ప్రపంచ పర్యావరణ జల వనరుల సదస్సు- 2023

ప్రపంచ పర్యావరణ, జల వనరుల సదస్సు (వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్)- 2023 మే 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ నగరంలో జరిగింది .ఈ సదస్సులో ప్రపంచ ఇంజనీరింగ్ , , పరిశ్రమ వర్గాలకు చెందిన వారు పాల్గొన్నారు[1]. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ జలవనుల సదస్సు 2023లో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పలు రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ,ఇంటింటికి సురక్షిత మంచినీరు అందిస్తున్న మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసిన చేసిన విధానాన్ని దృశ్య రూపంలో కేటీఆర్ ఆవిష్కరించారు[2]. కాలేశ్వరం ప్రాజెక్టుకు ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ పురస్కారం ప్రపంచ పర్యావరణ జల వనరుల సదస్సు 2023లో కాలేశ్వరం ప్రాజెక్టుకు ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ పురస్కారం అనే ప్రకటించగా అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ మరియా సి లెహమాన్ చేతుల మీదుగా దాని మంత్రి కేటీఆర్ స్వీకరించారు[3].

  1. "Home | EWRI Congress". www.ewricongress.org. Retrieved 2023-08-21.
  2. Today, Telangana (2023-01-29). "KTR to speak at World Environmental & Water Resources Congress in US". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  3. "Home page - WRE 2023". www.wreconf.org. Retrieved 2023-08-21.