సిద్ధి ఇద్నాని

తెలుగు చలనచిత్ర నటి

సిద్ధి ఇద్నాని తెలుగు చలనచిత్ర నటి. 2018లో వచ్చిన జంబ లకిడి పంబ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

సిద్ధి ఇద్నాని
2022 లో సిద్ధి ఇద్నాని
జననంజనవరి 10
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
జంబ లకిడి పంబ
ప్రేమకథా చిత్రమ్ 2

జననం మార్చు

సిద్ధి ఇద్నాని జనవరి 10న ముంబైలో జన్మించింది. తండ్రి అశోక్ ఇద్నాని నట శిక్షకుడు కాగా, తల్లి ఫాల్గుని దావే టెలివిజన్ నటి.

సినిమారంగం మార్చు

2014లో క్లీన్ అండ్ క్లియర్ బాంబే టైమ్స్ ఫ్రెష్ ఫేస్ పోటీలో మూడవ రన్నరప్ గా నిలిచింది. 2017లో గుజరాతిలో దేవంగ్ పటేల్ నటించిన గ్రాండ్ హాలీ చిత్రంతో సినిమారంగానికి వచ్చింది. మిస్ ఇండియా సూపర్ టాలెంట్ గెలుచుకునేందుకు 2018లో పారిస్ లో భారతదేశంకు ప్రాతినిధ్యం వహించింది.

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు ప్రస్తావనలు
2016 గ్రాండ్ హాలీ నిరలి గుజరాతి తొలి చిత్రం
2018 జంబ లకిడి పంబ పల్లవి తెలుగు [2]
ప్రేమకథా చిత్రమ్ 2 బిందు తెలుగు [3][4]
2020 అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సిద్ధి తెలుగు
2022 వెందు తానింధాతు కాదు పావాయి తమిళం
ఆర్య 32 తమిళం
నూరు కోడి వానవిల్ ఫెన్నీ తమిళం
2023 ది కేరళ స్టోరీ గీతాంజలి హిందీ [5]

మూలాలు మార్చు

  1. Times of India, Entertainment (22 June 2018). "Jamba Lakidi Pamba Movie". Paturi Rajasekhar. Retrieved 9 January 2020.
  2. Deccan Chronicle, Entertainment (31 March 2018). "Siddhi Idnani makes her Telugu debut". Archived from the original on 2 June 2019. Retrieved 9 January 2020.
  3. The New Indian Express, Entertainment (3 July 2018). "Siddhi Idnani signs a romantic thriller". CH Murali Krishna. Archived from the original on 5 July 2019. Retrieved 9 January 2020.
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (సినిమా కబుర్లు) (30 March 2019). "దెయ్యం ఎవరో సినిమా చూస్తేనే తెలుస్తుంది: సిద్ధి ఇద్నాని". Archived from the original on 9 January 2020. Retrieved 9 January 2020.
  5. The Kerala Story Official Trailer | Vipul Amrutlal Shah | Sudipto Sen | Adah Sharma | Aashin A Shah, retrieved 2023-05-02

ఇతర లంకెలు మార్చు