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
 
గిరి 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యాడు.<ref>Narasingha P. Sil, ''Giri, Varahagiri Venkata (1894–1980), trade unionist and president of India'' in ''[[Oxford Dictionary of National Biography]]'' (2004)</ref>
 
1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరి కాంగ్రేసు అభ్యర్ధిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచాడు. 1937లో మద్రాసు ప్రోవిన్స్ లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రేసు ప్రభుత్వంలో కార్మిక మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1942లో కాంగ్రేసు ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్ళాడు. ఈయన రాజమండ్రి జైలులో ఖైదీగా ఉంచారు.
 
{{క్రమము
"https://te.wikipedia.org/wiki/వి._వి._గిరి" నుండి వెలికితీశారు