రమ్యకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
| image = Rkrish21.png
| birth_date = {{birth date and age|1967|09|15|df=y}}
| birth_place = [[Chennaiచెన్నై]], [[Tamil Naduతమిళనాడు]], [[Indiaభారతదేశం]]
| known_for = రమ్యకృష్ణ
| occupation = Actress
పంక్తి 12:
 
 
కొంతకాలం క్రితం తెలుగు చలన చిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన కధానాయక '''రమ్యకృష్ణ'''. ప్రముఖ చలన చిత్ర దర్శకుడు [[కృష్ణవంశీ]] ఈమె భర్త. ఈమె తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు. ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన [[ఇద్దరు మిత్రులు]] చిత్రంతో కధానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి, 1989లో వచ్చిన [[సూత్రధారులు]] చిత్రంద్వారా మంచినటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకూ సరయిన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలయిన [[అల్లుడుగారు]] చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి.
==నేపధ్యము==
1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించింది. యుక్తవయస్సులోనే సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఎనిమిదో తరగతి చదువుతూనే తమిళంలో ‘వెల్లై మనసు’ లో ప్రధాన ప్రాత పోషించింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ‘బాల మిత్రులు’ 1987లో విడుదల అయింది. కె. రాఘంద్రేరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగింది. దాదాపుగా తెలుగుహీరోలు అందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలున్నాయి.
 
నరసింహ చిత్రంలో [[రజినీకాంత్]]తో పోటీపడి మరీ చేసిన 'నీలాంబరి' పాత్రను రక్తి కట్టించింది. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా, సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ.. న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు దర్శకుడు [[కృష్ణవంశీ]]ని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.
==టీవీ రంగం==
సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు ‘జరా మస్తీ జరా ధూమ్’ అనే టీవీ షో ప్రారంభించింది. మరిన్ని రకరకాల టీవీ షోలు చేయలన్ని ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.
 
==రమ్యకృష్ణ నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/రమ్యకృష్ణ" నుండి వెలికితీశారు