రేగు: కూర్పుల మధ్య తేడాలు

చి .
పంక్తి 30:
ఎన్ని రకాలుగా తినొచ్చో...
 
ఎండిన పండ్లను స్నాక్స్‌లాగా, టీ తాగేప్పుడు తీసుకుంటారు. రేగిపళ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు. రేగు పళ్లతో జ్యూస్‌, వెనిగార్‌లను కూడా తయారుచేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో, బంగ్లాదేశ్‌లో వీటితో పచ్చడి చేసుకుంటారు. చైనీయులు వీటితో వైన్‌ను కూడా తయారుచేస్తారు. వారు బెరుజు అనే ద్రవంలో వాటిని నిలవ చేస్తారు. అలా అవి మూడు నాలుగు నెలల వరకు తాజాగా ఉంటాయి. రేగు పళ్లను ఎండబెట్టి వాటిలోని విత్తనాలు తీసి చింతకాయలు, ఎర్రని పచ్చిమిరపకాయలు, ఉప్పు, బెల్లం వేసి దంచుతారు. దీన్ని భోజనంతో కలిపి తింటారు. వీటితో వడియాలు కూడా చేస్తారు. రేగుపళ్లలో మంచి పోషకాలే కాక 'సి' విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. జామకాయ తరువాత ఎక్కువగా ఇందులోనే ఉంటుంది. మనదేశంలో ఎక్కువగా వీటిని నేరుగా తింటారు. వీటితో [[తాండ్ర]] కూడా చేసుకుంటారు. ఒంటెలు, మేకలు, ఇతర పశువులకు వీటి ఆకులు మంచి పోషకాహారం. ఇండోనేషియన్లు ఆకులతో కూర చేసుకుని తింటారట.
 
ఇదో నమ్మకం
"https://te.wikipedia.org/wiki/రేగు" నుండి వెలికితీశారు