ప్రాకృతిక సమృద్ధి
భౌతిక శాస్త్రంలో, ప్రాకృతిక సమృద్ధి (NA) అనేది ఒక గ్రహంపై సహజంగా కనిపించే మూలకాల ఐసోటోపుల సమృద్ధిని సూచిస్తుంది. ఈ ఐసోటోప్‌ల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి (మోల్-ఫ్రాక్షన్ సమృద్ధి సంఖ్యలను బట్టి) అనేది ఆవర్తన పట్టికలోని మూలకాల పరమాణు బరువు. ఐసోటోపు సమృద్ధి గ్రహాలను బట్టీ, భూమిపై వివిధ ప్రదేశాలను బట్టీ కూడా మారుతూ ఉంటుంది. అయితే కాలాన్ని బట్టి మాత్రం (స్వల్పకాలావధుల్లో) సాపేక్షంగా స్థిరంగా ఉంటుంది.
ఉదాహరణకు, యురేనియంకు మూడు సహజసిద్ధ ఐసోటోపులు ఉన్నాయి. అవి: 238U, 235U, 234U. వాటి సహజ మోల్-ఫ్రాక్షన్ సమృద్ధి 99.2739–99.2752%, 0.7198–0.7202%, 0.0050–0.0059%. [1] ఉదాహరణకు, 1,00,000 యురేనియం పరమాణువులను విశ్లేషించినట్లయితే వాటిలో, సుమారుగా 99,274 238U పరమాణువులు, సుమారుగా 720 235U పరమాణువులు, చాలా తక్కువ (5 లేదా 6) 234U అణువులూ ఉంటాయి. ఎందుకంటే 238U అనేది 235U లేదా 234U కంటే చాలా స్థిరంగా ఉంటుంది. ఈ విషయం వాటి అర్ధ జీవిత కాలాలు వెల్లడిస్తాయి: 238U కు ఇది 4.468×10 9 సంవత్సరాలు ఉండగా, 235U కు 7.038×108 సంవత్సరాలు 234U కు 2,45,500 సంవత్సరాలు.
వేర్వేరు యురేనియం ఐసోటోప్‌లు వేర్వేరు అర్ధ-జీవితాలను కలిగి ఉన్నందునే, భూమి చిన్న వయస్సులో ఉన్నప్పుడు, యురేనియం ఐసోటోపిక్ కూర్పు భిన్నంగా ఉండేది. ఉదాహరణకు, 235U యొక్క ప్రాకృతిక సమృద్ధి 1.7×10 9 సంవత్సరాల క్రితం 3.1%గా ఉండగా ఇప్పుడది ఈనాటి 0.7%. ఆ కారణంగానే అప్పట్లో ఒక సహజమైన అణు విచ్ఛిత్తి రియాక్టర్ ఏర్పడగలిగింది, అది నేడు జరగదు.
అయితే, ఒక ఐసోటోపు సహజ సమృద్ధి న్యూక్లియోసింథసిస్‌లో దాని సృష్టి యొక్క సంభావ్యత ద్వారా కూడా ప్రభావితమవుతుంది (సమారియం విషయంలో వలె; రేడియోధార్మిక 147Sm, 148Sm ల సమృద్ధి స్థిరమైన 144Sm కంటే చాలా ఎక్కువ) అలాగే ఇది ఐసోటోప్ ఉత్పత్తిని బట్టి కూడా ప్రభావితమవుతుంది - సీసం యొక్క రేడియోజెనిక్ ఐసోటోపుల లాగా.
కొన్ని మూలకాల ప్రాకృతిక సమృద్ధి
మార్చుభూమైపై కొన్ని మూలకాల ఐసోటోప్‌ల సమృద్ధిని కింది పట్టికలో చూడవచ్చు. భాస్వరం, ఫ్లోరిన్ వంటి కొన్ని మూలకాలు 100% ప్రాకృతిక సమృద్ధితో ఒకే ఐసోటోప్‌గా మాత్రమే ఉంటాయి.
ఐసోటోప్ | % ప్రాకృ. సమృద్ధి | పరమాణు ద్రవ్యరాశి |
---|---|---|
1H | 99.985 | 1.007825 |
2H | 0.015 | 2.0140 |
12C | 98.89 | 12 (నిర్వచనం ప్రకారం) |
13C | 1.11 | 13.00335 |
14N | 99.64 | 14.00307 |
15N | 0.36 | 15.00011 |
16O | 99.76 | 15.99491 |
17O | 0.04 | 16.99913 |
18O | 0.2 | 17.99916 |
28Si | 92.23 | 27.97693 |
29Si | 4.67 | 28.97649 |
30Si | 3.10 | 29.97376 |
32S | 95.0 | 31.97207 |
33S | 0.76 | 32.97146 |
34S | 4.22 | 33.96786 |
35 Cl | 75.77 | 34.96885 |
37 Cl | 24.23 | 36.96590 |
79Br | 50.69 | 78.9183 |
81Br | 49.31 | 80.9163 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Uranium Isotopes". GlobalSecurity.org. Retrieved 14 March 2012.