ప్రహార్ క్షిపణి

భారత్ తయారు చేసిన తక్కువ పరిధి బాలిస్టిక్ క్షిపణి

ప్రహార్ భూమి నుండి భూమ్మీదికి ప్రయోగించే, ఘన ఇంధన, తక్కువ పరిధి వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. ఇది అన్ని కాలాల్లోను, అన్ని భౌగోళిక పరిస్థితులలోనూ పనిచేసే, యుద్ధభూమి స్థాయి క్షిపణి. త్వరగా స్పందించడం దీని ప్రత్యేకత; అతి తక్కువ సమయంలో దీన్ని ప్రయోగానికి సిద్ధం చెయ్యవచ్చు.

ప్రహార్
రోడ్డు మొబైల్ లాంచరు నుండి ప్రయోగించిన ప్రహార్
రకంవ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి
అభివృద్ధి చేసిన దేశంభారత్
సర్వీసు చరిత్ర
వాడేవారుభారత్ సైన్యం
భారతీయ వాయు సేన
ఉత్పత్తి చరిత్ర
తయారీదారుభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO)
Bharat Dynamics Limited (BDL)
విశిష్టతలు
బరువు1280 కెజి[1]
పొడవు7.3 మీ[1]
వ్యాసం0.42 మీ[1]
వార్‌హెడ్సాంప్రదాయిక/అణు, 200 కెజి[1]

ప్రొపెల్లెంటుఘన
ఆపరేషను
పరిధి
150 km[1]
ఫ్లైటు ఎత్తు35 కిమీ [1]
వేగంMach 2.03 (2,487 km/h) (average speed)
గైడెన్స్
వ్యవస్థ
ఇనర్షియల్ నేవిగేషన్, టర్మినల్ [[యాక్టివ్ రాడార్ హోమింగ్]
లాంచి
ప్లాట్‌ఫారం
8 x 8 టాట్రా ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్

అభివృద్ధి, చరిత్ర మార్చు

DRDO దీని అభివృద్ధిని రెండేళ్ళలో పూర్తి చేసింది.[2]  యుద్ధభూమిలో వ్యూహాత్మక లక్ష్యాలను ఛేదించేందుకు ఈ తక్కువ పరిధి క్షిపణిని ఉపయోగిస్తారు. లక్ష్యానికి అనుగుణంగా రకరకాల వార్‌హెడ్‌లను దీనికి అమర్చవచ్చు. మొబైల్ ప్లాట్‌ఫారము 6 క్షిపణులను మోయగలదు. వీటిని సాల్వో లాగా పేల్చవచ్చు.[1] మొత్తం ఆరు క్షిపణుల్నీ ఒక్కసారే పేల్చడాన్ని సాల్వో అంటారు.

ఘన ఇంధనంతో నడిచే ఈ క్షిపణిని ప్రయోగించేందుకు అతి తక్కువ స్పందన సమయం సరిపోతుంది. 2-3 నిముషాల్లోపే దీన్ని సిద్ధం చేసి ప్రయోగించవచ్చు.[3]పినాక మల్టీ బారెల్ రాకెట్ లాంచరుకు, పృథ్వి బాలిస్టిక్ క్షిపణికీమధ్య గల అంతరాన్ని ప్రహార్ పూరిస్తుంది.[1][4][5]

2011 జూలై 21 న ప్రహార్ ను చాందీపూర్ లో పరీక్షించారు.[6][7][8]పరీక్షలో ఇది 150 కిమీ దూరాన్ని 250 సెకండ్లలో ప్రయాణించి [1][9] బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని 10 మీ. లోపు కచ్చితత్వంతో ఛేదించింది [2]

ప్రహార్ యొక్క ఎగుమతి రూపం ప్రగతి. సియోల్‌లో జరిగిన ADEX 2013 లో DRDO దీన్ని ప్రదర్శించింది.[10]

2018 సెప్టెంబరు 20 న ఒరిస్సాలోని ఇంటెరిం టెస్ట్ రేంజి లోని మూడవ లాంచి కాంప్లెక్సు నుండి ప్రహార్ ను పరీక్షార్థం ప్రయోగించారు. ఈ ప్రయోగం అనుకున్న అన్ని లక్ష్యాలనూ విజయవంతంగా సాధించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.[11] 

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు వనరులు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 Press Trust Of India (21 July 2011). "India successfully test-fires Prahaar missile". Hindustan Times. Archived from the original on 23 జూలై 2011. Retrieved 20 October 2011.
  2. 2.0 2.1 "Press Information Bureau English Releases". Retrieved 24 December 2014.
  3. "New short-range missile test July-end". The Asian Age. India. 3 July 2011. Retrieved 20 October 2011.
  4. Y. Mallikarjun. "India all set to test new short-range tactical missile". The Hindu. Retrieved 24 December 2014.
  5. "Prahaar Missile to be test-fired on Sunday – southindia – Orissa – ibnlive". Ibnlive.in.com. Archived from the original on 20 జూలై 2011. Retrieved 20 October 2011.
  6. "Short-range 'Prahar' missile test successful". NDTV.com. Retrieved 24 December 2014.
  7. "Prahaar missile test-fired successfully". Zee News. Retrieved 24 December 2014.
  8. India Successfully tests short range ballistic missile[permanent dead link]
  9. Shiv Aroor. "LIVEFIST: FIRST PHOTOS: Prahaar Missile Test". Retrieved 24 December 2014.
  10. "India develops new surface-to-surface missile 'Pragati'". India Today. 29 October 2013. Retrieved 28 November 2013.
  11. "ప్రహార్‌ క్షిపణి పరీక్ష సక్సెస్‌". 21 September 2018. Archived from the original on 21 సెప్టెంబరు 2018. Retrieved 23 సెప్టెంబరు 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)