ప్రేమికుడు

1994 తమిళ అనువాద చిత్రం

ప్రేమికుడు 1994 లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఒక తమిళ అనువాద చిత్రం. తమిళ చిత్రం కాదలన్ దీనికి మూలం. ఇందులో ప్రభుదేవా, నగ్మా ప్రధాన పాత్రధారులు. ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.

ప్రేమికుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. శంకర్
నిర్మాణం కె.టి.కుంజుమన్
రచన ఎస్. శంకర్
తారాగణం ప్రభుదేవ
నగ్మా
రఘువరన్,
వడివేలు,
గిరీష్ కర్నాడ్,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం ఏ.ఆర్.రెహమాన్
గీతరచన రాజశ్రీ
కళ తోట తరణి
కూర్పు వి. టి. విజయన్, బి.లెనిన్
నిడివి 168 నిమిషాలు
భాష తెలుగు

కథ మార్చు

ప్రభు గవర్నమెంటు ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు. తమ కళాశాల వార్షికోత్సవానికి గవర్నరు కాకరాల సత్యనారాయణమూర్తి ని ఆహ్వానించమని అతన్ని కళాశాల ప్రిన్సిపల్ కోరతాడు. అక్కడికి వెళ్ళిన ప్రభుకు కాకర్ల కూతురు శృతిని చూసి ప్రేమలో పడతాడు. శృతి మొదట్లో అతని అల్లరి చూసి ద్వేషించినా తర్వాత అతని సిన్సియారిటీ చూసి ప్రేమలో పడుతుంది.

తారాగణం మార్చు

పాటలు మార్చు

  • అందమైన ప్రేమరాణి
  • అలలవలె వాన
  • ఊర్వశి ఊర్వశి
  • ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
  • ఓ చెలియా నా ప్రియసఖియా
  • మండపేట మలక్ పేట
  • ముక్కాల ముకాబలా

అవార్డులు మార్చు

భారత జాతీయ సినీ పురస్కారాలలో 1995 సంవత్సరానికి ఉత్తమ నేపథ్య గాయకునిగా ఉన్నికృష్ణన్ కు బంగారు కమలం లభించింది.

బయటి లింకులు మార్చు