తోట తరణి

భారతీయ కళా దర్శకుడు

తోట తరణి ఒక ప్రముఖ సినీ కళా దర్శకుడు. జాతీయ పురస్కార గ్రహీత.[1] సుమారు 100 సినిమాలకు పైగా కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు.

తోట తరణి
తోట తరణి
జననం
తోట తరణి

(1949-12-16) 1949 డిసెంబరు 16 (వయసు 74)
బందరు
వృత్తికళా దర్శకత్వం
తల్లిదండ్రులు
  • తోట వెంకటేశ్వర రావు (తండ్రి)
వెబ్‌సైటు[1]

వ్యక్తిగత జీవితం మార్చు

తోట తరణి పుట్టింది మద్రాసులో. తండ్రి తోట వెంకటేశ్వర రావు నాటకరంగ కళాకారుడు. ఆడ వేషాలు వేయడంలో నేర్పరి. ఆయనకు ఎనిమిది మంది సంతానం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తం సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వెళ్ళాడు. మల్లీశ్వరి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. జయసింహ, అమరదీపం, పాండురంగ మహత్మ్యం, శంకరాభరణం, సిరిసిరిమువ్వ తదితర ప్రఖ్యాత సినిమాలకు ఆయనే కళాదర్శకుడు. దాంతో ఆయనకు మంచి పేరు వచ్చింది.[2]

తరణికి ఐదేళ్ళ వయసు నుండే కళారంగం మీద ఆసక్తి మొదలైంది. కాగితం దొరికితే ఏదో ఒక బొమ్మలు గీస్తుండే వాడు. ఆయన చదువుకూడా సరిగా సాగలేదు. ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి తప్పాడు. తరువాత ఎన్. టీ. ఆర్ ప్రోత్సాహంతో మళ్ళీ చదివి మెట్రిక్యులేషన్ పాసై తరువాత చిత్రలేఖనంలో డిప్లోమా, పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. తరువాత ముంబైలో ఒక కంపెనీలో ఆర్టిస్టుగా పనిచేశాడు. మద్రాసుకు తిరిగి వచ్చి తండ్రికి సినిమా సెట్లలో సహకరించడం మొదలుపెట్టాడు.

కెరీర్ మార్చు

తండ్రితో పనిచేసేటపుడు తరణి ప్రతిభను గమనించిన దేవదాస్ కనకాల తన దర్శకత్వం నాగమల్లి అనే సినిమాలో అవకాశం కల్పించారు. తరువాత అమావాస్య చంద్రుడు,మౌనరాగం, నాయకుడు, అంజలి, దళపతి, రోజా, బొంబాయి తదితర విజయవంతమైన చిత్రాలకు పనిచేయడంతో అతని ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది. గీతాంజలి, శివ, చైతన్య, నిర్ణయం, చినరాయుడు, శుభ సంకల్పం, చూడాలని ఉంది, మృగరాజు, మాస్ లాంటి కమర్షియల్ చిత్రాలకు కూడా పనిచేశాడు. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా కోసం మదుర మీనాక్షి దేవాలయం సెట్టు వేశాడు. తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో కూడా అప్పటి కాలానికి తగ్గ సెట్లు వేశాడు.

పురస్కారాలు మార్చు

 
పద్మశ్రీపురస్కారం

చిత్ర సమాహారం మార్చు

మూలాలు మార్చు

  1. రెంటాల, జయదేవ. "ఆయన పోలికలున్నాయని నన్ను నటించమన్నారు!". sakshi.com. సాక్షి. Retrieved 18 December 2016.
  2. "దర్శకుడిది 'కల'.. తరణిది 'కళ'". eenadu.net. ఈనాడు. Retrieved 18 December 2016.[permanent dead link]
  3. "Thotta Tharani's profile". Archived from the original on 2008-02-20. Retrieved 2011-10-21.
  4. https://archive.org/download/46thFilmfareAwardsSouthWinners/46th%20Filmfare%20Awards%20south%20winners.jpg

బయటి లింకులు మార్చు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=తోట_తరణి&oldid=3704928" నుండి వెలికితీశారు