ప్రేరణ దేశ్ పాండే
ప్రేరణ దేశ్ పాండే, ప్రముఖ భారతీయ కథక్ నృత్య కళాకారిణి.[1]
ప్రేరణా దేశ్‌పాండే | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
పౌరసత్వం | భారతీయురాలు |
విద్య | భారతీయ శాస్త్రీయ నృత్యం, గణితం |
విద్యాసంస్థ | సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం |
వృత్తి | క్లాసికల్ డాన్సర్, కొరియోగ్రాఫర్, పరిశోధకురాలు |
నృత్యధామ్ | |
శైలి | కథక్ |
పురస్కారాలు | దేవదాసి జాతీయ అవార్డు |
ఆమె తన 7వ ఏటనే షరదినీ గోలే వద్ద కథక్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. 15వ ఏట అరంగేట్రం చేసింది ప్రేరణ. ఆ తరువాత ఆమె రోహిణి భాటే వద్ద లక్నో, జైపూర్ ఘరనా సంప్రదాయంలో కథక్ లో 22 ఏళ్ళ పాటు శిక్షణ పొందింది. ఆమె కథక్ లో మంచి ప్రావిణ్యం పొందింది.[2][3]
పూణె విశ్వవిద్యాలయంలోని లలిత కళా కేంద్రంలో చదువుకొంది ప్రేరణ. గణితంలో డిగ్రీ చదువుకొన్న ఆమె,[4] కథక్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. మాస్టర్స్ లో విశ్వవిద్యాలయం ప్రధమురాలిగా నిలిచింది ఆమె.
మూలాలు
మార్చు- ↑ Kulkarni, Pranav (24 April 2010). "Step by Step". Retrieved 5 January 2017.
- ↑ Macaulay, Alastair (21 August 2009). "Just Try to Pass by Without Being Stunned". Retrieved 5 January 2017.
- ↑ Kothari, Dr. Sunil (10 September 2009). "New York Diary: Erasing Borders Dance Festival". Retrieved 5 January 2017.
- ↑ Grover, Heena (26 February 2016). "They have danced their way to glory". Retrieved 25 November 2016.[permanent dead link]