ఆర్య(నటుడు)

భారత నటుడు మరియు చిత్ర నిర్మాత (జననం 1980)

ఆర్య(జననం:1980) ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన ఆయన మళయాళంలో చాలా సినిమాలు నిర్మించారు. ఆర్య అసలు పేరు జమ్షద్ చేతిరకత్. విష్ణువర్ధన్ దర్శకత్వంలో నటించిన అరినుథమ్ అరియమలుమ్(2005), పట్టియల్(2006) సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్య. బాలా దర్శకత్వంలో వచ్చిన నాన్ కడవుల్(2009) సినిమాలోని నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత ఆయన నటించిన మదరసపట్టినమ్(2010), బాస్ ఎంగిర భాస్కరన్(2010(తెలుగు:నేనే అంబానీ)), వెట్టాయ్(2012) వంటి సినిమాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి.[1][2][3] ఆయన ఒక ఫిలింఫేర్ ఉత్తమ నటుడు  పురస్కారం, ఫిలింఫేర్, విజయ్ పురస్కారలకు నామినేషన్లు  అందుకున్నారు. 2011లో తమిళనాడు ప్రభుత్వం ఆర్యకు కళైమామణి  పురస్కారం ఇచ్చి గౌరవించింది.[4]

ఆయన తన స్వంత నిర్మాణ సంస్థ ది షో పీపుల్ తో ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆగస్టు సినిమా నిర్మాణ సంస్థలో ఆర్య భాగస్వామిగా కూడా ఉన్నారు.

వ్యక్తిగత జీవితం

మార్చు

1980లో కేరళలోని త్రికరిపూర్ లో మళయాళ కుటుంబంలో  జన్మించారు ఆర్య. చెన్నైలోని ఎస్.బి.ఒ.ఎ మెట్రిక్యులేషన్ అండ్  హైయర్ సెకెండరీ స్కూల్ లో చదువుకున్నారు. చెన్నైలో క్రెసెంట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చదివారు ఆర్య. ఆయన తండ్రి రెస్టారెంట్ యజమాని, ఫుట్ బాల్ క్రీడాకారుడు.[5] ఆర్య తమ్ముడు సత్య కూడా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.

వాట్టెర్న్ ర్నున్దన్ మోటాలా  సైకిల్ రేస్ లో పాల్గొని మెడల్ కూడా సంపాదించుకున్నారు ఆర్య.[6]

కెరీర్

మార్చు

అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నప్పుడు ఆర్య పక్క ఇంటిలోఉండే సినిమాటోగ్రఫర్ జీవా తను తీయబోయే సినిమా ఉల్లమ్ కెట్కుమాయే సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ కు రమ్మని ఆర్యను అడిగారు. ఈ సినిమాకు ఒప్పుకున్న ఆయన పేరును ఆర్యగా మార్చారు జీవా.[7] ఈ సినిమా నిర్మాణం ఆలస్యం అయింది.[8] దాంతో విష్ణువర్ధన్ దర్శకత్వంలో అరినుథమ్ అరియమలుమ్(2005) సినిమాతో తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది.[9][10] ఈ సినిమాలో గాంగ్ స్టర్ కొడుకుగా ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అంతే కాక 2005లో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆయన.[11] ఆర్య నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.[12] చాలా ఏళ్ళ తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకంటూ ఓ గుర్తింపు రావడానికి కారణం యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన తీ పిడికా పాట వల్లే అని గుర్తుచేసుకున్నారు.[7] 2003లో మొదలైన ఉల్లమ్ కెట్కుమయే సినిమా 2005లో విడుదలై మంచి విజయం సాధించింది. కాలేజీలో క్రికెటర్ పాత్రలో నటించిన ఆర్యకు ప్రశంసలు లభించాయి.[13] 2005లోనే తన మూడో సినిమా ఒరు కల్లురియిన్ కథై  సినిమా హిట్ కాలేదు.[14] కానీ ఆయన నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. దాంతో ఆర్యను తమిళ సినీ రంగంలో యువ కెరటంగా భావించారు సినీజనాలు. ఆయనకు ఆ తరువాత అవకాశాలు కూడా చాలా ఎక్కువే వచ్చయి.[15]

 
2012 సిసిఎల్ లో సమీరా రెడ్డితో ఆర్య
దస్త్రం:Arya, Shriya Saran & Rana at the press meet of SIIMA Awards in Dubai.jpg
సైమా 2013లో శ్రియా సరన్రానాలతో ఆర్య

ఇతర రంగాల్లో కృషి

మార్చు

2010లో ది షో పీపుల్ పేరుతో స్వంత నిర్మాణ సంస్థను స్థాపించారు ఆర్య. ఈ బ్యానర్ ద్వారా చిన్న బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నారు. మొదటగా బాస్ ఎంగిర భాస్కరన్(తెలుగులో నేనే అంబానీ) సినిమాను నిర్మించారు ఆయన. ఆ తరువాత ఆయన నిర్మించిన పడితురై సినిమా ఇంకా విడుదల కాలేదు.[7] 2013లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి  కూడా అడుగుపెట్టారు ఆర్య. తన సినిమా ఇరందాం ఉలగం సినిమా సింగపూర్, మలేషియా థియేటర్ హక్కులను కొన్నారు.[16]

పోతీస్ వస్త్ర సంస్థ ఓట్టో బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు ఆర్య.[17]

సినిమాలు

మార్చు

నటునిగా

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2005 అరింతం అరియాములుమ్ కుట్టి తమిళం ఉత్తమ తొలి నటునికి ఫిలింఫేర్ అవార్డ్-సౌత్[18]
2005 ఉల్లమ్ కెట్కుమే ఎమాన్ తమిళ్
2005 ఒరు కల్లురియిన్ కథై సత్య తమిళ్
2006 కలభ కథలన్ అఖిలన్ తమిళ్
2006 పట్టియల్ కొసి తమిళ్
2006 వట్టరమ్ బర్మ తమిళ్
2007 మాయ కన్నడి స్వంతపాత్ర తమిళ్ అతిథి పాత్ర
2007 ఒరమ్ పో చంద్రు తమిళ్
2009 నాన్ కదువల్ రుద్రన్ తమిళ్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్[19] విజయ్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్[20]
2009 శివ మనసుల శక్తి అరుణ్ తమిళ్ అతిథి పాత్ర[21]
2009 శరవమ్ కార్తిక్ తమిళ్
2010 వరుడు దివాకర్ తెలుగు
2010 మద్రసపట్టినమ్ ఇలమ్ పరిథి తమిళ్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నామినేషన్[22]
విజయ్ ఉత్తమ నటుడు అవార్డుకు నామినేషన్[23]
2010 కాదల్ సొల్ల వందెన్ డాక్టర్ తమిళ్ అతిథి పాత్ర[24]
2010 బాస్ ఎంగిర భాస్కరన్ భాస్కరన్ తమిళ్
2010 వా చంద్రు తమిళ్ అతిథి పాత్ర[25]
2010 చికు బుకు అర్జున్ శేఖర్/శేఖర్ తమిళ్
2011 ఉర్మి చిరక్కల్ కొతువల్/తంగచన్ మళయాళం
2011 అవన్ ఇవన్ కుంబుదురెన్ సామి తమిళ్
2012 వెట్టాయ్ గురుమూర్తి తమిళ్
2012 ఒరు కాల్ ఒరు కన్నడై రజిని మురుగన్ తమిళ్ అతిథి పాత్ర[26]
2013 సెట్టై జయకాంతన్(జెకె) తమిళ్
2013 రాజా రాణి జాన్ తమిళ్
2013 అర్రంబమ్ అర్జున్ తమిళ్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్
2013 ఇరందామ్ ఉలంగమ్ మధు బాలకృష్ణన్/మరువన్ తమిళ్
2014 కథై తిరైకథై వసనమ్ ఇయక్కమ్ స్వంతపాత్ర తమిళ్ అతిథిపాత్ర
2014 జీవా కెమెరామేన్ తమిళ్ అతిథి పాత్ర
2014 మేఘమ్మన్ శివ తమిళ్
2015 పురంపొక్కు ఎంగిర పొదువుదమై బాలు తమిళ్
2015 రోమియో జూలియట్ స్వంత పాత్ర తమిళ్ అతిథి పాత్ర
2015 ఇంద్రు నేత్రు నాలై టైం మెషిన్ కనుగొన్న శాస్త్రవేత్త తమిళ్ అతిథి పాత్ర
2015 వసువం సరవననుం ఒన్న పడిచవంగా శరవణన్ తమిళ్
2015 డబుల్ బారెల్ మజ్ను మళయాళం
2015 యట్చన్ చిన్నా తమిళ్
2015 త్రిష ఇల్లన నయనతార హరిష్ తమిళ్ అతిథి పాత్ర
2015 సైజ్ జీరో అభిషేక్ తెలుగు
2015 ఇంజు ఇడుప్పళగై(సైజ్ జీరో) తమిళ్
2016 బెంగళూర్ నాట్కల్ అర్జున్(అజు) తమిళ్
2016 నంబియార్ భాస్కర్ తమిళ్ అతిథి పాత్ర
2017 కదంబన్ \ గజేంద్రుడు (2019 తెలుగు) తమిళ్
2018 రాజరాథ \ రాజరథం కన్నడ \ తెలుగు
2021 సార్పట్ట పరంబర్తె \ సార్పట్ట పరంపర తమిళ్ \ తెలుగు
2021 ఎనిమి \ ఎనిమి తమిళ్ \ తెలుగు
2021 టెడ్డీ తమిళ్ \ తెలుగు
2021 అరణ్మనై-3 (తమిళం) \ అంతఃపురం తమిళ్ \ తెలుగు
2022 పడి నెట్టం పడి (మలయాళం) \ గ్యాంగ్స్ ఆఫ్ 18 మలయాళం \ తెలుగు

నిర్మాతగా

మార్చు

ది షో పీపుల్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి ఆర్య తమిళ, మళయాళ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మించారు.

సంవత్సరం చిత్రం దర్శకుడు భాష
2014 అమర కావియం జీవ శంకర్ తమిళ్
2014 జీవా సుసీంతిరన్ తమిళ్
2015 వసువం సరవనునం ఒన్న పడిచవంగ ఎం.రాజేశ్ తమిళ్
2015 డబుల్ బారెల్ లిజో జోస్ పెళ్ళిస్సెరి మళయాళం
2016 దరవింటె పరినమమ్ జిజో ఆంతోని మళయాళం
2016 అనురాగ కరిక్కిన్ వెల్లమ్ ఖలిద్ రెహమాన్ మళయాళం
2017 ది గ్రేట్ ఫాదర్ హనీఫ్ మళయాళం
2021 ఎనిమి తెలుగు \ తమిళ్

పంపణీ రంగంలో

మార్చు
సంవత్సరం చిత్రం దర్శకుడు
2010 బాస్ ఎంగిర భాస్కరన్ ఎం.రాజేశ్

మూలాలు

మార్చు
  1. Arya: All play and all work Archived 2006-04-14 at the Wayback Machine.
  2. SSN students at their shouting best in ‘Instincts 2K9’.
  3. "What's next, Mr. John Vijay?". Archived from the original on 2008-01-17. Retrieved 2016-09-10.
  4. Tamil Nadu Govt announces Kalaimamani awards.
  5. Birthday Exclusive: Arya.
  6. Arya wins medal at Vatternrundan motala cycle race Archived 2015-06-20 at the Wayback Machine.
  7. 7.0 7.1 7.2 ""I compete with my self" [An exclusive with Arya]".
  8. Reddy, Krithika (21 July 2005).
  9. "Entertainment Chennai : Tamil cinema's new high" Archived 2005-12-31 at the Wayback Machine.
  10. http://www.sify.com/movies/tamil-box-office-2005-news-boxoffice-kkfvwTchhge.html Archived 2015-09-24 at the Wayback Machine.
  11. Moviebuzz (2005).
  12. "Arindhum Ariyamalum – Entertaining and enlivening" Archived 2010-10-26 at the Wayback Machine.
  13. "Ullam Ketkume` – A sleeper hit!"
  14. Chennai Box-Office (Sep 02-04) Archived 2014-01-23 at the Wayback Machine.
  15. "Oru Kalluriyin Kadhai – Campus complex" Archived 2010-10-06 at the Wayback Machine.
  16. Arya turns distributor with 'Irandam Ulagam'.
  17. Otto Shirts – Arya.
  18. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-10. Retrieved 2016-09-10.
  19. Nominations for 57th South Filmfare Awards – Filmibeat Archived 2014-04-07 at the Wayback Machine. Entertainment.oneindia.in (10 July 2010). Retrieved on 2016-01-12.
  20. Vijay Awards : 06/21/10 యూట్యూబ్లో
  21. "Arya to do a cameo — Tamil Movie News". Indiaglitz.com. 8 August 2011. Retrieved 24 February 2014.
  22. Published, Ramchander. (2 June 2011) 58th Idea Filmfare Awards South nominees – Filmibeat Archived 2013-12-30 at the Wayback Machine. Entertainment.oneindia.in. Retrieved on 2016-01-12.
  23. Vijay Awards : 5th Annual Vijay Awards — Best Actor Male Award యూట్యూబ్లో
  24. "Kaadhal Solla Vandhen". Top10 Cinema. 14 August 2010. Archived from the original on 27 ఫిబ్రవరి 2014. Retrieved 24 February 2014.
  25. "Va Quarter Cutting could have been funnier — Rediff.com Movies". Rediff.com. 5 November 2010. Retrieved 24 February 2014.
  26. "Arya does a cameo in OKOK". Sify.com. 9 August 2011. Archived from the original on 8 ఏప్రిల్ 2014. Retrieved 24 February 2014.