ప్రేమకథా చిత్రమ్ 2
ప్రేమకథా చిత్రమ్ 2[1][2][3] 2019, ఏప్రిల్ 6న విడుదలైన తెలుగు హర్రర్ కామెడీ సినిమా. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో హరి కిషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్,[4] నందిత శ్వేత[5] జంటగా నటించారు. దాసరి మారుతి నిర్మాతగా జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో 2013, మే 11న విడుదలైన ప్రేమకథా చిత్రమ్ సినిమాకు ఇది సీక్వెల్ సినిమా. దీని హిందీ లనువాద హక్కులు 1.5 కోట్ల రూపాయలకు అమ్మబడింది.
ప్రేమకథా చిత్రమ్ 2 | |
---|---|
దర్శకత్వం | హరి కిషన్ |
రచన | చంద్రశేఖర్, ఉప్పునూటి గణేష్ (మాటలు) |
నిర్మాత | ఆర్. సుదర్శన్ రెడ్డి |
తారాగణం | సుమంత్ అశ్విన్ నందిత శ్వేత |
ఛాయాగ్రహణం | సి. రాంప్రసాద్ |
కూర్పు | ఎస్.బి. ఉద్ధవ్ |
సంగీతం | జీవన్ బాబు |
నిర్మాణ సంస్థ | ఆర్.పి.ఏ. క్రియేషన్స్ |
విడుదల తేదీs | 6 ఏప్రిల్, 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుసుధీర్ (సుమంత్ అశ్విన్), బిందు (సిద్ధి ఇద్నాని) ఇద్దరూ ఒకే కళాశాలో చదువుతుంటారు. గొడవలతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. నందినిని (నందితా శ్వేత) ప్రేమిస్తున్న సుధీర్, బిందు ప్రేమను తిరస్కరిస్తాడు. దాంతో బిందు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. కొన్నిరోజుల తరువాత నందిని కోరిక మేరకు ఏకాంతంగా గడిపేందుకు ఊరు చివర ఫామ్ హౌస్‌కి వెళ్తారు. నందినిపై ఒక ఆత్మ ఆవహించి. నందినిని చంపేందుకు ప్రయత్నిస్తుంది. నందినికి పట్టిన దెయ్యం ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో సుధీర్ వల్ల పెళ్ళి చెడిపోయిన చిత్ర ఆత్మహత్య చేసుకుందని తెలుసుకుంటాడు. ఆ ఆత్మ ఎవరిది, నందినికి పట్టిన దెయ్యాన్ని ఎలా వదిలించారు అన్నది మిగతా సినిమా.
నటవర్గం
మార్చు- సుమంత్ అశ్విన్ (సుధీర్)
- నందిత శ్వేత (నందు)
- సిద్ధి ఇద్నాని (బిందు)[6][7]
- ప్రభాస్ శ్రీను
- విద్యుల్లేఖ రామన్
- అపూర్వ
- కృష్ణ తేజ
- ఎన్‌టివీ సాయి
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: హరి కిషన్
- నిర్మాత: ఆర్. సుదర్శన్ రెడ్డి
- రచన: చంద్రశేఖర్
- మాటలు: ఉప్పునూటి గణేష్
- సంగీతం: జీవన్ బాబు
- ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్
- కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్
- నిర్మాణ సంస్థ: ఆర్.పి.ఏ. క్రియేషన్స్
పాటలు
మార్చుప్రేమకథా చిత్రమ్ 2 | |||
---|---|---|---|
పాటలు by జీవన్ బాబు | |||
Released | 26 ఫిబ్రవరి 2019 | ||
Genre | సినిమా పాటలు | ||
Length | 16:13 | ||
Language | తెలుగు | ||
Label | ఆదిత్యా మ్యూజిక్ | ||
|
ఈ చిత్రానికి జీవన్ బాబు సంగీతం అందించగా, అనంత శ్రీరాం, కాసర్ల శ్యామ్, పూర్ణాచారి పాటలను రాశారు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "నా కళ్ళు చూసేది (రచన: కాసర్ల శ్యామ్)" | సత్య యామిని | 4:15 | ||||||
2. | "మెరుపులా మెరిసిన (రచన: అనంత శ్రీరాం)" | రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా | 4:09 | ||||||
3. | "ఆకాశమంత (రచన: పూర్ణాచారి)" | హైమత్ & రమ్మ బెహరా | 3:46 | ||||||
4. | "ఫస్ట్ టైమ్ హార్ట్ బీట్ (రచన: పూర్ణాచారి)" | రోహిత్ | 4:03 | ||||||
16:13 |
మూలాలు
మార్చు- ↑ "Prema Katha Chitram 2 movie shooting started". Times Of India. Retrieved 10 December 2019.
- ↑ "Prema Katha Chitram 2 Film Launch". The Hans India. Retrieved 10 December 2019.
- ↑ "Release date fixed for Sumanth Ashwin and Nandita starrer". Indiaglitz. Retrieved 10 December 2019.
- ↑ "Sumanth Ashwin in 2013 sequal movie". Deccan Chronicle. Retrieved 10 December 2019.
- ↑ "First look poster of Nandita from Prema Katha Chitram 2 unveiled". The New Indian Express. Retrieved 10 December 2019.
- ↑ The New Indian Express, Entertainment (3 July 2018). "Siddhi Idnani signs a romantic thriller". CH Murali Krishna. Archived from the original on 5 July 2019. Retrieved 9 January 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (సినిమా కబుర్లు) (30 March 2019). "దెయ్యం ఎవరో సినిమా చూస్తేనే తెలుస్తుంది: సిద్ధి ఇద్నాని". Archived from the original on 9 January 2020. Retrieved 9 January 2020.