మాధవపెద్ది సత్యం: కూర్పుల మధ్య తేడాలు

నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు.
కొత్త పేజీ: '''మాధవపెద్ది సత్యం ''' తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నట...
(తేడా లేదు)

22:03, 4 ఏప్రిల్ 2007 నాటి కూర్పు

మాధవపెద్ది సత్యం తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ మరియు సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 5000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.

సత్యం 1922లో బాపట్ల సమీపాన బ్రాహ్మణపల్లె గ్రామములో జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకాలలో నటించేవాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు అయ్యయో జేబులో డబ్బులు పోయెనే మరియు మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనంబు ఈయన మధురకంఠమునుండి జాలువారినవే.

75ఏళ్ల్ల వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండగొచ్చెరో పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.

ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో స్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు.

మూలాలు