ప్రిన్స్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించాడు. శివ కార్తీకేయన్, మారియా ర్యాబోషప్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 9న విడుదల చేసి[2], సినిమాను తెలుగు, త‌మిళం భాష‌ల్లో అక్టోబర్ 21న విడుదల చేసి, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో నవంబర్ 25న స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

ప్రిన్స్
దర్శకత్వంకె.వి. అనుదీప్
రచనఅనుదీప్, మోహన్ సతో
మాటలుభీమ్ శ్రీనివాస్
నిర్మాతసునీల్ నారంగ్
డి.సురేష్ బాబు
పుష్కర్ రామ్మోహన్ రావు
తారాగణం
ఛాయాగ్రహణంమనోజ్ పరమహంస
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి
సురేష్ ప్రొడక్షన్స్
శాంతి టాకీస్
విడుదల తేదీs
2022 అక్టోబరు 21 (2022-10-21)(థియేటర్)
2022 నవంబరు 25 (2022-11-25)(డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీ )
సినిమా నిడివి
143 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ఆనంద్ (శివకార్తికేయన్) దేవరకొండ ఊరిలో స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటాడు. ఆదర్శ భావాలు కలిగిన ఆయన తండ్రి విశ్వనాథ్(సత్యరాజ్) వారి కుటుంబ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పెద్దమనిషిగా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఆంగ్లో ఇండియన్ అమ్మాయి జెస్సికా (మరియా) తో ఆనంద్ ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయితో తన కుమారుడు ఆనంద్ పెళ్లికి విశ్వనాథం ఒప్పుకోడు. సరిహద్దుల్లేని ప్రేమ ఆనంద్‌ను ఊరి నుంచి వెలివేసేందుకు ఎలా కారణమైంది? చివరికి ఆనంద్, జెస్సికా ఒక్కటవుతారా? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. "రన్‌టైమ్ లాక్ చేసుకున్న శివకార్తికేయన్ 'ప్రిన్స్'.. ఎంతో తెలుసా?". 12 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  2. "భారత్‌ అబ్బాయి- బ్రిటిష్‌ అమ్మాయి లవ్‌స్టోరీ.. ఆసక్తిగా 'ప్రిన్స్‌' ట్రైలర్‌". 10 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
  3. TV9 Telugu (25 November 2022). "ఓటీటీలోకి అడుగుపెట్టిన ప్రిన్స్‌..శివ కార్తికేయన్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (22 October 2022). "రివ్యూ: ప్రిన్స్‌". Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.
  5. "'ప్రిన్స్‌'గా.. శివ కార్తికేయన్‌". 10 June 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రిన్స్&oldid=4184168" నుండి వెలికితీశారు