వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 264:
*[[వికీపీడియా:రచ్చబండ_(ఇతరత్రా)/పాత_రచ్చబండ_ఇతరత్రా_4#వికీపీడియా మహోత్సవం 2013 చర్చలు| చర్చలలో ముఖ్యాంశాలు]]
* [http://www.youtube.com/watch?v=C79fc6mCjLY 'శభాష్ వికీ'యూ ట్యూబ్ లింకు] {{deadlink}}
===మా స్వగతం-విశ్వనాధ్===
 
;విశ్వనాధ్
10 వ తేదీ ఉదయం మేము సికింద్రాబాద్ స్టేషన్ నుండి మాకు విడిదిగా నాంపల్లిలో కామత్ హొటల్ ఎదురుగా కల హొటల్ సాయికృష్ణ కు చేరుకున్నాం. అటునుండి స్నానం పానం ముగించి గోల్డెన్ ట్రిషోల్డ్ వైపుగా నడుస్తూ వచ్చాం. అక్కడ మాకు సమావేశపు ఫ్లెక్సీలు కనిపించాయి. మరింత ముందుకు నడిచిరాగా ప్రముఖ నాయకి సరోజినీ నాయుడు స్వగృహం దర్శనం ఇచ్చింది.
వాటిని చూస్తూ ముందుకు వెళ్ళి ఎవరినో తెలుగువికీ సమావేశం గురించి అడుగగా వెనుక కల పెద్ద బిల్డింగ్ రెండవ అంతస్తుకు వెళ్ళమన్నారు. అక్కడ కొందరు క్రియాశీలక సభ్యులు పనులతో హడావిడిగా కనిపించారు. కొందరిని గుర్తించగలిగాం, మరికొందరిని మేము గుర్తించిన వాళ్ళు మాకు పరిచయం చేసారు. మరికొందరు వారికి వారుగా మమ్మల్ని పరిచయం చేసుకొన్నారు. తరువాత అందరితో కలసి సమావేశపు హాలు వైపుగా నడిచాం. అక్కడ సుమారు వందమంది కూర్ఛొగలిగిన ఏర్పాట్లతో, సెంట్రల్ ఎయిర్ కండీషన్ కలిగి, ప్రోజెక్టర్,తెర, హైఫై తదితర సౌకర్యాలతో కూడిన హాలు దర్శనమిచ్చింది. అక్కడనుండి మరికొందరు వస్తూండగా వారిని పరిచయం చేసుకొంటూ మొదటి సమావేశమునకు జరుగుతున్న ఏర్పాట్లను చూస్తూఉన్నాం.