ఆదిలాబాద్ జిల్లాలో నివసించే ముఖ్యమైన గిరిజన తెగ పర్దన్/ప్రధాన్.


  • ప్రధాన్ అనే తెగవారు గోండుల ఇతిహాసాలను, జానపదాలను పాడి వినిపించే సంప్రదాయ కళాకారులు. వీరి ప్రధాన వృత్తి గోండుల ధర్మ సంస్కృతిని ప్రచారం చేయడం.
  • ప్రధాన్‌లు భాషాపరంగా మరాఠీ మాట్లాడుతారు. కానీ, మాతృభాష గోండి.
  • ప్రధాన్‌లలో శిశువు పుట్టిన మూడు రోజులకు ఆడవారి కోసం పుట్టి సభ ఏర్పాటు చేస్తారు.
  • ఈ సభకు ముత్తయిదువలు వచ్చి నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ఎంజూర్ అనే పదార్థాన్ని పంచి పెడుతారు.
  • పెద్దలు కుదిర్చిన వివాహాలతోపాటు వధువును ఎత్తుకొని వెళ్లడం (ధరున్‌టాక్‌న), వధువుకు వరుడు నచ్చితే వరుడి ఇంటికి వెళ్తుంది (శివార్ దాసచ), ఇల్లరికం (ఘర్‌జావై) వంటి పద్ధతులు ఉన్నాయి. వరకట్న సంస్కృతి లేదు.
    కాలికోమ్ ఊదుతున్న కళాకారుడు
  • వీరి ప్రధాన పండుగలు ధురాడి (హోలీ), మాండావుస్ (ఉగాది), చైత్‌బీంగా మర్మింగ్, ఆకాడి, జామూర్ అవుస్, నాగ పంచమి, పోరా, బడీగా, దసరా, దీపావళి[1]
  • ప్రధాన్‌లు శుభ సందర్భాలలో కాలికోమ్ ను ఊదుతారు

మూలాలు

మార్చు
  1. ప్రధాన్‌లు. "తెలంగాణలో గిరిజన తెగలు". నమస్తే తెలంగాణ. Retrieved 8 September 2017.[permanent dead link]