ప్రియాంక జార్కిహోలి

ప్రియాంక సతీష్ జార్కిహోళి (జననం 16 ఏప్రిల్ 1997) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికై 18వ లోక్‌సభలో గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన అతి పిన్న గిరిజన మహిళగా రికార్డు సృష్టించింది.[1][2]

ప్రియాంక జార్కిహోలి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
నియోజకవర్గం చిక్కోడి

వ్యక్తిగత వివరాలు

జననం (1997-04-16) 1997 ఏప్రిల్ 16 (వయసు 27)
బెలగావి, కర్ణాటక
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు సతీష్ జార్కిహోళి, శకుంతల

జననం, విద్యాభాస్యం

మార్చు

ప్రియాంక జార్కిహోలి 16 ఏప్రిల్ 1997న కర్నాటక రాష్ట్రం, చిక్కోడి జిల్లా, యమకనమర్డి గ్రామంలో సతీష్ జార్కిహోళి, శకుంతల దంపతులకు జన్మించింది. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసి, బెలగావిలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్టేరియన్ (ఎంబీఏ) పూర్తి చేసింది .

రాజకీయ జీవితం

మార్చు

ప్రియాంక జార్కిహోలి తన తండ్రి సతీష్ జార్కిహోళి అడుగుజాడల్లో రాజాకీలలోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అన్నాసాహెబ్ శంకర్ జోల్లె పై 90834 ఓట్ల మెజారిటీతో గెలిచి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలైన గిరిజన మహిళగా రికార్డు సృష్టించింది.ఆమె లోక్‌సభ ఫలితాల ప్రకటన రోజు 2024 జూన్ 4 నాటికి ఆమె వయస్సు 27 సంవత్సరాల 1 నెల 18 రోజులు.[3][4][5]

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Chikkodi". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  2. The Hindu (5 June 2024). "Priyanka Jarkiholi is the youngest tribal woman to win from an unreserved seat" (in Indian English). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  3. The New Indian Express (5 June 2024). "Congress' Priyanka Jarkiholi now one of the youngest MPs in Parliament" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  4. The Week (30 June 2024). "Priyanka Jarkiholi: Meet the first tribal woman to win from an unreserved constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  5. The Times of India (5 June 2024). "Priyanka Jarkiholi wins in Chikkodi". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.