ఫరూఖ్‌నగర్ మండలం

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం
(ఫరూఖ్ నగర్ మండలం నుండి దారిమార్పు చెందింది)


ఫరూఖ్‌నగర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] మండల కేంద్రమైన ఫరూఖ్‌నగర్ను షాద్‌నగర్ అని కూడా అంటారు. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం షాద్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

ఫరూఖ్ నగర్
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్ నగర్ స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్ నగర్ స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్ నగర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°04′40″N 78°12′04″E / 17.0778°N 78.2011°E / 17.0778; 78.2011
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం ఫరూఖ్ నగర్
గ్రామాలు 30
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,12,633
 - పురుషులు 57,361
 - స్త్రీలు 55,272
అక్షరాస్యత (2011)
 - మొత్తం 57.95%
 - పురుషులు 69.32%
 - స్త్రీలు 46.01%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 1,12,458. ఇందులో పురుషుల సంఖ్య 57,299, స్త్రీల సంఖ్య 55,159. అక్షరాస్యుల సంఖ్య 68042.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 280 చ.కి.మీ. కాగా, జనాభా 112,633. జనాభాలో పురుషులు 57,361 కాగా, స్త్రీల సంఖ్య 55,272. మండలంలో 26,214 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు

మండలంలోని ప్రముఖులు

మార్చు
  • బూర్గుల రామకృష్ణా రావు:హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు షాద్‌నగర్ మండలానికి చెందిన వ్యక్తి. 1915 నుంచే ఈయన పోరాటం ప్రారంభమైంది. పలుమార్లు జైలుకు వెళ్ళినాడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా గేయాలు, రచనలు చేసి ప్రజలలో ఉత్తేజం కలిగించాడు. ఈయన స్వస్థలం ఈ మండంలోని బూర్గుల గ్రామం. ఇంటిపేరు పుల్లంరాజు అయిననూ ఊరిపేరే ఇంటిపేరుగా మారిపోయింది. 1952లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ అవరతణకు వీలుగా ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు. ఆ తర్వాత కేరళ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడు.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు