షాద్‌నగర్ రెవెన్యూ డివిజను
షాద్‌నగర్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. రంగారెడ్డి జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం షాద్‌నగర్ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
షాద్‌నగర్ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]
పరిపాలన
మార్చుషాద్నగర్ డివిజన్‌లోని మండలాలు:[5]
క్ర.సం | షాద్‌నగర్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | నందిగామ మండలం | 5 రెవెన్యూ గ్రామాలు |
2 | కొత్తూరు మండలం | 11 రెవెన్యూ గ్రామాలు |
3 | ఫరూఖ్‌నగర్ మండలం | 36 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
4 | కేశంపేట మండలం | 20 రెవెన్యూ గ్రామాలు |
5 | కొందుర్గు మండలం | 19 రెవెన్యూ గ్రామాలు |
6 | చౌదర్‌గూడెం మండలం | 17 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-10-13.
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-10-13.
- ↑ "DIVISIONS | RangaReddy District Government of Telangana | India". Archived from the original on 2021-11-27. Retrieved 2022-10-13.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-10-13.