జుంపా లహరి రచించిన ది నేమ్‌సేక్ ఆధారముగా మీరానాయర్ దర్శకత్వములో నిర్మించబడిన ఈ సినిమా మార్చి 2007లో విడుదలైనది. స్క్రీన్ ప్లే అందించినవారు సూని తారాపోర్‌వాలా.

ది నేమ్ సేక్
Promotional poster for The Namesake
దర్శకత్వంమీరా నాయర్
రచనజుంపా లహరి (నవల) & సోనీ తారాపూర్వాలా
తారాగణంటాబూ
ఇర్ఫాన్ ఖాన్
కాల్ పెన్
జులైకా రాబిన్సన్
జాసిందా బ్యారెట్
సహీరా నాయర్
విడుదల తేదీ
మార్చ్ 9, 2007
భాషఇంగ్లీషు

ప్లాట్ మార్చు

చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక: నవల చదవ గోరిన వారు/సినిమా చూద్దామనుకున్న వారు ఈ క్రింది భాగాన్ని చదవ వద్దని మనవి. కథ వివరాలు తెలుపుతూ, ఉత్కంఠ లేకుండా చేసే అవకాశం ఉంది.

ది నేమ్‌సేక్ అమెరికాలో భార్యాభర్తలైన ఇద్దరు మొదటి తరము బెంగాలీ వలసదారులు ఆసీమా గంగూలీ (టాబూ) ఆశోక్ గంగూలీ (ఇర్ఫాన్ ఖాన్), వారి పిల్లలు గోగోల్ (కాల్ పెన్), సోనియా (సహీరా నాయర్) జరిపిన పోరాటాలను వివరిస్తుంది. ఆశోక్, ఆసీమాలు కలకత్తా వదిలి మెసాచుసెట్స్ లో సెటిల్ అవ్వడముతో కథ మొదలవుతుంది. సరదాగా కొడుకుకు పెట్టిన 'గోగోల్' అనే పేరు ఆతని నిజమైన పేరుగా మారిపోయి, వాడి జీవితము పై చాలా ప్రభావము చూపిస్తుంది. గోగోల్ ఆ తరువాతి కాలంలో ఇద్దరు యువతులు మేక్సీన్ (యాసిందా బేరెట్), మౌసమీ (జులైకా రాబిన్సన్) లను ఒకరి తరువాత ఒకరిని ప్రేమిస్తాడు. ఆతని తల్లితండ్రులు డేటింగ్, పెళ్ళి ప్రేమలపై అతని కొత్త అమెరికన్ దృక్పధాన్ని అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కబుర్లు మార్చు

  • మీరా నాయర్ మొదట రాణీ ముఖర్జీను, కరణ్ జోహార్ ఖబీ అల్విద నా కహనాలో చూసి అసిమా పాత్రకు కావాలనుకున్నా డేట్లు కుదరలేదు. ఆ తరువాత ఆమె కొంకణసేన్ శర్మను కోరుకొనెను. ఆమె తన తల్లి అపర్ణా సేన్ 15, పార్క్ అవెన్యూ వల్ల రాలేక పోయేసరికి, టాబూని తీసుకుంది.
  • కల్పేన్ మోదీ గా జన్మించిన కాల్ పెన్, ఏజెంట్లు ఇంగ్లీషు పేరు ఉంటే అవకాశాలు ఏక్కువవుతాయని చెప్పడముతో పేరు మార్చుకున్నాడు.

బైట లింకులు మార్చు