ఫతేగఢ్ సాహిబ్

పంజాబ్ లోని పట్టణం

ఫతేగఢ్ సాహిబ్ పంజాబ్ లోని పట్టణం. ఇది సిక్కు మతస్థులకు పవిత్ర తీర్థయాత్రా స్థలం, ఫతేగఢ్ సాహిబ్ జిల్లాకు ముఖ్యపట్టణం. గురు గోవింద్ సింగ్ యొక్క 7 సంవత్సరాల కుమారుడు ఫతే సింగ్ పేరు మీద పట్టణానికి ఈ పేరు పెట్టారు. 18 వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన ముస్లిం-సిక్కు యుద్ధంలో ఫతే సింగ్‌ను అతని 9 ఏళ్ల సోదరుడు జొరావర్ సింగ్తో పాటు మొఘల్ సైబికులు పట్టుకుని, సేనాధిపతి వజీర్ ఖాన్ ఆదేశాల మేరకు సజీవంగా సమాధి చేసారు. [1] [2] వాళ్ళు అమరవీరులైన తరువాత 1705 లో ఈ పట్టణం అనేక చారిత్రిక సంఘటనలను చూసింది. పట్టణంపై ఆధిపత్యం సిక్కు, ముస్లిం పాలకుల మధ్య పదేపదే మారుతూ వచ్చింది. [3]

ఫతేగఢ్ సాహిబ్
పట్టణం
Fatehgarh Sahib Gurdwara
ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారా
ఫతేగఢ్ సాహిబ్ is located in Punjab
ఫతేగఢ్ సాహిబ్
ఫతేగఢ్ సాహిబ్
పంజాబ్‌లో పట్టణ స్థానం
Coordinates: 30°38′50″N 76°23′35″E / 30.64722°N 76.39306°E / 30.64722; 76.39306
దేశం India
రాష్ట్రంపంజాబ్
జిల్లాఫతేగఢ్ సాహిబ్
Named forబాబా ఫతే సింగ్, గురు గోవింద్ సింగ్ కుమారుడు
Elevation
246 మీ (807 అ.)
జనాభా
 • Total50,788
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
PIN
140406,140407
టెలిఫోన్ కోడ్+91-1763
Vehicle registrationPB-23
[1]

ఈ పట్టణంలో చారిత్రిక గురుద్వారాలు ఉన్నాయి. భూగర్భంలో ఉన్న భోరా సాహిబ్ వీటిలో ఒకటి. ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించి నిర్భయంగా ఎదురు తిరిగినపుడు ఆ ఇద్దరు బాలురనూ సజీవంగా సమాధి చేసిన స్థలం ఇదే. [1] [4]

ఎస్.జి.పి.సి నడుపుతున్న గురు గ్రంథ్ సాహిబ్ విశ్వవిద్యాలయం, బాబా బందా సింగ్ బహదూర్ ఇంజనీరింగ్ కళాశాలలు పట్తణంలో ఉన్నాయి. [5]

తోడరమల్లు హవేలి

మార్చు

అత్యంత గురు గోబింద్ సింగ్ ఇద్దరు పిల్లలు, అతని తల్లి బలిదానమైన తరువాత, మొగలులను ధిక్కరించి వారి అంత్య క్రియలను జరిపించాడు. అప్పటి హవేలీ ఇప్పటికీ ఉంది. దాన్ని తోడరమల్లు హవేలీ అంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Gurmukh Singh (2009), Fatehgarh Sahib, Encyclopedia of Sikhism, Editor in Chief: Harbans Singh, Punjab University
  2. W. H. McLeod (2009). The A to Z of Sikhism. Scarecrow. p. 65. ISBN 978-0-8108-6344-6.
  3. H. S. Singha (2000). The Encyclopedia of Sikhism (over 1000 Entries). Hemkunt Press. pp. 186–187. ISBN 978-81-7010-301-1.
  4. Harish Jain (2003). The Making of Punjab. Unistar. p. 289.
  5. Pashaura Singh; Louis E. Fenech (2014). The Oxford Handbook of Sikh Studies. Oxford University Press. p. 555. ISBN 978-0-19-100412-4.