అంతర్జాతీయ అహింసా దినోత్సవం
అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం (International Day of Non-Violence) ఐక్య రాజ్య సమితి చే గుర్తించబడిన స్మారక దినం. ఇది ప్రతి సంవత్సరం మహాత్మా గాంధీ జన్మదినం అయిన అక్టోబరు 2 వ తేదీన జరుపుకుంటారు.
అంతర్జాతీయ అహింసా దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు |
జరుపుకొనే రోజు | 2 అక్టోబరు |
జనవరి 2004 లో ఇరాన్ నోబెల్ గ్రహీత షిరిన్ ఎబాడీ పారిస్లోని ఒక హిందీ ఉపాధ్యాయుడి నుండి అంతర్జాతీయ అహింసా దినోత్సవం కోసం ఒక ప్రతిపాదనను అందుకున్నాడు. అతడు దాన్ని ముంబైలో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరము వద్ద ఉంచాడు. ఈ ఆలోచనపై క్రమంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసక్తి కనబరచారు. 2007 జనవరిలో న్యూ ఢిల్లీలో సత్యాగ్రహ సమావేశంలో, ఈ ఆలోచనను స్వీకరించాలని ఐక్యరాజ్యసమితికి పిలుపునిస్తూ ఒక తీర్మానం చేసారు. ఈ తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు లు తీసుకువచ్చారు.[1]
15 జూన్ 2007 న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అక్టోబర్ 2 ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకోడానికి ఓటు వేసింది.[2] ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానంలో అక్టోబర్ 2 ను "తగిన పద్ధతిలో జ్ఞాపకం చేసుకోవాలనీ, విద్య ద్వారా, ప్రజలలో అవగాహన తీసుకురావడం ద్వారా అహింసా సందేశాన్ని వ్యాప్తి చేయండం ద్వారా జరుపుకోవాలని" సభ్యులందరినీ కోరింది.[3]
భారత శాశ్వత రాయబారి అభ్యర్థన మేరకు, న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ (యుఎన్‌పిఎ) ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక ప్రత్యేక క్యాచెట్‌ను సిద్ధం చేసింది. అక్టోబర్ 2, 31 మధ్య యుఎన్పిఎ పంపే మెయిళ్ళన్నీ ఈ క్యాచెట్‌ను కలిగి ఉంటాయని చెప్పింది.
మూలాలు
మార్చు- ↑ "Conference calls for declaring International day of non-violence".
- ↑ "UN declares 2 October, Gandhi's birthday, as International Day of Non-Violence". United Nations. 15 June 2007. Retrieved 2 October 2014.
- ↑ "General Assembly Adopts Texts On Day Of Non-Violence, Ethiopian Millennium; Pays Tribute To Former Secretary-General Kurt Waldheim". United Nations. 15 June 2007. Retrieved 2 October 2014.