మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ను ప్రారంభించింది.[1] ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధిపేట శాసనసభ్యుడిగా ఉన్నప్పడు 1998 సంవత్సరంలో "సిద్ధిపేట సమగ్ర తాగునీటి పథకం" (ప్రతి గృహానికి నీరు అందిచాలని) రూపొందించారు.[2] తెలంగాణ రాష్ట్రంలోనిలో అన్ని గ్రామాలలోని (100%) ఇళ్ళకు త్రాగునీరు అందిస్తున్నారు.[3]

మిషన్ భగీరథ
PM launches first phase of Mission Bhagiratha.jpg
మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనఆగష్టు 7, 2016
వెబ్ సైటుతెలంగాణ ప్రభుత్వ అధికారిక జాలగూడు
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

ప్రారంభం

మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ 2016, ఆగస్టు 7 ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం లోని కోమటిబండలో ఆవిష్కరించారు. దీంతో దేశంలోనే ఇంటింటికీ నల్లా సౌకర్యం పొందిన తొలి నియోజకవర్గంగా గజ్వేల్ చరిత్ర సృష్టించింది.[4][5][6]

ఈ పథకం ద్వారా సుమారు రూ .42,000 కోట్ల రూపాయలతో కృష్ణ, గోదావరి నదులతోపాటు ఇతర జలాశయాలను కలిపి, 1.30 లక్షల కిలోమీటర్లు పైపులైన్ల మార్గం రాష్ట్రంలోని 24,000 గ్రామాలు, 65 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించబోతున్నారు.

లక్ష్యాలు

  1. తాగునీటి సమస్యలను తీర్చడం
  2. స్వచ్ఛమైన మంచినీరు అందించడం
  3. మూడు సెగ్మెంట్లలో పనులన్నీ పూర్తి చేసి, 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటుచేసి, సురక్షిత మంచినీటిని అందించాలనే ఆశయం

విమర్శలు

మిషన్ భగీరథ పనులు నాణ్యంగా సాగట్లేదని, సరైన సమయానికి పూర్తి కాలేదని పలు విమర్శలు ఎదురయ్యాయి.[7] ప్రత్యేకించి మిషన్ భగీరథ విషయమై టీఆర్‌ఎస్ చేసిన వాగ్దానాలు నెరవేరలేదన్నది 2018 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక ముఖ్యమైన ప్రచారాస్త్రం అయింది.

మూలాలు

  1. నమస్తే తెలంగాణ. "మిషన్ భగీరధ..!". Archived from the original on 29 మే 2016. Retrieved 20 December 2016.
  2. "MISSION BHAGIRATHA". missionbhagiratha.telangana.gov.in. Retrieved 2020-10-28.
  3. "ఈనాడు". epaper.eenadu.net. Retrieved 2020-10-28.
  4. వెబ్ దునియా. "మిషన్ భగీరథ అంటే ఏమిటి?". www.telugu.webdunia.com. Retrieved 20 December 2016.
  5. ఇండియన్ ఎక్స్ ప్రెస్. "PM Modi to launch Mission Bhagiratha today: All you need to know". Retrieved 20 December 2016.
  6. హన్స ఇండియా. "PM launches first phase of Mission Bhagiratha". Retrieved 20 December 2016.
  7. "భగీరథ యత్నమే!". Sakshi. 29 July 2018. Retrieved 9 December 2018.