ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ

(ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)

ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం.

ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ
Shield of Princeton University
లాటిన్: Universitas Princetoniensis[1]
పూర్వపు నామములు
కాలేజ్ ఆఫ్ న్యూ జెర్సీ (1746–1896)
నినాదంDei Sub Numine Viget (లాటిన్)[2]
On seal: Vet[us] Nov[um] Testamentum (లాటిన్)
ఆంగ్లంలో నినాదం
"Under God's Power She Flourishes"[2]
On seal: "Old Testament and New Testament"
రకంప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం
స్థాపితంఅక్టోబరు 22, 1746; 278 సంవత్సరాల క్రితం (1746-10-22)
విద్యాసంబంధ affiliations
  • AAU
  • COFHE
  • NAICU
  • URA
  • Space-grant
ఎండోమెంట్$35.8 బిలియన్లు (2022)[3]
అధ్యక్షుడుక్రిస్టొఫర్ ఎల్.ఐస్గ్రుబర్
అత్యున్నత పరిపాలనాధికారిజెన్నిఫర్ రెక్స్‌ఫోర్ఫ్
విద్యాసంబంధ సిబ్బంది
1,068 (fall 2021)[4]
విద్యార్థులు8,478 (fall 2021)[4]
అండర్ గ్రాడ్యుయేట్లు5,321 (fall 2021)[4]
పోస్టు గ్రాడ్యుయేట్లు3,157 (fall 2021)[4]
డాక్టరేట్ విద్యార్థులు
2,631 (fall 2019)[5]
స్థానంప్రిన్స్‌టన్, న్యూ జెర్సీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
40°20′43″N 74°39′22″W / 40.34528°N 74.65611°W / 40.34528; -74.65611[6]
వార్తాపత్రికది డైలీ ప్రిన్స్‌టనేనియన్
అథ్లెటిక్ మారుపేరుటైగర్స్
క్రీడా అనుబంధాలు
మస్కట్ది టైగర్

చరిత్ర

మార్చు

1746లో కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ పేరుతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం, సంయుక్త రాష్ట్రాలలో నాల్గవ పురాతన ఉన్నత విద్యాసంస్థ. అమెరికన్ విప్లవానికి ముందు చార్టర్ చేయబడిన తొమ్మిది వలసరాజ్యాల కళాశాలలలో ఇది ఒకటి. ఈ విద్యాసంస్థ 1756లో ప్రస్తుతం ఉన్న ప్రిన్స్‌టన్‌కు తరలించబడింది. ఇది అధికారికంగా 1896లో విశ్వవిద్యాలయంగా మారి, ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంగా పేరు మార్చబడింది.

క్యాంపస్

మార్చు

ప్రధాన క్యాంపస్ న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో 600 భవంతులను కలిగి ఉంది. ఈ క్యాంపస్‌లోని మొదటి భవంతి నస్సౌ హాల్(Nassau Hall) 1756లో నిర్మించబడింది. ఈ భవనం చుట్టూ విశ్వవిద్యాలయం క్రమేణా అభివృద్ధి చెందింది. ఆర్ట్ లైబ్రరీ, యూనివర్సిటీ చాపెల్, క్లీవ్‌లాండ్ టవర్, ఫైర్‌స్టోన్ లైబ్రరీ, ఐవీ క్లబ్, విగ్ హాల్, ఫోర్బ్స్ కాలేజి, మాథీ కాలేజ్, రాక్‌ఫెల్లర్ కాలేజ్, విట్‌మాన్ కాలేజ్ మొదలైనవి చెప్పుకోదగిన భవనాలు.

సంస్థాగత పరిపాలన

మార్చు

ఈ విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆజమాయిషీలో నడుస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు (20వ అధ్యక్షుడు) క్రిస్టఫర్ ఐస్గ్రుబర్‌ను 2013లో నియమించారు. బోర్డ్‌లో 23 నుండి 40 మంది సభ్యులు ఉంటారు. న్యూజెర్సీ గవర్నర్ ఈ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తాడు. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నింటికీ ఈ బోర్డు అనుమతి తప్పనిసరి. ఈ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాఢ్యుయేట్ కాలేజ్, గ్రాడ్యుయేట్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, బెందీమ్ సెంటర్ ఫర్ ఫైనాన్స్ మొదలైనవి ఉన్నాయి. ప్రిన్స్‌టన్ లా స్కూల్ కొద్ది కాలం మాత్రం మనుగడలో ఉండేది. 1852లో దీనిని మూసివేశారు.

కోర్సులు

మార్చు

ఈ విశ్వవిద్యాలయం అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్(A.B.), బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (B.S.E.)లను అందిస్తున్నది. ఆర్ట్స్ విద్యార్థులు 31 కోరులను, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 36 కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ కోర్సులలో మాస్టర్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీలను 42 విభాగాలలో అందిస్తున్నది.

కొందరు పూర్వ విద్యార్థులు

మార్చు
 
1879లో ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ విద్యార్థులు

కొందరు అధ్యాపకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. John de Witt (1899). "Princeton University". In David Murray (ed.). History of Education in New Jersey. U.S. Government Printing Office. p. 285.
  2. 2.0 2.1 "Princeton Milestones". A Princeton Profile. Princeton University. 2020. Archived from the original on June 28, 2021. Retrieved July 21, 2021.
  3. "As markets fluctuate, Princeton's endowment supports almost every aspect of the University". princeton.edu. October 28, 2022. Archived from the original on February 15, 2023. Retrieved February 15, 2023.
  4. 4.0 4.1 4.2 4.3 "Common Data Set 2021–2022" (PDF). Princeton University. Archived (PDF) from the original on December 6, 2022. Retrieved December 18, 2022.
  5. "Enrollment Statistics". The Graduate School. Princeton University. Archived from the original on July 21, 2021. Retrieved July 21, 2021.
  6. "Princeton University". Geographic Names Information System. United States Geological Survey, United States Department of the Interior.